vangaveeti radha to get Key party post in JSP వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

Vangaveeti radha krishna to get key party post in janasena

Janasena, Pawan Kalyan, Vangaveeti Radha, Krishna district, nadella manohar, dindi, East Godavari, Andhra Pradesh, Politics

Jana Sena party is likely to brim with some fresh energy as Krishna district leader Vangaveeti Radha is expected to join the party in presence of Pawan Kalyan soon.

వంగవీటి రాధాకు జనసేనలో కీలక పదవి.?

Posted: 09/06/2019 10:14 PM IST
Vangaveeti radha krishna to get key party post in janasena

ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధా... తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీలో ఎదుర్కోన్న పరాభవం గుర్తుంచుకున్న నేత ముందుగానే తనకు లభించే పార్టీ పదవులపై క్లారిటీ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. క్రితం రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చలు జరిపిన వంగవీటి రాధా... త్వరలోనే అధికారికంగా పార్టీ మారనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం... ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం... వంగవీటి రాధా అంచనాలను తారుమారు చేశాయి. ఎన్నికల తరువాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రాధా... అప్పట్లోనే పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపారు. దీంతో ఆయన గతంలోనే జనసేనలోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే పార్టీ మార్పుకి సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని భావించిన రాధా... ఎట్టకేలకు జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కంటే ముందు ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో సమావేశమైన వంగవీటి రాధా... పార్టీలోకి తనకు ఇవ్వబోయే బాధ్యతలు, పదవులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. జనసేనలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనే అంశంపై ముందుగానే ఆ పార్టీ ముఖ్యనేత నుంచి రాధా క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు లేదా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఏదో ఒక పదవిని వంగవీటి రాధాకు పార్టీ ఆఫర్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాధా పార్టీలో చేరిన రోజే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారని సమాచారం. మొత్తానికి జనసేనలో చేరనున్న వంగవీటికి రాధాకు... పార్టీలో కీలక బాధ్యతలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Trs shock bjp plans to contest in maharashtra elections

  కమలానికి ‘మహా’ షాకిచ్చేందుకు కేసీఆర్ ప్లాన్.?

  Sep 18 | తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నేతగా, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రూపంలో కొత్త సవాల్ ఎదురైందనే విషయం తెలిసిందే. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలోనూ... Read more

 • Komati reddy rajagopal reddy to join ruling trs party

  టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?

  Sep 17 | తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని.. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానంపై పలు విమర్శలకు పాల్పడి.. కేంద్రంలోని అధికార బీజేపి పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న ఆయన.. అక్కడ ఎందుకు బెడిసికొట్టిందో మాత్రం... Read more

 • Telangana tdp senior leader t devender goud likely to leave party

  తెలంగాణ టీడీపీకి మరో షాక్.. సీనియర్ నేత గుడ్ బై.?

  Aug 17 | తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా.? చంద్రబాబు తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తరువాత మంత్రిగా బాద్యతలను చేపట్టి క్రీయాశీలక వ్యవహారాలను చక్కెబెట్టిన నాయకుడు త్వరలో చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారున్న... Read more

 • Will pawan kalyan janasena party shake hands with bjp

  బీజేపీతో చేతులు కలపనున్న పవన్ కల్యాణ్?

  Aug 01 | రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను... Read more

 • Vijayawada tdp leader bonda uma to bid goodbye to chandrababu

  టీడీపీకి గుడ్ బై చెప్పనున్న బొండా ఉమ.?

  Aug 01 | ఐధేళ్ల పాటు అధికారంలో వున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చినా.. లేక ఓటమిని చవిచూసినా.. అప్పటి వరకు తాము చేపట్టిన అధికార, అనధికార పనులను సక్రమంగా పూర్తి చేసుకోవాలంటే గోపీలుగా మారాల్సిందే. ఇది రాజకీయ నాయకులకు... Read more

Today on Telugu Wishesh