Won't allow others to use Shiv Sena's shoulders to fire సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపికి ఎదురుదెబ్బలా.?

Teasing a break up uddhav thackeray says shiv sena will oppose bjp openly

Amit Shah, BJP, Narendra Modi, shiv sena, uddhav thackeray, PM Modi, biju janata dal, naveek patnaik, nation, politics

Two days after abstaining from the no-trust vote against the Narendra Modi government, Uddhav Thackeray has said that he won’t let anyone shoot from the Shiv Sena’s shoulders.

సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపికి ఎదురుదెబ్బలా.?

Posted: 07/23/2018 04:53 PM IST
Teasing a break up uddhav thackeray says shiv sena will oppose bjp openly

పార్లమెంటులో కేవలం రెండు స్థానాల నుంచి ఏకంగా మూడు దశాబ్దాల తరువాత సాధించిన మెజారిటీ స్థాయికి ఎదిగిన కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీకి మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయా.? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఓ వైపు గత సార్వత్రిక ఎన్నికల వేళ.. తనతో పాటు నడిచిన జేడీయును కాదనుకున్న బీజేపి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఖంగుతిని.. అధికారానికి దూరమైన తరువాత మహాకూటమిని విడగొట్టి జేడియుతో జతకట్టి అధికారాన్ని పంచుకుంది.

ఇదే క్రమంలో గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిత్రపక్షమైన శివసేనను కాదనుకున్న బీజేపి.. ఎన్నికలైన తరువాత మాత్రం మళ్లీ స్నేహహస్తాన్ని అందించింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఇద్దరూ కలిసే వెళ్లారు. అయినా ఈ రెండు మిత్రపక్షాల మధ్యన మాత్రం ఎప్పుడు పొసగడం లేదన్నది రాజకీయ వర్గాల టాక్. ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాలను శివసేన నిర్వంధంగా విమర్శిస్తూ వస్తుంది. నోట్ల రద్దు, జీఎస్టీ, ఇలా అనేక అంశాలపై బాహాటంగానే తమ వ్యతిరేక గళాన్ని విపిసిస్తుంది. అయితే ఆ తరువాత మళ్లీ చిగురించిన స్నేహ బంధం ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్లేనా? అన్న ప్రశ్నలు రేకెత్తకమానడం లేదు.

అందుకు కారణం.. బీజేపిపై తమ విమర్శలను సూటిగా చెబుతూనే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శించడం అంత సముచితం కాదని చెప్పింది. దీంతో పాటు బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా ఇప్పటికే పలుమార్లు ప్రశంసించిన శివసేన.. తాజాగా మా మనస్సులు గెలుచుకున్నావు సోదరా అంటూ మరింత చేరువయ్యే వ్యాఖ్యలతో కొనియాడింది.

‘మా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే అవకాశం ఎవరికీ ఇవ్వబోమ’ని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే బీజేపీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. మొన్న అవిశ్వాస తీర్మానం సమయంలో శివసేన గైర్హాజరై బీజేపీకి షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు ఉద్ధవ్‌ వ్యాఖ్యలు బీజేపీని ఆలోచనలో పడేశాయి. ‘‘మిత్రపక్షమైన బీజేపీని గతంలో బహిరంగంగా సమర్థించాం. ఇక బహిరంగంగా వ్యతిరేకిస్తామ’’ని కూడా ఉద్ధవ్‌ అన్నారు. పార్టీ నేత సంజయ్‌ రౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ టీజర్‌ విడుదల కావడంతో అందులో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.

ఇంటర్వ్యూ పూర్తి ఎఫిసోడ్ సోమవారం అందరికీ అందుబాటులోకి రానుంది. మరోవైపు శివసేన పత్రిక సామ్నాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను కొనియాడడం విశేషం. లోక్ సభలో మోదీని రాహుల్‌ కౌగిలించుకుంటున్న ఫొటోను ‘‘సోదరా, మా మనసులు గెలుచుకున్నావ్‌’ అన్న వ్యాఖ్యతో ప్రముఖంగా ప్రచురించారు. మోదీ సర్కారుపై అవిశ్వాసం నేపథ్యంలో ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని శివసేన ముందు విప్‌ జారీ చేసిందని, తర్వాత దాన్ని రద్దు చేసిందన్న వార్తలు కూడా బీజేపీ సృష్టేనని శివసేన వర్గాలు చెబుతున్నాయి. మద్దతు కోసం బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు ఉద్ధవ్‌కు ఆగ్రహం రప్పించాయని ఆ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  BJP  Narendra Modi  shiv sena  uddhav thackeray  PM Modi  biju janata dal  naveek patnaik  nation  politics  

Other Articles