Martyr's kin rue absence of any minister at airport స్వామిభక్తికున్న ప్రాధాన్యత అమరజవానుకు లేదా.?

No nda leader to receive bihar soldiers remains political battle begins

Sankalp Rally, Patna, Prime Minister Narendra Modi, CRPF, Pintu Singh, Pintu Kumar Singh, BJP, Congress, RJD, Politics

Bihar CM Nitish Kumar and PM Modi came under sharp political attack from the opposition, after no senior leader from their parties came to receive the body of Pintu Kumar Singh, an officer of the Central Reserve Police Force.

స్వామిభక్తికున్న ప్రాధాన్యత అమరజవానుకు లేదా.?

Posted: 03/04/2019 05:22 PM IST
No nda leader to receive bihar soldiers remains political battle begins

నిత్యం దేశభక్తి గురించి తమకే హక్కు వున్నట్లు, తమ పార్టీని, తమ పార్టీ విధానాలను, తమ పార్టీ అధినేతలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేసి.. చులకనబావంతో చయడం ఇప్పుడు కొన్ని పార్టీలకు పరిపాటిగా మారింది. ఇక ఈ మధ్య భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రక్త పరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలు మరింతగా శృతిమించిపోతున్నాయి. తనకు అనుకూలంగా లేనివారిపై దేశవ్యతిరేకులు అంటూ ముద్రవేసి రాజకీయ లబ్దిని పోందాలని వెంపర్లాడుతున్నారు.

గుజరాత్ మోడల్ అభివృద్ది సాధిస్తాం.. దేశ అభివృద్దికి ఒకసారి అవకాశం ఇవ్వండీ అంటై ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపి.. తమ అభివృద్ది గొప్పలను చెప్పుకునేందు ప్రయత్నాలు చేసినా.. ప్రజలు ఈ ప్రభుత్వహయాంలో పెరిగిన ఇంధన ధరలు, బ్యాంకుల్లో భ్లో-ఇన్, నోట్ల రద్దు వంటి ఆర్థిక సంస్కరణలతో చవిచూసిన ఇబ్బందులు.. ఆ తరువాత వ్యక్తుల వద్ద వుండాల్సిన నగదు రెండు లక్షలకు మించి వుండరాదని, వుంటే వారు కూడా శిక్షార్హులవుతారన్న ఆంక్షలు, స్త్రీధనంపై కూడా పరిమితులు, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంలో చతికిలపడిపోయారు.

ఇక అంతకంతకూ అకాశానంటుతున్న ఇంధన ధరల ప్రభావంతో పెరిగుతూపోతున్న నిత్యావసర సరుకుల ధరలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని తమ జీనవం కష్టతరం చేస్తున్న ప్రభుత్వం, అభివృద్ది వద్దు అని భావిస్తున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి, బీజేపి పాలిత రాష్ట్రాలపై పలుమార్లు రైతు సమస్యలపై, రైతు ఆత్మహత్యలపై మొట్టికామలు వేసినా.. నాలుగున్నరేళ్ల పాటు కనీసం వారిని పట్టించుకోని.. వారి మొరవినని కేంద్రం.. సరిగ్గా ఎన్నికల ముందు మాత్రం తాము సన్నకారు, చిన్నకారు రైతుల పక్షాన నిలుస్తామని రైతులపై వరాలను కురిపించింది.

ఇదే సమయంలో కాంగ్రెస్ హయంలో చేసిన రుణమాఫీని టార్గట్ చేసి విమర్శలు గుప్పించిన బీజేపి.. అదే రుణమాఫీని తాము పలు రాష్ట్రాలలో చేసిన విధానం మాత్రం గొప్పగా చెప్పకుంటోంది. కానీ ఇలా రుణమాఫీ జరిగిన మహారాష్ట్రలోని రైతులు ఎందుకు పలు పర్యాయాలు రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెలుగులోకి తీసుకురావడం లేదు.తమ సంక్షేమం, దేశాభివృద్ది కోసం ప్రభుత్వాలు కానీ.. అవే వ్యాపారసంస్థలుగా మారి కేవలం జీడిపీ, వృద్ది రేటు కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా అన్న ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఒరవడిని గ్రహించిన కేంద్రం.. తెరపైకి తాజాగా జరిగిన సర్జికల్ స్ట్రేక్స్ అంశాన్ని, దేశభక్తి అంశాన్ని తీసుకువచ్చిందని కూడా ప్రజలు భావిస్తున్నారు.

