Statue of Unity Income goes only to gujarat నిర్మాణంలో అందరూ.. ఆదాయంలో మాత్రం ఒక్కరేనా.?

Statue of unity income goes only to gujarat

Sardar vallabhbhai patel, Statue of Unity, tourism, union funds, state funds, tourism income, andhra pradesh special status, north eastern states, backward states, Gujarat, political gossips, politics

The Statue of Unity, built at an estimated cost of Rs 29.89 bn, could have instead funded for many states needs like special package to bihar and special status to Andhra pradesh. Now only Gujarat is enjoying tourism income.

ఇదెక్కడి న్యాయం..? నిర్మాణం అందరిదీ.. ఆదాయం ఒక్కరిదా.?

Posted: 02/13/2019 06:42 PM IST
Statue of unity income goes only to gujarat

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రతిబింభిస్తూ.. భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే యూకే ప్రభుత్వం తాము దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలను పలు విడతలుగా ఇస్తూంటే.. భారత ప్రభుత్వం తమ నిధులను సక్రమంగా వినియోగించుకోకుండా.. విగ్రహాల ఏర్పాటుకు వేల కోట్ల రూపాయలను వెచ్చించడం ఏంటని కూడా ప్రశ్నించింది.

అయితే తాజాగా ఈ విగ్రహాన్ని చూసేందుకు గుజరాత్ కు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూన్నారని మూడు మాసాల్లో ఈ ఐక్యాతా విగ్రహం కాసుల వర్షం కురిపిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చర్చకు దారితీస్తుంది. అక్టోబర్ 31 2018న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ విగ్రహం.. గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున నిర్మించిన విషయం తెలిసిందే. అయితే సుమారుగా 3 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విగ్రహాన్ని నిర్మించగా, ఇందులో కేంద్రం తన వాటాగా దేశప్రజలందరికీ చెందిన సొమ్మును సుమారు రూ. 365 కోట్ల ఎనిమిది పర్యాయాలు చెల్లించిన విషయం తెలిసిందే.

ఎల్ ఆండ్ టీ సంస్థ నిర్మించిన ఈ విగ్రహాం అచ్చం పటేల్ ను తలపించేలా ఉండటంతో దానిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. గతేడాది నవంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో 7,81,349 మంది పర్యాటకులు దీనిని సందర్శించారు. తద్వారా కేవలం మూడు నెలల్లోనే రూ.19.47 కోట్ల ఆదాయం కూడా వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్ తెలిపారు. ఇదే అసలు చర్చకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా రైతులకు చెందాల్సిన నిధులను పటేల్ విగ్రహానికి తరలించి.. తమది రైతు ప్రభుత్వమని ప్రధాని చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలోని రైతులు ఆకలితో అలమటిస్తూ.. అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే.. దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు అటు కేంద్రానికి ఇటు ఉత్తర, పశ్చిమ రాష్ట్ర ప్రభుత్వాలకు చివాట్లు పెట్టినా.. రైతులను మాత్రం ప్రభుత్వాల నుంచి ఎలాంటి లబ్ది చేకూరలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నాలుగున్నరేళ్ల పాటు రైతులను వారి కష్టాలకు, నష్టాలను వారిని వదిలేసి.. వారిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

తీరా ఎన్నికల సమయంలో మాత్రం సన్నకారు, చిన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించడం కూడా రాజకీయ ఎత్తుగడగానే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదేనా రైతులపై మీకున్న ప్రేమ అంటూ విపక్షాలు అధికారపక్షాన్ని నిలదీస్తున్నాయి. ఇక స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించే పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర పర్యాటన రంగం అభివృద్దికి కాకుండా దేశంలోని రైతుల కోసం వెచ్చించాలన్న డిమాండ్లను కూడా ప్రతిపక్షాలు తెరపైకి తీసుకువ్తసున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardar vallabhbhai patel  Statue of Unity  tourism  Gujarat  political gossips  politics  

Other Articles