Bjp kishan reddy says ghmc elections will be won by bjp

BJP, GHMC, MIM, BJP win Hyderabad municipal elections, Amit shah visiting Hyderabad, Kishan Reddy

BJP to win Hyderbad municipal elections says Kishan Reddy

మజ్లిస్ హటావో, బిజెపి జితావ్ - కిషన్ రెడ్డి

Posted: 08/21/2014 09:46 AM IST
Bjp kishan reddy says ghmc elections will be won by bjp

భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అద్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఇప్పుడు మజ్లిస్ హటావో, బిజెపి జితావ్ నినాదంతో ముందుకు వెళతామని అంటూ టిడిపి గురించి ప్రస్తావించకపోవడం విశేషం.

ప్రస్తుతం తెలుగుదేశం ,బిజెపిలు మిత్రపక్షాలుగా ఉండగా, కిసన్ రెడ్డి టిడిపితో సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం బిజెపి దక్కించుకుంటుందని ప్రకటిస్తున్నారు. అంటే ముందస్తుగానే టిడిపిని ఇరుకున పెట్టే ఉద్దేశ్యమో, లేక ఒకవేళ బిజెపితో పొత్తు కుదుర్చుకోవాలంటే మేయర్ పీఠాన్ని వదులుకోవాలన్న సంకేతం ఇవ్వడమో కాని ఇది రెండు పార్టీల మధ్య వివాదం కావచ్చు. బిజెపి అగ్రనేతలను చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో బాగా పొగుడుతున్నారు.అయినా కిషన్ రెడ్డి మాత్రం ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో టిడిపితో పొత్తు వద్దని గతంలో కూడా ఆయన వాదించారు..

బీజేపీ స్టార్ లీడర్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించున్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కి వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటిసారి దక్షిణాది రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన హైదరాబాద్‌కి వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదే వేదికమీద పలువురు బీజేపీలో చేరతారు. వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా వుంటారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  kishan Reddy  GHMC  Amit Shah  MIM  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more