RBI vs Govt: centre remains mum on Section 7 అర్బీఐ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా.?

Rbi governor urjit patel s possible resignation rock indian government

Finance minister vs RBI, Union finance minister, Urjit patel resignation, Arun Jaitley, resign, NPA, Urjit Patel, RBI Governor, Viral Acharya, RBI deputy governor, BJP Rajya sabha member, subramanian swamy, national news

After Rift between the Indian government and the RBI, some reports have suggested that the Governor of the federal bank, Urjit Patel, may resign. This news has sent rocked the Indian government.

అర్బీఐ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా.?

Posted: 10/31/2018 01:40 PM IST
Rbi governor urjit patel s possible resignation rock indian government

కేంద్రం ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకును కూడా తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణల చేసిన కేంద్రం తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే ఔననే సమాధానాలే వినబడుతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకుకు తాజాగా ప్రత్యేకమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని కూడా కేంద్రం భావిస్తుందా.? అయితే ఈ మార్గదర్శకాలను విభేదిస్తున్న రిజర్వు బ్యాంకు ఉన్నాతాధికారులు అది అసమంజసమని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అటు కేంద్రప్రభుత్వానికి ఇటు అర్బీఐకి మధ్య వివాదాలు కూడా పోడచూపుతున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపై కేంద్రం గుర్రుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆయను పదవి నుంచి సాగనంపాలని యోచిస్తుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయాలని కేంద్రం యోచిస్తోందనీ, అలాంటి నిర్ణయం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుందని ఆచార్య ఇటీవల కేంద్రాన్ని హెచ్చరించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌ 7 కింద అర్బీఐకి ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్రం యోచిస్తుందని సమాచారం. ఈ క్రమంలో డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కేంద్రం నిర్ణయంపై తనదైన శైలిలో స్పందించారు. కేంద్రం నిర్ణయం దేశ అర్థిక వ్యవస్థకు సుబిక్షం కాదని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం విరాల్ ఆచార్య ను పదవి నుంచి సాగనంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికీ అటు రిజర్వు బ్యాంకుగానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు.

ఇదిలావుండగా, అటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఇప్పటికే బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అయనకు అర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని అందుచేతే దేశ అర్థిక వ్యవస్థ కాస్త ఇబ్బందులను ఎదుర్కోంటుందని అభిప్రాయపడిన క్రమంలో అరుణ్ జైట్లీ తన విధులు, బాధ్యతలపై అధికంగా దృష్టిసారించారు. దీంతో ఆయన అర్థిక వ్యవస్థతో దేశప్రజలు ఇబ్బందులకు గురికావడానికి కారణం భారతీయ రిజర్వు బ్యాంకు అని చెప్పకనే చెప్పారు. అర్బీఐని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా రుణాలను ఇస్తూ పోతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని అర్బీఐని అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ఇది దేశ ప్రజలకు ఎలాంటి సందేశం పంపుతుందో తెలుసా.? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి ఉర్జిత్ పటేల్ తప్పుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ విషయమై ఉర్జిత్ పటేల్ సన్నిహితులు కొందరు స్పందిస్తూ.. గవర్నర్ బాధ్యతల నుంచి పటేల్ తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కాగా, అర్బీఐకి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తే మరిన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుందని కేంద్ర మాజీ అర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.

భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అవలంభిస్తున్న విధానాల కారణంగా దేశం అర్థికంగా పురోగమించడం లేదని ఆయనపై అరోపణలు చేసిన బీజేపి ఎంపీలు.. ఆయన పదవిని కేంద్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ పొడగించేందుకు వీలు లేకుండా చేసి.. తనంతట తాను తనకు మరో పర్యాయం అర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టడం ఇష్టం లేదని చెప్పేట్లు చేసి.. సాగనింపిన తరువాత.. ఆఘమేఘాల మీద తీసుకువచ్చిన ఊర్జిత్ పటేల్ కు పగ్గాలను అందజేశారు. ఇప్పుడు అయనను కూడా ఆ పదవిలో కొనసాగించేట్లు లేదు. అయితే సుబ్రహ్మణ్యస్వామి కౌంటర్లకు జైట్లీ ప్రతికౌంటర్ గానే ఊర్జిత్ ను టార్గెట్ చేశారని, అందుకు నోచ్చుకున్న ఆయన రాజీనామాకు సిద్దపడ్డారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Tdp denying assembly ticket to speaker kodela

  ఏపీ శాసనసభ స్పీకర్ కోడెలకు సీటు లేదా.?

  Nov 13 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీలో సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్న కొడెల శివప్రసాద్ రావుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుందా.? అధికారం మాటున కొడెల తనయుడు చేస్తున్న అక్రమాలు. అవినీతి... Read more

 • Rbi governor urjit patel s possible resignation on november 19 th

  ఈసారి ఫిక్స్.. సాగనంపక ముందే సర్ధేసుకుంటున్నాడా.?

  Nov 08 | తమ అదుపాజ్ఞలలోనే భారతీయ రిజర్వు బ్యాంకు కూడా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందా.? రిజర్వు బ్యాంకుపై అధిపత్యం కోసం ఇప్పటికే పలు సవరణలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా మరిన్ని సవరణలు చేయనుందా.? అంటే... Read more

 • Had gali janardhan reddy fled to abroad suspects ccb

  దేశం విడిచి పారిపోయిన గాలి జనార్థన్ రెడ్డి.?

  Nov 08 | దేశానికి చెందిన అర్థిక నేరగాళ్లు బాటలోనే మైనింగ్ బారన్ కూడా పయనించాడా.? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. మద్యం వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా, నగల వ్యాపారి నిరవ్ మోదీల మాదిరిగానే కర్ణాటక మాజీ... Read more

 • Ysrcp high command to shock ambati rambabu in sattenappalli

  సత్తెనపల్లిలో అంబటికి వైసీపీ అధిష్టానం షాక్..?

  Nov 05 | రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్రంలోని తమ పార్టీ సీనియర్ నేతలను సైతం కలవరానికి గురిచేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో... Read more

 • Bjp mp subramanian swamy self goal at ficci

  కందకు లేని దురద కత్తికెందుకు స్వామీ

  Oct 29 | బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తిగా, పలు కీలక అంశాలపై న్యాయస్థానాలకు వెళ్లి న్యాయ పోరాటం చేసే వ్యక్తిగా భారతీయ ప్రజలకు సుపరిచితమే. మరీ ముఖ్యంగా... Read more

Today on Telugu Wishesh