SP-BSP will bring BJP down to 18 seats in UP మహాకూటమి జట్టుకడితే.. కమలానికి కష్టాలే..

Bjp will get only 5 seats in up if bua bhatija join hands with rahul gandhi

India Today mood of the nation poll, mood of the nation, 2019 lok sabha election, Uttar Pradesh Lok Sabha seats, SP-BSP alliance, Congress in UP, BJP strength in UP, what UP voters want, Grand alliance in Uttar pradesh, mahagathbandhan in UP, politics

The poll shows that that if the SP, BSP, Congress, Rashtriya Lok Dal (RLD) and others fought together as a unit against the BJP, it would have inflicted a massive blow to the BJP.

ఎస్పీ-బీఎస్పీలు కాంగ్రెస్ తో జట్టుకడితే.. కమలానికి కష్టాలే..

Posted: 01/24/2019 03:57 PM IST
Bjp will get only 5 seats in up if bua bhatija join hands with rahul gandhi

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో అందరి దృష్టి అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ పైనే నెలకొంది. యూపీలో చక్రం తిప్పేవాళ్లే హస్తిన సింహాసాన్ని అధిరోహించగలరన్న అంచనాలు పెద్దస్థాయిలో ఉండటంతో.. రాజకీయ అవగాహన వున్న యావత్ దేశప్రజలు దృష్టి అక్కడే పడింది. యూపీలో  పాగా వేసేదెవరు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికలను తీవ్రంగా ప్రభావం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉండబోతున్నాయని తాజాగా ఇండియా టుడే-కార్వీ సర్వే స్పష్టం చేసింది. యూపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తన మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి కేవలం 18 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది. అదే సమయంలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్‌డీ దాదాపు 58సీట్లను కైవసం చేసుకుంటాయని తెలిపింది. కాంగ్రెస్ 4 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడైంది.

గత ఎన్నికల్లో యూపీలో బీజేపీ స్వతహాగా 71 స్థానాల్లో గెలిచింది. మిత్రపక్షం అప్నాదళ్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. అంటే, ఇండియా టుడే సర్వే ప్రకారం.. యూపీలో బీజేపీ పరిస్థితి 71 నుంచి 16 స్థానాలకు పడిపోనుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లకే పరిమితమైన ఎస్పీ, అసలు ఖాతానే తెరవని బీఎస్పీ.. రెండూ కలిపి 58 స్థానాల వరకు కైవసం చేసుకోబోతున్నాయని సర్వే తెలపడం గమనార్హం.

ఈ లెక్కన యూపీ రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ మరోసారి కీలక పాత్ర పోషించబోతున్న విషయం తేట తెల్లమవుతోంది. అలాగే గత ఎన్నికల్లో కేవలం రెండే స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మరో రెండు స్థానాల్లోనూ సత్తా చాటబోతుందని సర్వే వెల్లడించింది. సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఒకవేళ ఎస్పీ-బీఎస్పీ పొత్తులో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే.. బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేదని సర్వేలో తేలింది. ఎస్పీ-బీఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ కేవలం 5 స్థానాలకు పరిమితమయ్యేదని సర్వే తెలిపింది.

ఇక ఓట్ల శాతానికి వస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ-అప్నాదళ్ పక్షానికి 36శాతం ఓట్లు, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్‌డీ పక్షానికి 46 శాతం, కాంగ్రెస్ 12శాతం ఓట్లు గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఎస్పీ 22.2శాతం, బీఎస్పీ 19.6శాతం, కాంగ్రెస్ 7.5శాతం, ఆర్ఎల్‌డీ 1శాతం ఓట్లను మాత్రమే గెలుచుకున్నాయి. ఈ సర్వే కోసం దాదాపు 2400 పైచిలుకు మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు సంస్థ వెల్లడించింది. కాగా, ఎస్పీ, బీఎస్పీ పొత్తులో కాంగ్రెస్ కూడా భాగస్వామి అయి ఉంటే యూపీలో బీజేపీ దాదాపుగా గల్లంతయిపోయేదని ఎక్కువమంది అభిప్రాయపడినట్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles