LK Advani quits from active politics.? రాజకీయాలకు బీజేపి కురువృద్ద నేత సలామ్.?

Lk advani been tougher to amit shah quits from active politics

BJP, LK Advani, Narendra Modi, Atal Bihari Vajpayee, PM Modi, Amit Shah, President, BJP Party patriarch, Lok Sabha Elections, Gandhinagar seat, Gujarat, Politics

BJP founder LK Advani quits silently from active politics, being the founder he was been politically orphaned since the advent of Modi and BJP president Amit Shah. 91-year-old Advani reportedly told him he would not contest another election.

బీజేపికి కురువృద్ద నేత దూరం.. రాజకీయాలకు సలామ్.?

Posted: 02/19/2019 06:21 PM IST
Lk advani been tougher to amit shah quits from active politics

భారత రాజకీయాలలో ఆయనొక శక్తి. బీజేపీ పార్టీ వ్యవస్థాపక నేతలలో ఒకడిగా వుంటూ కేవలం ఉత్తరంలోని పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీని యావత్ దేశవ్యాప్తం చేసిన మూలుపురుషులలో వవఆయన ఒకరు. కేవలం రెండు స్థానాలతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పార్టీకి.. ఆ తరువాత అధికారాన్ని అందించిన మూల పురుషులలో ఆయన ఒకరు. మరోలా చెప్పాలంటే ఆయన పార్టీ కోసం ఉద్యమించిన నేత. పార్టీని దేశ నలుమూలల విస్తరించిన నేత.

ఇంతకీ ఎవరాయనా.? అంటే ఆయనే లాల్ కిషన్ అద్వానీ. 91 ఏళ్ల అద్వానీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటుగా.. బీజేపికి కూడా పెద్ద షాకిచ్చారు. ఈ ద్వయం బీజేపి అధికార పగ్గాలను అందుకున్న తరువాత క్రమంగా తన ప్రతిష్ట మసకబారడంతో.. ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆయన సన్నిహితవర్గాలు తెలిపిన సమాచారం మేరకు ఇకపై ఆయన క్రీయాశీలకంగా పార్టీలో వ్యవహరించరని సమాచారం.

ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అద్వానీ తేల్చి చెప్పారని సమాచారం. మరోసారి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని అద్వానిని అమిత్ షా కోరారు. అయితే, పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. కనీసం అద్వాని సంతానమైన జయంత్, ప్రతిభలలో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలని... వారిని గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని అమిత్ షా కోరినప్పటికీ, దానికి కూడా అద్వాని నిరాకరించారట.

ఎన్ని అవమానాలు ఎదురైనా, అలసిపోయినా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ బీజేపీని సున్నా నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కొందరు నేతల్లో అగ్రగన్యుడు అద్వారని. వారిలో ముందు వరుసలో ఉంటారు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ. ఎంత ఎదిగినా వొదిగి ఉండటం ఈతరం రాజకీయ నాయకులు ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. అయితే ఇక ఆయన ఎన్నికల బరిలో నిలవబోనని తేల్చిచెప్పడం, తన వారసులను కూడా రాజకీయాల్లోకి రానీయయని చెప్పడం ద్వారా ఆయన బీజేపి షాక్ ఇచ్చారు. దీంతో దేశ రాజకీయ చరిత్రలో మరో అంకం ముగిసినట్టే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  LK Advani  Narendra Modi  Atal Bihari Vajpayee  PM Modi  Amit Shah  Politics  

Other Articles

 • Nakrekal mla chirumarthi lingaiah likely to join ruling trs

  జంప్ జిలానీ: కారెక్కనున్న చిరుమర్తి లింగయ్య

  Mar 08 | లోక్ సభ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక... Read more

 • No nda leader to receive bihar soldiers remains political battle begins

  స్వామిభక్తికున్న ప్రాధాన్యత అమరజవానుకు లేదా.?

  Mar 04 | నిత్యం దేశభక్తి గురించి తమకే హక్కు వున్నట్లు, తమ పార్టీని, తమ పార్టీ విధానాలను, తమ పార్టీ అధినేతలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా ముద్రవేసి.. చులకనబావంతో చయడం ఇప్పుడు కొన్ని పార్టీలకు పరిపాటిగా మారింది.... Read more

 • Tdp dharma porata deeksha costs rs 11 cr on ap people

  ‘బాబు’ గారి నిమ్మరసం ఖరీదు రూ.11 కోట్లా.?

  Feb 13 | కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో నాలుగేళ్లుగా చట్టాపట్టాలేసుకుని.. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్నించి కేంద్రంపై తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తూ ఇటు రాష్ట్రంలోని ప్రతి... Read more

 • Statue of unity income goes only to gujarat

  ఇదెక్కడి న్యాయం..? నిర్మాణం అందరిదీ.. ఆదాయం ఒక్కరిదా.?

  Feb 13 | ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రతిబింభిస్తూ.. భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే యూకే ప్రభుత్వం తాము దేశంలోని అణగారిన వర్గాల... Read more

 • Are tdp ycp competing each other in procuring duplicate votes

  అధికారం కోసం అడ్డదారులు..? పోటీ ఘనమే.?

  Feb 08 | 2014 ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితుల దృష్ట్యా జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ మానియా కొనసాగుతున్న వేళ.. బీజేపితో జతకట్టిన టీడీపీ.. బీజేపికి బేషరుతుగా తన మద్దతును ప్రకటించిన జనసేన పార్టీని కూడా కలుపుకుని రాష్ట్రంలో... Read more

Today on Telugu Wishesh