ycp to feild muslim candidate in Sattenapalli సత్తెనపల్లిలో మైనారిటీ వైపు వైసీపీ చూపు..?

Ysrcp high command to shock ambati rambabu in sattenappalli

ambati rambabu, muslim candidate, sattenapalli assembly, muslim voters, YSRCP, YCP high command, muslim candidate, sattenapalli, guntur, Andhra Pradesh, politics

According to sources, it came to know that ysrcp high command to shock ambati rambabu in sattenappalli assembly constituency by feilding a minority candidate, and to grab high mumber of minority votes.

సత్తెనపల్లిలో అంబటికి వైసీపీ అధిష్టానం షాక్..?

Posted: 11/05/2018 05:14 PM IST
Ysrcp high command to shock ambati rambabu in sattenappalli

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్రంలోని తమ పార్టీ సీనియర్ నేతలను సైతం కలవరానికి గురిచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన నేతలపై సర్వేలు చేయించిన పార్టీ.. అనేక స్థానాల్లో సమన్వయ కర్తలను మార్చేసింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నాయకత్వంపై కూడా సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం.

దీంతో సత్తెనపల్లి అసెంబ్లీ స్థానంలో కూడా నాయకత్వ మార్పు చేయాలని వైసీపీ అధిష్టానంలో యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ సత్తెనపల్లిలోని పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేలో అంచానాలు ఎలా వున్నాయో తెలుసుకున్న వైసీపీ అధిష్టానం.. పార్టీని పరుగులెత్తించడం విఫలం అయ్యాడంటూ అంబటి రాంబాబు నాయకత్వం పై అసంతృప్తితో వుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనకు రానున్న ఎన్నికలలో షాక్ ఇచ్చేందుకు కూడా సిద్దమయ్యిందని సమాచారం.

వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వలలో అంబటి రాంబాబుపై పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నట్టు ఫలితాలు వచ్చాయిని.. దీంతో ఆయనకు సత్తెనపల్లి సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా తప్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. 2014లో స్వల్ప మెజారిటీతో పరాజయం చవి చూసినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో అంబటి దారుణంగా విఫలమైనట్టు పార్టీలో పెద్దల మధ్య కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది. అయితే అంబటి రాంబాబు విషయంలో పునరాలోచనలో పడ్డ పార్టీ అధిష్టానం అందుకు బలమైన వర్గం నుంచి నేతలను బరిలోకి దింపాలని కూడా ప్రతిపాదనలో వుందని సమాచారం.

గుంటూరు జిల్లాలో మైనారిటీలు అధికంగా వున్నందున వారిని కూడా ఆదరించాలని.. తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ జనసేన భావిస్తున్న క్రమంలో అందోళనలో పడిన వైసీసీ మైనారిటీ వర్గాలను అకర్షించేందుకు అటువైపుగా దృష్టిసారించిందన్న వార్తలు వినబడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పిఎసి కమిటీ నిజాయితీ గల మైనారిటీ నేతలను గుర్తించి.. వారినిరాష్ట్రస్థాయి నేతలుగా ప్రోత్సహించాలన్న నిర్ణయం కూడా తీసుకుంది.

ముఖ్యంగా మైనారిటీ ఓట్లు అధికంగా వున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనారటీ నేతలను ప్రోత్సహించేందుకు జనసేన రాజకీయ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జనసేన మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపుతుందని సమాచారం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 9 వేల ఓట్లు వుండగా, అందులో దాదాపుగా 33 వేల ఓట్లు మైనారిటీలవే. దీంతో ఈ స్థానాన్ని గెలుపొందేందుకు ముస్లిం నేతనే తమ పార్టీ తరపున బరిలోకి దింపాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.

ఈ విషయాన్ని తెలుసుకన్న వైసీపీలో అందోళన చెందుతుందని.. దీంతో అలోచనలో పడ్డ అధిష్టానం.. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి అంబటి రాంబాబును తప్పించి ముస్లిం అభ్యర్థిని ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే అధికారంలోకి వస్తే.. అంబటి రాంబాబుకు నామినేటెడ్ పదవి కల్పించాలని కూడా నిర్ణయించిందట. అయితే ఇప్పటికే పార్టీలో అధికార ప్రతినిధి హోదాను కల్పించిన అధిష్టానం.. పార్టీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అంబటి రాంబాబు.. అధిష్టానానికే సూచనలు చేస్తున్నారట. నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు అందరూ తన చేతిలోనే వున్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని ధీమాను కూడా వ్యక్తం చేశారట. తనకు ఇవ్వాలని భావించే నామినేటెడ్ పదవిని ముస్లిం నేతలకు కేటాయిస్తే సరిపోతుందని కూడా అధిస్టానం దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. ఇక నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు ఎవ్వరూ ఎమ్మెల్యే పదవికి పోడిపడే స్థాయిలో కూడా లేరని ఆయన అధిష్టానానికి చెప్పారని తెలుస్తుంది.

