Chandrababu's costly Lime Juice ‘బాబు’ గారి నిమ్మరసం ఖరీదు రూ.11 కోట్లా.?

Tdp dharma porata deeksha costs rs 11 cr on ap people

Chandrababu Naidu, Dharma Porata deeksha, Special Status for AP, Congress, BJP, opposition parties, Mulayam singh yadav, Rahul Gandhi, Gulam nabi Azad, ManMohan singh, JDS, Deva Gowda, PM Modi, Amit shah, politics

The day-long fast of Andhra Pradesh Chief Minister Chandrababu, in Delhi by the name of Dharma Porata Deeksha, including the expenses of travel and other services, costed the state government Rs.11 crore.

‘బాబు’ గారి నిమ్మరసం ఖరీదు రూ.11 కోట్లా.?

Posted: 02/13/2019 09:38 PM IST
Tdp dharma porata deeksha costs rs 11 cr on ap people

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో నాలుగేళ్లుగా చట్టాపట్టాలేసుకుని.. గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్నించి కేంద్రంపై తిరుగుబాటు బావుటాను ఎగరవేస్తూ ఇటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్షలను చేపట్టారు. ఇక తాజాగా హస్తినకేగి ఎన్డీయేతర పార్టీల నేతలనందరినీ అహ్వానిస్తూ చేపట్టిన దీక్ష తాజాగా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సహా వివిధ పార్టీ నేతలు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవాల్సిందేనని నినదించిన సభకు అయిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ దీక్షకు ఏకంగా పదకొండు వేల కోట్ల రూపాయలు కావడమే చర్చకు దారితీసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో అర్టీ 215లో ప్రభుత్వమే ఈ విషయాన్ని చెప్పడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది.

అసలే తమది ఆర్థిక ఇబ్బందులతో వున్న రాష్ట్రమని చెప్పిన ముఖ్యమంత్రి.. కోట్ల రూపాయలను వెచ్చింది హస్తినలో సభ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని కూడా విపక్షపార్టీలు నిలదీస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన కేవలం దుబారా ఖర్చులతోనే కూడుకుందని విమర్శలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయనతో పాటు ఆయన మంత్రిమండలి కూడా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చుచేస్తూనే.. రాష్ట్రం అప్పుల ఊభిలో కూరుకుపోయిందని ఆదుకోవాలని అంగలార్చడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణం అంటూ పలు దేశాలు ప్రత్యేక విమానాలలో ప్రయాణించి.. ఇక రాజధాని డిజైన్ విషయంలోనూ ఒక దేశం నుంచి డిజైన్లు పొందిన తరువాత మళ్లీ మరో దేశానికి డిజైన్ల కోసం పంపడం.. ఇక అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ లోనూ మంత్రుల ఛాంబర్లుకు ప్రజాధనాన్ని వెచ్చించడం.. ఇక ఏపీలో పరిశ్రమల కోసం విదేశాలకు పలుమార్లు వెళ్లడం.. ఇలా ఒక్కటని కాదు అనేక ఖర్చులను చేస్తూనే.. రాష్ట్రం ఆర్థికలోటులో వుందని చెప్పడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

ఇక తాజాగా హస్తినలో చేసిన దీక్ష కోసం కోటి 12 లక్షల రూపాయలను వెచ్చించి.. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా అక్కడి ప్రజలను హస్తినకు తీసుకెళ్లాడమేంటని కూడా ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు 12 గంటల దీక్ష కోసం ఏకంగా పది కోట్లు వెచ్చిందడంతో ముఖ్యమంత్రి దీక్ష అనంరతం తీసుకున్న నిమ్మరసం ఖరీదు రూ. 11 కోట్ల అంటూ కూడా విపక్షాలు విమర్శలను సంధించేందుకు అస్కారం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

పశ్చిమ బెంగాల్ లో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించినట్టుగా ఎన్డేయేతర పార్టీల నేతలతో సభను.. హస్తినకు బదులు అమరావతిలో చేసివుండాల్సిందని మరికొన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఫ్యాకేజీ నిధులు సమకూర్చలేదని కేంద్రంపై పోరాటం చేస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతీ నెలా ఒక ధర్మపోరాట దీక్ష చేసి కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నారని.. ఈ ఖర్చులకు హస్తిన దీక్ష పరాకాష్ట అని విపక్షాలు మండిపడుతున్నాయి.

అయితే విపక్షాల విమర్శలను అధికార పార్టీ వర్గాలు తేలిగ్గా కోట్టిపారేస్తున్నాయి. తమ రాష్ట్రం పట్ల కేంద్రం ఎంత నిరంకుశంగా వ్యవహరించిందో తమ దీక్ష తెలియజేసిందని పేర్కోంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించకపోగా ప్యాకేజీ అని చెప్పిన కేంద్రం.. ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని.. ఈ తరుణంలో తాము కేంద్రంపై పోరాటం చేయడమే ముఖ్యమని అన్నాయి. ఇక ఎన్డీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హో్దా కోసం డిమాండ్ చేయడం కోసం ఖర్చును లెక్కపెట్టడమేంటని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Dharma Porata deeksha  Congress  BJP  opposition parties  Andhra pradesh  politics  

Other Articles