chowkidar unable to hold fleeing businessman కాపాలాదారు వున్నా.. లక్షల కోట్లు ఆవిరి..ఎలా.?

36 businessmen fled india even when chowkidar is present

businessmen fled india, indian businessman ditching banks, Enforcement Directorate, AgustaWestland, AgustaWestland case, Sushen Mohan Gupta, Rajiv Saxena, Rajat Gupta, Enforcement Directorate, businessman, ditching banks, vijay mallya, nirav modi, mukhul choksi, politics

After ED told special judge Arvind Kumar that 36 businessmen have fled from the country in the recent past, questions araise that is chowkidar (PM Modi) is not aware or unable to hold the businessman who incurred huge losses to indian economy.

కాపాలా పటిష్టమేనా.. లేక పైమెరుగేనా.?

Posted: 04/16/2019 05:48 PM IST
36 businessmen fled india even when chowkidar is present

విదేశాలలో వున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి స్వయంగా దేశంలోని పేద ప్రజల ఖాతాలలో వాటిని జమచేస్తానని గత ఎన్నికల ముందు హామీఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ.. ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఒక్క పైసా అయినా జమచేశారా.? అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు సాధారణ చాయ్ వాలా అని.. ఇక రెండున్నరేళ్లు పూర్తైనక్రమంలో చాయ్ వాలాను ప్రతిపక్షాలు ప్రధానిగా అంగీకరించడంలేదని కూడా వ్యాఖ్యలు చేశారు.

ఈ తరుణంలో మరోమారు సార్వత్రిక ఎన్నికలు రాగానే తాను కాపలాదారునంటూ ప్రధాని ప్రజలముందుకు వచ్చారు. దేశానికి పోరుగు దేశాల నుంచే కాకుండా దేశంలో అంతర్గతంగా వున్న మావోయిస్టుల నుంచి కూడా అంతే ప్రమాదం పోందివుందని ఇలీవల చత్తీస్ గడ్ లో ఆరుగురు జవాన్లు మరణించిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడే మిజోరం మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజీజ్ ఖేరేషీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

దేశానికి కాపాలాదారనని చెప్పుకుంటున్న ప్రధాని.. ఆయన కాపాలలోనే పుల్వామా తరహా ఘటన ఎలా జరిగిందో చెప్పాలని నిలదీశారు. అయితే ఇది ప్రధాని మోడీ కాపాలాదారుగా విజయవంతంగా కొనసాగుతున్నట్లా..? లేక విఫలమైనట్లా.? అని ప్రశ్నించారు. అంతేకాదు.. పుల్వామా దాడి పథక రచనకు మొత్తంగా ప్రధాని మోడీయే కారణమని ఆయన సంచలన అరోపణలు చేశారు. ఉగ్రవాదులు కారులో బాంబులు పెట్టుకుని దేశంలోకి ఎలా చోరబడతారని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయాలను పక్కనబెడితే.. ప్రధాని మోడీ చెప్పినట్లుగా అంతర్గత ఉగ్రవాదం దేశానికి ప్రమాదకరమే అయితే.. అంతకన్నా దేశఅర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అర్థిక నేరగాళ్లలపై ఉదాసీన వైఖరి కనబర్చడం కూడా అంతే ప్రమాదకరమని విశ్లేషకుల భావన. ఐదేళ్లలో ఛాయ్ వాల నుంచి చౌకీదార్ గా మారిన ప్రధాని.. దేశభద్రతతో పాటు దేశ అర్థిక వ్వవస్థ సురక్షితంగా వుండేట్లు కూడా చర్యలు తీసుకోవాలని.. ఈ క్రమంలోనే 2016లో పెద్ద నోట్ల రద్దు పేరుతో అంతకన్నా పెద్దనోటును తీసుకువచ్చినా ప్రజలు స్వాగతించారు.

కానీ ప్రధాని నరేంద్రమోడీ చౌకీదారుగా.. కాపలాగా వుండగానే దేశం నుంచి కేవలం విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, ముకుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలు బ్యాంకులో తీసుకున్న వేలకోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. వీళ్లు మాత్రమే కాదు.. అలాంటి బడావ్యాపారవేత్తల ముసుగు తగిలించుకున్న అర్థిక ఉగ్రవాదులు ఏకంగా 36 మంది దేశం నుంచి పారిపోయారని స్వయంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానంలో ఈ విషయాన్ని చెప్పడం.. ఇప్పడీ వార్త దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒక్క విజయ్ మాల్యానే 9 వేల కోట్ల రూపాయల పైచిలుకు రుణాలను పొంది.. విదేశాలకు పారిపోగా, వజ్రాల వ్యాపారిగా పేరొందిన నిరవ్ మోడీ, ముకుల్ చోక్సీలు కుంభకోణం మరింత పెద్దది. అయితే దేశాన్ని విడిచి పారిపోయిన మొత్తం ముఫై అరు మంది బడావ్యాపారులు కలిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుందో మరి. అయితే వీరిపై ఎన్నికల సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు కోరుతున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Undavalli arun kumar assured of cabinet birth in ysrcp

  వైసీపీలోకి ఉండవల్లి.. మంత్రిపదవి కన్ఫార్మ్..?

  May 07 | ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ నెల 23 వరకు ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొంటున్నప్పటికీ.. అధికార పగ్గాలను ఎవరు... Read more

 • Villagers demand encounter of psycho rapist killer srinivas reddy cm kcr sir

  కన్ను పీకేస్తానన్న కేసీఆర్ సారూ.. కానొచ్చిండా.?

  May 01 | తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసు దర్యాప్తులో హంతకుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ లో అంతం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన... Read more

 • Another modi lie caught this time about how he washed his own clothes

  అబద్దాలతో ప్రధాని గొప్పాలా.? బయటపడ్డ నిజం ఇదిగో..!

  Apr 25 | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చాయ్ వాలా నరేంద్రమోడీ.. చౌకీధార్ గా మారారని విపక్షాలు.. దేశభద్రత విషయంలో మన వాయుసేన అత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయని అధికార విపక్షాలు పరస్పర... Read more

 • Ap ceo seeks cec decision on cancellation of anantha mp tadipatri mla polls

  అనంత ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాలకు రీ-పోలింగ్.?

  Apr 24 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గంటాపథంగా గెలుస్తానని భావిస్తున్న ఓ పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికల సంఘం షాక్ ఇవ్వనుందా.? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తిగా... Read more

 • Is vijaya sai reddy really a charted accountant questions janasena activists

  ‘‘కూడికలు రాకుండా చార్టెడ్ అకౌంటింగ్ ఎలా విజయ్ సాయి.?’’

  Apr 19 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో అన్ని పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఓటర్ల తీర్పుపై అధారపడి వుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత పర్యాయం కొద్దిలో చేజారిన... Read more

Today on Telugu Wishesh