ఇక ఎక్కడైనా సైనికుడు కనబడితే దేశ ప్రజలు వారినిక సెల్యూట్ చేయడం లేదా కరతాళధ్వనులతో వారికి స్వాగతం పలకాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపు సంగతి పక్కనబెడితే.. ఏన్డీయే వ్యతిరేక పక్షాలను దేశభక్తిపై టార్గెట్ చేసే బీజేపి, ఆ పార్టీ నేతలు.. బిహార్ లో అమరజవాను పట్ల, ఆయన కుటుంబం పట్ల ఎంతటి ప్రేమతో వ్యవహరించారన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపి నేతలు అమరజవాన్ల పట్ల ఎంత ప్రేమను చాటుకుంటారో.. తమ ప్రధాని ముందు స్వామిభక్తిని చాటుకునేందుకు ఎంతగా పోటీపడతారో కూడా కళ్లకు కట్టినట్టుగా కనబడింది.

హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఈ నెల 3న ఆదివారం పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ, ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని, పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది. అధికార జేడీయూ-బీజేపీ కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం దేశభక్తి అంటూ ప్రగల్భాలు పలికే నేతలు కనీసం కడసారి చూపుకు, శ్రద్దాంజలి ఘటించేందుకు కూడా రాకపోవడంపై విమర్శలు రేగాయి.

పింటూ సింగ్ మృతదేహం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న మూడు గంటల తర్వాత ఎన్నికల ర్యాలీ కోసం పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రధాని మోడీకి వెల్ కమ్ చెప్పేందుకు మాత్రం సీఎం నితీష్ కుమార్, రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులు అక్కడికి వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అమరుడైన జవాన్ కంటే మోడీ ర్యాలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ పింటూ సింగ్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా బీజేపి నేతల దేశభక్తి అంటూ నిలదీశాడు.

పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ ఎంపీ చౌద‌రి మ‌హ‌బూబ్ అలీ ఖైస‌ర్, ఎస్ఎస్పీ గ‌రిమా మాలిక్, డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కుమార్ ర‌వి, ఇత‌ర సీఆర్పీఎఫ్ అధికారులు మాత్ర‌మే ఎయిర్ పోర్టులో  పింటూ కుమార్ సింగ్ భౌతిక‌కాయానికి  శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆ త‌ర్వాత‌  ఆయన పార్థివ శరీరాన్ని హెలీకాప్టర్ ద్వారా ఆయన సొంతూరు బేగూసరాయ్ జిల్లాలోని బఖ్రీ గ్రామానికి తరలించారు.తమ ఊరి వీరపుత్రునికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు తండోపతండాలుగా బఖ్రీ గ్రామానికి వచ్చారు.

కాగా, పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసివచ్చేందుకు భారత వాయుసేనకు అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భారత వాయు సేన ఘనతను తమ ఘనతగా మార్చుకుని రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తుందని ఇప్పటికే విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇదే క్రమంలో బీజేపి దేశభక్తిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్మీ గోప్పతనాన్ని చాటిచెప్పే కేంద్రం.. ఆర్మీలోని అన్నం బాగోలేదని.. నీళ్ల చారు.. రొట్టెల సమస్య గురించి బాహ్యప్రపంచానికి చెప్పిన సైనికుడి గురించి మాత్రం ఎందుకు పట్టించుకోలదన్న ప్రశ్నలు కూడా మరోమారు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sankalp Rally  Patna  PM Narendra Modi  CRPF  Pintu Kumar Singh  BJP  Congress  RJD  Politics  

Other Articles