Telangana survey 100 not completed

telanagana survey, samagra kutumba survey 2014, survey details, telangana government, kcr, trs, survey news, telangana news, latest updates

telangana government succesfully completed samagra kutumba survey 2014 : telangana government reached target in survey but not completed fully

అసంపూర్ణంగా సర్వే

Posted: 08/20/2014 10:09 AM IST
Telangana survey 100 not completed

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయింది. సర్వేతో అంతా సొంత ఊర్లకు వెళ్లారు. దీంతో ఊర్లన్ని కళకళలాడాయి. తమవారిని కలుసుకోవటంతో పాటు బందవుల ఇంటికి వెళ్ళి పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇక ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని, ఆధారాలు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. పది జిల్లాల ప్రజలు మంగళవారం ఇంటిపట్టునే ఉన్నారు. బయటకు వెళ్దామంటే ఎప్పడు ఎన్యూమరేటర్ వస్తాడో అని తెలియని పరిస్థితి.., వచ్చిన సమయంలో లేకపోతే భవిష్యత్ లో ఎలా అనే భయం దీంతో కాలు బయటకు కదపలేదెవరూ. సర్వే పూర్తయినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఈ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుందని.., వారు కూడా త్వరలోనే ఈ విధంగా సర్వే చేయిస్తారని ఆశించారాయన.

అయితే తెలంగాణలో సర్వే 100శాతం జరగలేదు. అలాగని సర్వే విఫలమైందని చెప్పలేము. గరిష్టంగా 98శాతం నమోదయింది. ఇక జిల్లాల వారిగా మంగళవారం రాత్రి వరకున్న సమాచారం ప్రకారం సర్వేశాతం చూస్తే.., నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా 98శాతం సర్వే జరిగింది. అదిలాబాద్ జిల్లాలో 96శాతం, నిజామాబాద్ జిల్లాలో 93శాతం, రంగారెడ్డి జిల్లాలో 89శాతం, వరంగల్ జిల్లాలో 86శాతం సర్వే జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. అయితే హైదరాబాద్ జిల్లా (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి)లో మాత్రం సర్వే ఎనబై శాతానికి కూడా చేరలేదు. జీహెచ్ ఎంసీలో కేవలం 77శాతం మాత్రమే సర్వే జరిగింది. మిగతా శాతం ఇళ్ళకు తాళాలు వేసి ఉండటంతో వివరాలు నమోదు చేసుకోలేకపోయామని ఎన్యూమరేటర్లు తెలిపారు. అంటే వీరిలో చాలావరకు జిల్లాలకు చెందిన వారున్నట్లు లెక్క. మొత్తంగా సర్వే ఆశించిన స్థాయిలో జరిగింది కానీ.., వంద శాతం జరగలేదని లెక్కలు చెప్తున్నాయి.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  samagra kutumba survey  kcr  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more