IS YCP competing with TDP in fake voting with Finger sheaths అధికారం కోసం అడ్డదారులు..? పోటీ ఘనమే.?

Are tdp ycp competing each other in procuring duplicate votes

TDP, YSRCP, Finger sheaths, silicone fingers, AP political parties, duplicate votes, fake votes, jana sena, Pawan Kalyan, YS Jagan, Chandrababu, Andhra Pradesh, Politics

TDP's Master Plan of Finger sheaths proved by YSRCP, But Now, doubts araise that YCP is competing with TDP to rig massively in the upcoming Assembly and Parliament polls.

అధికారం కోసం అడ్డదారులు..? పోటీ ఘనమే.?

Posted: 02/08/2019 01:25 PM IST
Are tdp ycp competing each other in procuring duplicate votes

2014 ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితుల దృష్ట్యా జాతీయ స్థాయిలో నరేంద్రమోడీ మానియా కొనసాగుతున్న వేళ.. బీజేపితో జతకట్టిన టీడీపీ.. బీజేపికి బేషరుతుగా తన మద్దతును ప్రకటించిన జనసేన పార్టీని కూడా కలుపుకుని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే అప్పటి వరకు వున్న అంచానాలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మరీ ముఖ్యంగా జనసేన టీడీపీ-బీజేపి కూటమికి తోడుకావడం.. రాష్ట్రంలో టీడీపీకి ఓట్లు వేయాలని పవన్ కల్యాణ్ అభ్యర్థించడంతో.. అప్పటివరకు అధికారం తమకే దక్కుతుందని అశల పల్లకీలో విహరించిన వైసీపీ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి.

దీంతో గత ఐదేళ్లుగా తమ పార్టీ అనేక ధర్నాలు. నిరసనలు, చేపట్టి నిత్యం ప్రజల్లో వుండేందుకు కూడా వ్యూహాలను రచించి.. ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామన్న సంకేతాలను ఇచ్చేసింది. మరో అడుగు ముందుకేసీన వైసీపీ నేత జగన్.. అటు అదికారులతో ఇటు పోలీసులతో పలు సందర్బాలలో  తానే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రినని కూడా సెలవిచ్చారు. ఇక ఆయన హామీలు కూడా తాను ముఖ్యమంత్రినైతే.. తాను అధికారంలోకి రాగానే.. అంటూ సాగుతున్నాయి.

ఇక తాజాగా పిల్లులను ఎత్తుకెళ్లే దోంగలను చూశాం.. కానీ ఓట్లను ఎత్తుకెళ్లే దొంగలు కూడా ఎన్నికల ముందు గ్రామగ్రామాన తిరుగుతున్నారు.. వారితో జాగ్రత్తా వ్యవహరించాలని జనసేనాని పవన్ కల్యాణ్ వారి కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తేరుకున్న వైసీపీ నేతలు.. ఇక ఓట్ల గల్లంతుపై అధికార పక్ష వ్యూహాలు ఎలా వుండబోతున్నాయో కూడా తమ పార్టీ నేతలకు తెలిపింది. అప్రమత్తంగా వుండాలని కూడా హెచ్చిరించింది.

అంతేకాదు ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఏకంగా సీఈసీని కలసి రాష్ట్రంలో ఏకంగా 50 లక్షల మేర నకిలీ ఓట్లు వున్నాయని.. వాటిని తొలగించాలని కోరారు. దీంతో పాటు తమ పార్టీకి సానుకూలంగా స్పందించిన ఓటర్ల ఓట్లను తొలగించారని కూడా అరోపించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో సర్వేల పేరుతో ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలసుకుని తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగిస్తున్నారని కూడా జగన్ సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఈ దఫా ఎలాంటి పరిస్థితుల్లో అధాకారం చేజారకూడదని భావిస్తున్న వైసీపీ కూడా తెరచాటుగా అనేక వ్యూహాలు రచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అటు టీడీపీ చేస్తున్న నకిలీ ఓట్ల కుట్రలు, కుతంత్రాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 50 లక్షల దొంగ ఓట్లు టిడిపి సృష్టించిందని వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలు నిజమే అని చెప్పడానికి రబ్బరుతో చేయించిన వేలి తొడుగులు బయటపడ్డాయి. ఇవి జగన్ అరోపణలకు బలం చేకూర్చేవిధంగా వున్నాయి.

అయితే ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న వైసీపీ పార్టీ.. కూడా తెరచాటుగా ఇలాంటి యత్నాలకే పాల్పడుతుందా.? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒకరిని దొంగ అని అరిచి భయానికి గురిచేసి.. అదే సమయంలో అదే పని తాము చేసుకుపోతే.. తమను ఎవరూ గమనించరన్న లాజిక్ ను వైసీపీ కూడా వినియోగించుకోవాలని భావిస్తోందా.? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఏదీ ఏమైనా.. అధికారమే పరమావధిగా భావించే రాజకీయ పార్టీలు అడ్డదారుల్లో కూడా పోటీ పడి మరీ అధికార పగ్గాలను అందుకోవాలని యత్నిస్తున్నాయని మరికోందరు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఓటును కోనేందుకు ఒక పార్టీ రూ.1000 ఇస్తానంటే.. మరో పార్టీ రెండు వేలు ఇస్తానంటూ ఆఫర్ పెట్టి ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో  ఓటుకు విలువను కడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేనా.. అధికారంలో దక్కినా.. అత్తెసరు మెజారిటీ వస్తే.. అవతల పార్టీల ఎమ్మెల్యేలను నిసిగ్గుగా తమ పార్టీలోకి అహ్వానించి మరీ.. తాము గొప్ప ప్రజాస్వామికులం అని గొప్పలు పోతున్నారని కూడా పలువురు ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తరుచుగా ప్రతి నెల తమ పెర్లు ఓటరు జాబితాలో వున్నాయా.? లేదా.? అని సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తీరా ఎన్నికల సమయంలో తమ ఓటు మిస్ కాకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మీ స్నేహితులు, కాలనీ వాసులు, మీ బస్తీలు, వార్డుల్లోని నిరక్ష్యరాసుల ఓట్లు కూడా కరెక్టుగా వున్నాయా.? లేదో పరిశీలించి.. వారికి కూడా ఈ విషయంలో అప్రమత్తం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మీ ఓట్లను వేరే వ్యక్తులు వేసినట్లయితే డిమాండ్ ఓటు వేసేలా కూడా అధికారులు డిమాండ్ చేసేలా కూడా ఓటర్లను జాగృత పర్చాల్సిన అవసముంది. లేని పక్షంలో ఓటు దొంగలు, నకిలీ ఓట్లు, వేలి తొడుగుడు ఓట్లు ప్రజాస్వామ్యాన్ని శాసించే స్థాయికి వెళ్లే ప్రమాదముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  Finger sheaths  YS Jagan  Chandrababu  Andhra Pradesh  Politics  

Other Articles