Jana Sena fears life threat to Pawan Kalyan పవన్ కు ప్రాణహాని.. కుట్రకోణంపై జనసేన ఆందోళన..

Jana sena fears life threat to pawan kalyan

janasena, pawan kalyan, nadendla manohar, car accident, lorries, Rajanagaram, lorry rammed into pawan convey, jubilee hills, injuring security personal, lorry rammed into car, Driver C.S. Raju, conspiracy, YS Jagan, hyderabad police, andhra pradesh, politics, Crime

Jana Sena cadres worried over the attacks on Jana Sena founder K. Pawan Kalyan’s convoy and that of former AP Assembly Speaker Nadendla Manohar at various places.

పవన్, ముఖ్యనేతలకు ప్రాణహాని వుందా.?

Posted: 11/20/2018 05:40 PM IST
Jana sena fears life threat to pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రాణాలకు హాని తలపెట్టేందుకు కుట్ర జరుగుతుందా.? పవన్ తో పాటుగా ఆ పార్టీలోని సీనియర్ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారా.? ఆంధ్రప్రదేశ్ లో జనసేనాని పవన్ కల్యాణ్ కాన్వాయ్, ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాదులో జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ కారు ప్రమాదాలకు గురికావడం చూస్తుంటే.. జనసేనానితో పాటు పార్టీ సీనియర్ నేతలకు ప్రాణహాని వుందని జనసేన నేతలు భాయందోళన చెందుతున్నారు.

వరుసగా జరుగుతున్న పరిణామాలు జనసేన కార్యకర్తలు, శ్రేయోభిలాషుల్లో అందోళనకు గురిచేస్తుంది. జనసేనాని సహా ముఖ్యనేతల ప్రాణాలను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన కొడికత్తి ఘటన తరువాత.. ఇప్పుడు రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించి.. అంచెలంచెలుగా జననాడిని పసిగడుతూ.. జనంలోకి దూసుకువెళ్తున్న జనసేన పార్టీకి రాష్ట్రంలోని యువత, మహిళలు అధికంగా అకర్షితులు కావడంతో ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారా.? అంటే అవునన్న సమాధానాలే వినబడతున్నాయి.

ఈ నెల 15న కాకినాడ నుంచి రాజానగరం వెళ్తున్న పవన్ కల్యాణ్ ను కాన్వాయ్ పైకి ఓ లారీ దూసుకోచ్చింది. కాన్వాయ్ లోని ఓ కారులో వున్న డ్రైవర్ సహా పవన్ వ్యక్తిగత సిబ్బందిని గాయాలపాలు చేస్తూ లారీ దూసుకెళ్లింది. ఇక అదే రోజు ఇటు హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లో హెరిటేజ్ వద్ద కారు టర్న్ తీసుకుంటుండగా, వెనక నుంచి వచ్చిన లారీ జనసేన సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ కారును ఢీకొట్టింది.

ఈ రెండు ఘటనను కాకతాళీయంగా అదే రోజు.. అదే తరహా ఘటనలు చోటుచేసుకోవడంతో.. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఇందులో కుట్రకోణం వుందని అరోపిస్తున్నారు. అయితే ఈ కుట్రలకు పాల్పడింది ఎవరు అన్న విషయంలో మాత్రం వారు నిక్కచ్చింగా అంచనాకు రాలేకపోతున్నారు. వైఎస్ జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తమ అధినేత కాన్వాయ్ ని, నాదేండ్ల కారును లారీలు ఢీకొనడంతో.. ఇందులో ఖచ్చితంగా కుట్రకోణం వుందని, దీనిపై పోలీసులు లోతైన విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే వైఎస్ జగన్ పై దాడి జరిగిన క్రమంలో.. భవిష్యత్తులో జనసేనానిపై కూడా దాడి జరిగితే..? దానిని కూడా తమ ఖాతాలోనే వేస్తారా.? అంటూ బీజేపి నేతలు లేవనెత్తిన అంశాన్ని కూడా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని జనసేన కార్యకర్తలు యోచిస్తున్నారు. జగన్ పై దాడిపై స్పందించిన టీడీపీ నేతలు ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలోని బలగాలు పహారా వుండే విమానాశ్రయంలో జరిగిన దాడికి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు వుంటన్నాయన్న ప్రశ్నలు లేవనెత్తి తప్పును కేంద్రంపై వేసిన క్రమంలో బీజేపి ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఈ ఘటనలు యాదృశికంగా జరిగాయా.? లేక కుట్రకోణాలు వున్నాయా.? అన్నది పోలీసులే తేల్చాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  nadendla manohar  car accident  lorries  conspiracy  YS Jagan  Crime  

Other Articles