Cm kcr comments on telangana survey

telangana cm kcr, kcr latest news, kcr telangana survey, kcr latest press meet, kcr press meet, kcr chandrababu

cm kcr comments on telangana survey : telangana cm kcr comments on survey and requested people to support the survey and give full information for better future

సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేస్తేనే భవిష్యత్!

Posted: 08/18/2014 06:23 PM IST
Cm kcr comments on telangana survey

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే! ఈ విషయానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమతమ స్టేట్ మెంట్లను వెల్లడించారు. ఈ సర్వేలో రేషన్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వరకు అన్ని ఇస్తేనే చెల్లుతాయంటూ కొంతమంది టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ప్రకటించగా... దానిని తిప్పికొడుతూ హైకోర్టు స్వచ్ఛందంగా ఈ సర్వేలో పాల్గొనేవారు పాల్గొనవచ్చు లేకపోతే లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అంటే.. అన్నీ వివరాలు కాకపోయినప్పటికీ.. కనీసం ఇంట్లో వున్న వ్యక్తుల సంఖ్య వారు చేస్తున్న ఉద్యోగ వివరాలు ఇచ్చుకోవాల్సింది వుంటుంది.. లేదా అది కూడా ఇవ్వనవసరం లేదంటూ కోర్టు ఆర్డర్లు జారీ చేసింది. అయితే పూర్తి వివరాలు ఇస్తేనే తెలంగాణాలో వున్న ప్రజలకు మంచి భవిష్యత్ వుంటుందని టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తూనే వున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సర్వే గురించి మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. సర్వే చేసే అధికారులకు ప్రజలు పూర్తి సమాచారం అందించి.. సర్వేకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ సర్వేను నిర్వహిస్తున్నామని.. ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకుని దాని ప్రకారమే కొత్త ప్రణాళికలు తీసుకురావడం కోసమేని ఇలా చేయాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. అంటే ఈయన కూడా ప్రజలు మంచి భవిష్యత్తును కోరుకోవాలంటే.. ఈ సర్వేలో పూర్తి సమాచారాలు అందించి, తమకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సర్వేలో భాగం పంచుకోవడంలో మేలుంటుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana survey  trs party leaders  telangana people  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more