Kiran Bedi To Become Ap Governor Soon? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కిరణ్ బేడీ.?

Kiran bedi likely to be new governor of andhra pradesh soon

Central government, Kiran Bedi, Governor, Andhra Pradesh, Chandrababu Naidu, Republic Day, pudducherry, ESL Narasimhan, Home Ministry, President, politics

The Central government has proposed to send Pondicherry Lt Governor Kiran Bedi to AndhraPradesh as Governor. A decision in this regard was likely to be announced after Republic day.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కిరణ్ బేడీ.?

Posted: 01/22/2019 05:20 PM IST
Kiran bedi likely to be new governor of andhra pradesh soon

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నారన్న వార్త రాజకీయవర్గాలో మరోమారు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహన్ దాదాపుగా తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది. అయితే ఏపీకి ఐరన్ లేడీ కిరణ్ బేడీ రాబోతున్నారనే వార్తలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. కిరణ్ బేడీని నియమించటంలో రాజకీయ కోణం వుందనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య వున్న పలు అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపేందుకుగాను రెండు పర్యాయాలు కేంద్రం నరసింహన్ ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయనను కేవలం తెలంగాణకు పరిమితం చేసి.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్ బేడీని ఏపీ గవర్నర్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో... గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టిసారించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తూ, కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేదీ నియామకం జరగ్గా... ఇప్పుడు గవర్నర్ నియామకంపై కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
 
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికీ కిరణ్ బేడీకి మధ్య సరైన సఖ్యత లేదు. అమె కేంద్రం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తున్నారని.. కాంగ్రెస్ అరోపణలు సంధించగా, తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం, కుట్రపూరితం, ఆధారరహితం, అర్థరహితం అని అమె మండిపడ్డారు. తన రెండున్నర ఏళ్ల సర్వీసులో పుదుచ్చేరిలో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పు చెయ్యలేదని అన్నారు. కాగా, మాజీ ఐపీఎస్ ఆధికారిగా కిరణ్ బేడీకి గుర్తింపు ఉంది. ఆమెను ఏపీ గవర్నర్‌గా నియమిస్తే, ఇది రాజకీయ క్షక్షసాధింపు చర్యగానే టీడీపీ పేర్కొనవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Bedi  Governor  Andhra Pradesh  Chandrababu Naidu  politics  

Other Articles

 • Ktr chit chat with media on trs losing parliament seats

  జాతీయ రాజకీయాలపై కేటీఆర్ యూ-టార్న్..!

  May 28 | దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా యూ-టార్న్ తీసుకున్నారు. ఇలా యూ-టార్న్ తీసుకోవడం రాజకీయ నేతలకు పరిపాటేనా... Read more

 • Kishan reddy to be picked up for union cabinet berth

  కిషన్ రెడ్డికి.. బండారు స్థానమేనా.? లేక పదవి కూడానా.?

  May 24 | తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇస్తూ ఏకంగా మునుపెన్నడూ లేని విధంగా నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. ఇక రానున్న రోజుల్లో తెలంగాణపై పూర్తిస్థాయిలో తమ ఆధిపత్యాన్ని కనబర్చేందుకు కూడా... Read more

 • Undavalli arun kumar assured of cabinet birth in ysrcp

  వైసీపీలోకి ఉండవల్లి.. మంత్రిపదవి కన్ఫార్మ్..?

  May 07 | ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో? అన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఈ నెల 23 వరకు ఈ ఉత్కంఠ సర్వత్రా నెలకొంటున్నప్పటికీ.. అధికార పగ్గాలను ఎవరు... Read more

 • Villagers demand encounter of psycho rapist killer srinivas reddy cm kcr sir

  కన్ను పీకేస్తానన్న కేసీఆర్ సారూ.. కానొచ్చిండా.?

  May 01 | తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన యాద్రాది భువనగిరి జిల్లా హాజీపూర్ లో మర్డర్ మిస్టరీల కేసు దర్యాప్తులో హంతకుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ లో అంతం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన... Read more

 • Another modi lie caught this time about how he washed his own clothes

  అబద్దాలతో ప్రధాని గొప్పాలా.? బయటపడ్డ నిజం ఇదిగో..!

  Apr 25 | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చాయ్ వాలా నరేంద్రమోడీ.. చౌకీధార్ గా మారారని విపక్షాలు.. దేశభద్రత విషయంలో మన వాయుసేన అత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయని అధికార విపక్షాలు పరస్పర... Read more

Today on Telugu Wishesh