TRS will come to power says asaduddin owaisi టీఆర్ఎస్ పార్టీదే అధికారం: ఎంఐఎం

Telangana elections 2018 trs will come to power says asaduddin owaisi

telangana elections 2018, Telangana assembly elections, Asaduddin Owaisi says TRS will come to power, akbaruddin owaisi, TRS, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

Hyderabad Member of parliament and AIMIM president Asaduddin Owaisi confidently says that TRS party will come into power once again and it doesnt need his party support.

తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీదే అధికారమన్న అసద్..

Posted: 11/30/2018 03:17 PM IST
Telangana elections 2018 trs will come to power says asaduddin owaisi

తెలంగాణలో డిసెంబర్ నెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజాతీర్పు ఎలా వుండబోతుంది.. ఎవరు గెలుస్తారు.. 11న వెల్లడి కానున్న ఓటరు తీర్పు ఎవరికి అధికార పగ్గాలను చేర్చుతుందన్న అన్న విషయాలపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్ననాటి నుంచి అధికార పార్టీలు తమకు తలవంచక తప్పదని.. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో విజయం ఎవరిని వరించినా తమ ముందు తగ్గల్సిందేనని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

అది చాలదన్నట్లు రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ప్రభుత్వ పగ్గాలు ( కారు స్టీరింగ్) మాత్రం తమ చేతుల్లోనే వుంటాయని ఏకంగా ఆల ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసే ఓటు అనధికారికంగా ఎంఐఎంకు వెళ్తుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో తాము చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడిన ఎంఐఎం.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

ఈ రెండు పార్టీల మధ్య మిత్రృత్వ పోటీ వున్నా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని, ప్రచారం చేసి.. వారిని గెలిపించాలని తమ అభ్యర్థులు లేని చోట కూడా ఓటర్లను సభలు, సమావేశాలు, రోడ్ షోల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక దిద్దుబాటు చర్యల్లో భాగంగా తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాదు అందుకు తమ మద్దతు కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అవసరం వుండదని వెల్లడించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం పరిస్థితి దేశమంతా రావాలని ఆకాంక్షించారు. అయితే చంద్రబాబు, ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత చంద్రశేఖర్ రావు ప్రభుత్వాలతో జతకట్టి నడిచిన ఎంఐఎం.. ఎన్నికల నేపథ్యంలో మాత్రం తమ పార్టీ గెలుపు మినహా ప్రచారం చేయదు.

కానీ ఈ సారి ఇలా ప్రచారం చేయడంతో పాటు టీఆర్ఎస్ మళ్లి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం అధికార పార్టీకి మోకరిల్లడమే అంటూ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒకలా ఇప్పుడు మరో ధోరణితో ఎంఐఎం పార్టీ వుందని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనంగా మారింది కాబట్టే తెరపైన ఎంఐఎం పార్టీ మద్దతు తెర వెనుక బీజేపి మద్దతు తీసుకుని ఎన్నికల బరిలో నిలుస్తుందన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  TRS  Akbaruddin owaisi  KCR  Congress  Maha kutami  Telangana Politics  Telangana Politics  

Other Articles