ఇక దీనికి తోడు ముస్లింలకు టికెట్ ఇస్తే సాధారణ ప్రజలు ఎవరు ఓట్లు వేయరని కూడా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తుంది. అయితే ముస్లింలకు మార్కెటింగ్ యార్డు చైర్మన్ పదవినిచ్చి సరి పెట్టొచ్చని కూడా అంబటి రాంబాబు అధిష్టానానికి సూచించారని తెలుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం అంబటి రాంబాబును సమన్వయకర్తగా ప్రకటించినా.. అతన్ని సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు అలోచనలో పడిందని తెలుస్తుంది.

టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ వంటి బలమైన అభ్యర్థిని ఎదుర్కోవడం అంబటి వల్ల కాదని వైసీపీ అధిష్టానం సందిగ్ధంలో పడిందని సమాచారం. సత్తెనపల్లి స్థానం నుంచి అంబటిని బరిలో దింపకపోతే ఆయన చేసే ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలి.. ఆయనను ఎలా సముదాయించాలన్న విషయాలపై కూడా వైసీపీ అధిష్టానం ముందుచూపుతో వ్యవహరిస్తుందని తెలుస్తుంది. అయినా అంబటి తమ దారికి రాకపోతే సీటు వదులుకోవడం లేదా అంబటిని వదిలించుకోవడమా అనే మీమాంసలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

అయితే సత్తెనపల్లి నుంచి ఈ సారి బరిలోకి దిగే అవకాశం వస్తే తమకు తమ వర్గం వారు తప్ప మిగతా నేతలెవ్వరూ ఓట్లు వేయరని అంబటి రాంబాబు వైసీపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న వార్తలు తెలుసుకున్న మైనారిటీలు అంబటిపై అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తమ ఓట్లతో అంబటి రాంబాబు లాంటి నేతలు ఎమ్మెల్యేలు కావచ్చు.. కానీ మేము మాత్రం రాజకీయాలకు పనికిరామా.? అంటూ మండిపడుతున్నారు.

అంబటి రాజకీయ జీవితం లోటస్ పాండ్ లో ముగియనున్నట్లు కూడా వారు శాపనార్థాలు పెడుతున్నారట. తమ వర్గానికి చెందినవాళ్లు ఎమ్మెల్యేలుగా ఎదగడం ఇష్టం లేక అంబటి అధిష్టానం వద్ద ఇలా విమర్శలు చేస్తున్నారని ముస్లిం నేతలు ఒంటికాలుపై లేస్తున్నారు. రాష్ట్రంలో పలు అసెంబ్లీ స్థానాల్లో.. ప్రజల ఓట్లు వేయకపోతే.. మైనారిటీ నేతలు ఎలా ఎమ్మెల్యేలు అవుతున్నారని.. కూడా ముస్లిం నేతలు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Priyanka gandhi to contest loksabha elections from raibareli

  రాయబరేలీ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ.?

  Jan 23 | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం రాజకీయ విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. గత ఎన్నికల ముందు ఇలాంటి సంచలనాలకు తెరలేపిన బీజేపిని రానున్న లోక్ సభ ఎన్నికలలో ధీటుగా... Read more

 • Kiran bedi likely to be new governor of andhra pradesh soon

  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కిరణ్ బేడీ.?

  Jan 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నారన్న వార్త రాజకీయవర్గాలో మరోమారు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు గవర్నర్ గా వున్న ఈఎస్ఎల్ నరసింహన్ దాదాపుగా తొమ్మిదేళ్లకు పైగా పదవిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం... Read more

 • Karnataka coalition dodges crisis threat of collapse still looms

  స్వతంత్ర ఎమ్మెల్యే బాటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

  Jan 17 | కర్ణాటకలో కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం దిశగా సాగుతుందా.?బీజేపి అన్నంత పని చేస్తుందా.? ఇటీవల బీజేపి నేత ఉమేష్ కత్తి వారం రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దెదింపడం గ్యారంటీ అంటూ వ్యాఖ్యలు చేసిన... Read more

 • Six mlas including sabita reddy to join trs

  ప్రతిపక్ష హోదాను కోల్పోనున్న కాంగ్రెస్ పార్టీ..!

  Jan 12 | తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలాపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను కోల్పోనుందా.?... Read more

 • Sabarimala row 20 arrested for hurling bombs at homes of cpm leaders

  దేవుడి సోంత రాష్ట్రంలో బాంబుల మోత..!

  Jan 05 | దేవుడి సొంత రాష్ట్రంగా.. ప్రశాంతమైన ప్రకృతికి అలవాలైన రాష్ట్రం కేరళ. అఖండభారతావనిలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. అలాంటి సస్యశామల అన్న పదానికి నిర్వచనంలా వున్న రాష్ట్రంలో ప్రస్తుతం బాంబు విస్పోటనాలు... Read more

Today on Telugu Wishesh