Bjp government asks 16 ex ministers to vacate houses notices issued

Eviction notice to Chiru, Chiranjeevi eviction notice, Venkaiah Naidu issues eviction notice to Chiru, 16 ministers eviction notice, ex-ministers eviction,

Vankaiah Naidu informed that eviction notices are issued to 16 ex-ministers to vacate the houses occupied by them in New Delhi.

చిరంజీవి సహా 16మందికి నోటీసులు: ఇళ్లు ఖాళీచేయండి

Posted: 07/31/2014 10:46 AM IST
Bjp government asks 16 ex ministers to vacate houses notices issued

మొత్తం 16 మంది తమ బంగళాలను వెంటనే ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ తాఖీదులు పంపింది. వీరిలో మన రాష్ట్రానికి చెందిన పళ్లం రాజు, జైపాల్ రెడ్డి, కిల్లి కృపారాణి, బలరాం నాయక్ ఉన్నారు. మరికొందరు మాజీ మంత్రులు జనరల్ పూల్ బంగాల్లో ఉంటున్నారని, వీరిలో రాజ్యసభ, లోకసభ సభ్యులుగా ఉన్న వారు ప్రస్తుతం కేటాయించిన నివాసాలకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మాజీ మంత్రుల జాబితాలో చిరంజీవి, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండేజ్, రహమాన్ ఖాన్, జ్యోతిరాదిత్య సింధియా, మునియప్ప, రాజీవ్ శుక్లా, శశిథరూర్, ముళ్లపల్లి రామచంద్రన్, కెసి వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌదరి, నాచియప్పన్, ఎహెచ్ ఖాన్ చౌదరి, నినాంగ్ ఎర్రింగ్ ఉన్నారు.

అయితే ఈ జాబితాలో జైపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన కొద్దిరోజుల క్రితమే 8, తీస్ జనవరి మార్గ్లోని తన బంగళాను ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారట. ఇళ్లు ఖాళీ చేయని మిగతా మాజీ కేంద్ర మంత్రుల్లో ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్, కపిల్ సిబాల్, బేణీ ప్రసాద్ వర్మ, గిరిజా వ్యాస్, కృష్ణ తీర్థ్, శ్రీకాంత్ జెనా, సచిన్ పైలట్, జితేందర్ సింగ్, ప్రదీప్ జైన్ ఆదిత్య, లాల్ చంద్ కటారియా, మాణిక్ రావ్ గవిట్ ఉన్నట్లు వెంకయ్య బుధవారం లోకసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

ఇళ్లు ఖాళీ చేయని మంత్రులు అనధికారికంగా ఉన్నందుకు జూలై 26 వరకు రూ. 20,92,463 చెల్లించాలని ఆయన ఆదేశించారు. కాగా ఇప్పటివరకూ సాధారణ పూల్ బంగళాల్లో ఉన్నమాజీ కేంద్ర మంత్రులు ప్రస్తుతం పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నప్పటికీ హోదా మారినందువల్ల తమ హౌజ్ కమిటీలు కేటాయించిన ఇళ్లలోకి మారాలని, అందుకు 15 రోజుల సమయం అదనంగా ఇచ్చామన్నారు. దాదాపు 683 ఫ్లాట్లలో మాజీ ఉద్యోగులు అనధికారికంగా ఉంటున్నారని, వారికి కూడా నోటీసులు వెళ్లాయన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం లోకసభలో ఈ వివరాలు వెల్లడించారు.

 

-----------

The Urban Development Ministry has issued evictions notices to 16 former ministers who are yet to vacate the houses allotted to them and have run up a combined bill of Rs. 20,92,463 on account of a month's rent.

These former ministers had time till July 26 to vacate their house, but have failed to move out, Union Urban Development Minister Venkaiah Naidu told the Lok Sabah in a written reply.These former ministers included, Dr.K.Chiranjivi, A.K. Anthony, Shashi Tharoor, Ghulam Nabi Azad, Mallikarjuna Kharge, , Rajiv Shukla ,Veerappa Moily, Vyalar Ravi, Oscar Fernandes, Jairam Ramesh, Jyothiraditya Scindia, K.V. Thomas, K. Ranhman Khan, J. Seelam K.H. Muniyappa, Mullappally Ramachandran, Adhir Ranjan Chowdhury, A.H. Khan Choudhury, Ninon Erring, , K.C. Venugopal and Dr.E.M. Sudershan Nachiappan.

While Lalu Prasad has been given extension till October 2014, family members of the late Sisram Ola would be allowed to stay till next year. Mallikarjun Kharge has been allowed to retain his house till a decision on the Leader of Opposition is taken, they said.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more