telugu states political parties go divided in RS deputy chairmanరాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలలో మనవారి రూటే సపరేటు

Telugu states political parties go divided in rs deputy chairman

rajya sabha, RS deputy chairman, RS deputy speaker election, TRS, TDP, YCP, Congress, UPA, NDA, deputy speaker, Harivansh Narayan Singh, BK Hariprasad, politics

telugu states political parties go divided in RS deputy chairman, Telangana ruling TRS party favours BJP-led NDA nominee Harivansh Narayan Singh, while andhra pradesh ruling TDP party votes in favour of opposition's BK Hariprasad and the opposition YCP stay away from elections

రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలలో మనవారి రూటే సపరేటు

Posted: 08/09/2018 12:39 PM IST
Telugu states political parties go divided in rs deputy chairman

రాజ్యసభ ఢిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో కొనసాగిన ఉత్కంఠ ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిని కనబర్చారు. వీరు అసక్తిని కనబర్చడానికి గల కారణం ఏమిటీ అంటే..? ఈ ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు.. ఏటు వైపుకు వెళ్తాయన్నదే. రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అని నిత్యం బాష్యాలను వల్లించే పార్టీలు.. ఒక రాష్ట్రానికి కష్టం వస్తే మరో తెలుగు రాష్ట్రం కూడా వారికి బాసటగా నిలుస్తుందని చెప్పిన నేతల మాటల్లో ఎంత మేర చిత్తశుధ్ది వుందన్న విషయాన్ని ఈ ఎన్నికలు బట్టబయలు చేస్తాయని ప్రజలు అసక్తిని కనబర్చారు.

అయితే నేతల ప్రసంగాల్లో చిత్తశుధ్ది నేతి బీరకాయలోని నేతి మాదిరగానే వుందన్ని ఈ ఎన్నికల ద్వారా తెలిసిపోయింది. నేతలు ప్రజల ముందు మైకాసురులవుతారే తప్ప అచరణలో మాత్రం చూపవని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఓ కంట కన్నీరు వస్తే మరో కంట మాత్రం ఆనందబాష్పాలు వస్తున్నాయి. కేవలం రాజకీయం. అధికారమే పరమావధిగా మన తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలో వ్యవహరిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తమది తలో దారి అని ఈ ఎన్నికలలో మన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నిరూపించుకున్నాయి.

రాజ్యసభ ఢిఫ్యూటీ చైర్మైన్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మన పార్టీలు కనీసం మూకుమ్మడిగా కూడబలుకుకుని ఎన్నికలు వెళ్లలేదు. తమ పార్టీ నిర్ణయం తమదన్నట్లు గానే వ్యవహరించాయి తప్ప.. తెలుగువారందరూ ఒక్కటే అన్న ఐక్యతను చాటే విషయంలో మాత్రం మరోసారి విఫలమయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికలకు పార్టీల మధ్య ఉన్న ఐక్యతా రాగం ఈ సారి మాత్రం బెడిసికొట్టింది. తమకు ప్రత్యేకహాదాతో పాటు విభజన హామీలను నెరవేర్చడంతో విఫలమైన కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి.. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఓటువేసింది.

రాష్ట్రానికి నిధులు ఇచ్చి అదుకుంటామని ఎన్నికల ముందు హామీలను గుప్పించి.. నాలుగేళ్లు గడుస్తున్నా.., అంతా రాజకీయ కోణంలోనే అలోచించి నిర్ణయాలు తీసుకుంటూ తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విపక్షాలకు చెందిన హరిప్రసాద్ కు టీడీపీ మద్దతు పలికింది. ఇక అంధ్రప్రదేశ్ లోని ఏకైక విఫక్ష పార్టీగా వున్న వైసీపీ మాత్రం తాము కేంద్రంతో అంటకాగుతున్నామన్న విమర్శలను తిప్పికోట్టేలా.. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని ప్రకటించింది. అదే సమయంలో ప్రతిపక్ష అభ్యర్థికి కూడా మధ్దతును పలకకుండా ఓటింగ్ కు దూరంగా నిలిచింది.

ఇదిలా వుండగా, తెలంగాణలోని అధికార పక్షం టీఆర్ఎస్ మాత్రం ఓ వైపు కేంద్రంపై మీడియా, సోషల్ మీడియా ముఖంగా విమర్శలు చేస్తూనే మరో వైపు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతునిచ్చింది. ఇదే సమయంలో రాజ్యసభలోని పలు విపక్ష పార్టీలు కూడా విపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి చివరి నిమిషంలో షాక్ ఇస్తూ ఎన్నికలకు దూరంగా వుంటామన్న నిర్ణయాలను తీసుకున్నాయి. దీని ఫలితంతా విపక్షాల ఐక్యత రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇలానే వుంటుందని నెట్ జనులు విమర్శలు చేస్తున్నారు. ఇవే సంకేతాలు దేశ ప్రజల్లోకి వెళ్తే.. అవి అధికార పక్షానికి అదనపు బలాన్ని అందిస్తాయన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajya sabha  RS deputy chairman  TRS  TDP  YCP  Congress  UPA  NDA  deputy speaker  Harivansh Narayan Singh  BK Hariprasad  politics  

Other Articles