నెలరోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఈ రోజు అంతిమ దినాన్ని చేరుకుంది. విశ్వ కప్ ని ఎవరు గెలుచుకుంటారన్నదానికి ఈరోజు జర్మనీ, అర్జెంటీనాల మధ్య అంతిమ పోరాటం జరగబోతోంది.
ఫుట్ బాల్ క్రీడకు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ ని 7-1 తో ఓడించిన జర్మనీ సెమీ ఫైనల్స్ ని దాటి ఫైనల్స్ కి చేరుకుంది. 16 వ రౌండ్ లో అల్జీరియాని 2-1 తో ఓడించి, పోర్చుగల్, అమెరికా మీద కూడా గెలిచి, ఘనతా తో డ్రా చేసిన జర్మనీ అర్జెంటీనాకి సమవుజ్జీయే. 16 వ రౌండ్ లో స్విట్జర్లాండ్ ని ఓడించి, బెల్జియమ్, బోస్నియా, ఇరాన్, నైజీరియా, హెర్జిగోవినా క్రీడాకారుల మీద గెలుపొందిన టీమ్ అర్జెంటీనా.
జర్మనీ ఈరోజు జరిగే మ్యాచ్ లో ఫైనల్ గా విశ్వ కప్ విజేత అవుతుందని మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్స్ లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ కోర్టానా వేసిన అంచనా. ఇంతవరకు అన్ని మ్యాచ్ లలోను కోర్టానా చెప్పిన భవిష్యత్ వాణి నిజమౌతూ వచ్చింది. అందువలన ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా అది నిజమయ్యే అవకాశం ఉంది. గూగుల్ కూడా జర్మనీ ఫైనల్ కప్ ని గెలుచుకుంటుందని అంచనా వేసింది. గూగుల్ కూడా ఇంతవరకు 14 లో 13 సార్లు సరైన అంచనాలను ప్రకటించింది. చైనా దేశానికి చెందిన సెర్చ్ ఇంజిన్ బైడు కూడా జర్మనీ అర్జెంటీనాలకు 59, 41 శాతం గెలిచే అవకాశాలను అంచనా వేసి వెల్లడించింది.
ఇక బెట్టింగ్ రాయుళ్ళ అంచనాలను చూసినా, జర్మనీ గెలుస్తుందన్న దానిమీదనే ఎక్కువ బెట్టింగ్ లు జరిగాయి.
ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్ కి ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లన చేసారు. 15 దేశాల నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధులు విచ్చేస్తున్నందువలన వందలాది ప్రత్యేక బలగాలు స్టేడియం లోపల బయటా కూడా భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more