Model rape case dig sunil paraskar to be quizzed again

Model Rape Case DIG, Mumbai, Model Rape Case DIG Sunil Paraskar, Model, DIG Sunil Paraskar, Rape, Accuse, Complaint, Police, Threat, Service Providers, Calls, Case with draw

Model Rape Case DIG Sunil Paraskar to be quizzed again :Accused of rape, Mumbai additional CP Sunil Paraskar to be quizzed again ... Mumbai: DIG Sunil Paraskar calls model's rape allegations baseless ... The police have also submitted their report on the rape case to Director General of Police

బతుకు బుగ్గిపాలు చేసి-ఘాటైన హెచ్చరికలు?

Posted: 07/30/2014 08:19 AM IST
Model rape case dig sunil paraskar to be quizzed again

డీఐజీ సునీల్ పరస్కర్ అత్యాచారం చేశారని ముంబై పోలీసులను ఆశ్రయించిన మోడల్‌కు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. డీఐజీపై పెట్టిన కేసును వాపసు తీసుకోవాలని ఒత్తిడి పెడుతున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్నారని ఆరోపిస్తూ మరోసారి ఠాణా గడపతొక్కింది సదరు మహిళ. తనకు ప్రాణరక్షణ కల్పించాలని మొరపెట్టుకుంది.

దీంతో స్పందించిన పోలీసులు ఆమెకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు తీగ లాగేందుకు రెడీ అయ్యారు. మోడల్, డీఐజీ ఇద్దరి కాల్‌డేటా ద్వారా కూపీలాగేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఐజీ సునీల్ పరస్కర్ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించాలని చూస్తున్నారు. అంతేకాదు ఆయన సన్నిహితులను విచారించనున్నారు. డీఐజీ దగ్గర పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించి వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు ముంబై సీపీ రాఖేష్ మారియా తెలిపారు.

2013లో పరస్కర్‌ తనపై పదే పదే పైశాచికంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదులో మోడల్‌ వెల్లడించింది. నార్త్ జోన్‌ ఏసీపీగా పరస్కర్‌ పనిచేస్తున్న సమయంలో తన పట్ల హేయంగా ప్రవర్తించాడని వాపోయింది. ఓ కేసు విషయంలో న్యాయం కోసం ఆశ్రయిస్తే తన బతుకు బుగ్గిపాలు చేశాడంది. ఇళ్లు చూపిస్తానని ఒకసారి, మధు ఐలాండ్‌లో ఉచితంగా ఫోటో షూట్‌కు అవకాశం ఇప్పిస్తానని మరోసారి తనతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని తెలిపింది. హోటల్‌లో మత్తుమందు ఇచ్చి బలాత్కరం చేసి, ఆ తర్వాత బ్రోతల్‌ కేసు కింద అరెస్ట్ చేశాడంది. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న ముంబై పోలీసులు త్వరలోనే ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more