AP CEO seeks CEC decision on JC DiwakarReddy Comments అనంత ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాలకు రీ-పోలింగ్.?

Ap ceo seeks cec decision on cancellation of anantha mp tadipatri mla polls

andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, EC to take note on CPI RamaKrishna note, EC to cancel ananthapur MP polling, EC to cancel tadipatri Mla polling, Chandrababu sensational satire on YSRCP, Chandrababu sensational satire on YCP Fan in Eluru, Chandrababu sensational satire on YCP Fan, chandrababu sensational satire, chandrababu, TDP, YS Jagan, YSRCP, sensational satire, andhra pradesh, politics

AP Chief Election Officer GopalaKrishna Dwivedi seeks Central Election Commission decision on cancellation of Anantha MP, Tadipatri MLA polls and action to be taken on senior TDP Leader JC DiwakarReddy.

అనంత ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాలకు రీ-పోలింగ్.?

Posted: 04/24/2019 08:35 PM IST
Ap ceo seeks cec decision on cancellation of anantha mp tadipatri mla polls

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గంటాపథంగా గెలుస్తానని భావిస్తున్న ఓ పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుందా.? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్రం చేతుల్లోని జేబుసంస్థలా మారి వ్యవహరిస్తోందిని.. తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లే అంశాలను పక్కనబెట్టి.. తమ ప్రత్యర్థి పార్టీలు తీసుకెళ్లే అంశాలను మాత్రం ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఇప్పటికే అరోపించిన చంద్రబాబుపై అగ్రహంతో వున్న ఎన్నికల కమీషన్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే పనిలో వుందని సమాచారం.

ఇంతకీ ఎన్నికల సంఘానికి అందివచ్చిన అవకాశమేంటి.? అంతకన్నా ముందు చంద్రబాబుకు గెలుస్తామన్న నమ్మకం వున్న స్థానాల్లో షాక్ ఎలా ఇవ్వబోతున్నారనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. ఈ రెండు స్థానాలు అనంతపురం జిల్లా పరిధిలోనివే. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను ఈసీ రద్దు చేయునుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళనాడులోని అర్కేపురం అసెంబ్లీ ఉపఎన్నికలను, వేలూరు పార్లమెంటు ఎన్నికను డబ్బు ఏరులై పారిందన్న నేపథ్యంలో ఈసీ ఆయా ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

అయితే అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి కుండ బధ్దలు కొట్టినట్టు ఇటీవల వ్యాక్యలు చేశారు. అలా మాట్లాడే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు ఏరులై పారిందని, నియోజకవర్గానికి ఏకంగా 50 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశామని చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ స్థానాల్లో తప్పక తమ అభ్యర్థులు గెలుస్తారని చంద్రబాబుకు పూర్తి విశ్వాసం వుంది. అందుకు ఈ రెండు సిట్టింగ్ స్థానాలు కావడమే కారణం.

అయితే జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖలపై పోలీసులు కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాలకు జరిగిన ఎన్నికలను రద్దు చేసి.. మరోమారు ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ సిఇవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు ఇంటివద్దే జెసి దివాకర్ రెడ్డి ఒప్పుకున్నందున తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ స్థానాలకు రీ పోలింగ్ నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.  

జెసి దివాకర్ రెడ్డి వ్యాఖలకు సంబంధించిన వీడియో క్లిప్లింగ్స్, పేపర్ కటింగ్స్ ను సిఇవో గోపాలకృష్ణ ద్వివేది కి అందజేసినట్లు రామకృష‌్ణ తెలిపారు. వీటిని పరిశీలించిన ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి జెసి వ్యాఖ్యలను తీసుకవెడతామని హామీ ఇచ్చారని తెలిపారు. జెసి దివాకర్ రెడ్డిపై కేసు కూడా నమోదు చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఖర్చు చేసి ప్రజాస్వామ్యానికి పాతర వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జెసి వ్యాఖ్యలు ఎన్నిక కమీషన్ ను ఛాలెంజ్ చేసే విధంగా వున్నాయని అభిప్రాయపడ్డారు.

దీంతో ఎన్నికల సంఘంపై సొంతరాష్ట్రంలోనే కాకుండా పోరుగు రాష్ట్రాలకు కూడా వెళ్లి మరీ విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు నష్టం కలిగించే చర్యలను తీసుకునేందుకు ఈసీ కూడా సన్నధమవుతుందని సమాచారం. ఇప్పటికే ఈవీఎంలపై రోజుకో రకమైన విషయాన్ని వెల్లడిస్తూ.. తాజాగా రష్యా హ్యాకర్లు కోట్ల రూపాయలను తీసుకుని ఈవీఎంలను హ్యాక్ చేస్తారని చంద్రబాబు అరోపించిన విషయం తెలిసిందే. అంతేకాక.. ఈ హ్యాకింగ్ అరోపణల నేపథ్యంలో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్లులను కూడా యాభై శాతం లెక్కించిన తరువాతే నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా 21 మిత్రపక్షాలతో కలసి ఇవాళ ఆయన దేశ సర్యోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈసీ అందివచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందోనన్న విషయం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles