TDP denying Assembly Ticket to Speaker Kodela.? కోడెలకు అసెంబ్లీ టిక్కెట్ నిరాకరిస్తున్న టీడీపీ..?

Tdp denying assembly ticket to speaker kodela

andhra pradesh elections 2019, andhra pradesh assembly election, AP assembly elections, Andhra Pradesh speaker, AP Legislative Assembly, Kodela siva prasad, speaker kodela, kodela shiva prasad, Kodela corruption, Andhra Pradesh, Politics

IF sources are to be belived and true, a sensational news is doing rounds in the political circles, that the Andhra Pradesh Speaker Kodela Shiva prasad Rao is being denied assembly party ticket.

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెలకు సీటు లేదా.?

Posted: 11/13/2018 08:28 PM IST
Tdp denying assembly ticket to speaker kodela

ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీలో సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్న కొడెల శివప్రసాద్ రావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుందా.? అధికారం మాటున కొడెల తనయుడు చేస్తున్న అక్రమాలు. అవినీతి వ్యవహారాలే ఆయన రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం చేస్తున్నాయా.? పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా కొడెల శివప్రసాద్ పై ఇలాంటి అరోపణలు రావడం సంచలనంగా మారిందా.? అంటే ఔవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

స్పీకర్ అంటే శాసనసభను సక్రమంగా నడిపించే లీడర్.. మరీ ఎమ్మెల్యే అంటే తన నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలను దూరదుష్టితో అలోచించి సమస్యకు సత్వర పరిష్కారంతో పాటు శాశ్వత పరిష్కారం కూడా అందించాలి. వారే నిజమైన నాయకులు. నాయకులకు రాజకీయ నేతలకు ఎంతో వత్యాసం వుంది. రాజకీయ నేతలు ఏ ఎండకాగొడుగు పట్టుకుని ప్రజలకు చెప్పేందుకే నీతులు, కానీ తాము అచరించేందుకు మాత్రం కాదని.. ఎవరైనా నిలదీసినా.. ముఖం ముందే తిట్టినా పెద్దగా పట్టించుకోకుండా తిరగేవారు.

నాయకుడికి, రాజకీయ నేతకీ మధ్య వత్యాసాన్ని, అర్థాన్ని పక్కన బెడితే.. ఈ మధ్యకాలంలో మాత్రం ఎంత ఖర్చు పెట్టామా.? తమ పదవి వున్న కాలంలో ఎంతమేరకు అర్జించామా.? అన్నదే నేతల పరమావధిగా మారిందన్న అరోపణలు వినబడుతున్నాయి. ఇందుగలదు అందులేదన్న సందేహము వలదు.. ఎందెందు వెతికినా అవినీతి దర్శనమిచ్చు అన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ మరీ ముఖ్యంగా ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలలోనూ ఈ తరహా నేతలకు కొదవలేదని గుసగుసలు వినబడుతున్నాయి.

ఈ క్రమంలో తమ మంత్రులకు ర్యాంకులిచ్చి వారి పనితీరును అంచనా వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా పార్టీలోని ఎమ్మెల్యేలు.. రానున్న ఎన్నికలలో గెలిచే సత్తా వుందా.? ప్రజల్లో వారి పట్ల ఏ మేరకు ఆదరణ వుంది.. ఏ మేరకు వ్యతిరేకత వుందన్న విషయాలను అంచనా వేస్తూ అధికార పార్టీ ఓ రహస్య సర్వేను నిర్వహించింది. ఈ సర్వేను పరిశీలించిన టీడీపీ అధిష్టానం.. స్పీకర్ కొడెల నియోజకవర్గంలో ఆయనపై వచ్చిన ఫలితాలు చూసి విస్మయానికి గురైందట.

 దీంతో రానున్న ఎన్నికలలో సభాపతి కొడెల శివప్రసాద్ రావుకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయానికి కూడా వచ్చేసిందట. ఇక్కడే కాదు ఆయన గతంలో పోటీ చేసి పలు పర్యాయాలు గెలిచిన నరసారావుపేట నియోజకవర్గంలో కూడా ఆయన గ్రాఫ్ చాలా కిందకు దిగజారిపోయిందట. అందుకు కారణాలు ఆయన తనయుడు (పుత్రరత్నం) చేసే అక్రమాలు, అవినీతే కారణమని కూడా తేలిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అధికార పార్టీలో ఏ ఒక్క స్థానం నుంచి తమకు కావాల్సిన సమాచారం అందివచ్చినా.. చేజారనివ్వని విపక్ష వైఎస్సార్ సిపీ కొడెల విషయంలోనూ అవకాశాన్ని చేజార్చుకోకూడదని భావిస్తోంది. కోడెలపై ప్రజల్లో వున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మర్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సైన్యం పేరుతో వున్న ఫేస్ బుక్ అకౌంట్ లోనూ కోడెలకు సంబంధించిన ఓ వీడియోను పెట్టి ప్రచారం చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. మరి ఇప్పటికైనా కొడెల తన కొడుకు అగడాలకు అడ్డుకట్ట వేసి.. ప్రజల్లో తనపై వున్న వ్యతిరేకతను సరిచేసుకుంటారా.? లేక నరసరావుపేట. సత్తెనపల్లి కాకుండా మరో నియోజకవర్గానికి తన పోరును బదిలీ చేసుకుంటాడా.? అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kodela siva prasad  speaker  corruption  assembly ticket  Andhra Pradesh  Politics  

Other Articles