Pk removed the mask of TDP backstabbing politics.? టీడీపీ వెన్నుపోటు రాజకీయ ముసుగు తొలిగిందా.?

Pawan kalyan removed the mask of tdp backstabbing politics

pawan kalyan, janasena, pawan kalyan, janasena, backstabbing, NTR, Tarak (junior Ntr), chandrababu, nara lokesh, pawan kalyan fans, pawan kalyan ravi prakash, pawan kalyan srini raju, pawan kalyan nara lokesh, pawan kalyan chandrababu, pawan kalyan tweets, pawan kalyan mother, sri reddy, pawan kalyan on sri reddy controversy, pawan kalyan on sri reddy, sri reddy pawan kalyan news, pawan kalyan twitter posts, andhra pradesh, politics

Actor turned politician, tollywood power star Pawan Kalyan removed the mask of backstabbing politics of telugu desam party, which earlier done it in its founder president NTR and even in Tarak (junior Ntr) issue.

టీడీపీ వెన్నుపోటు రాజకీయ ముసుగు తొలిగిందా.?

Posted: 04/20/2018 07:06 PM IST
Pawan kalyan removed the mask of tdp backstabbing politics

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నేత ముఖ్యమంత్రి అయితే ఆయన నిర్మించే రాజధాని చిరస్థాయిగా ప్రపంచవ్యాప్త గుర్తింపుతో సాగేలా వుంటుందని తలచి.. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం నరేంద్రమోడీకి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు వద్దకు వచ్చి.. చంద్రబాబు బతిమాలితే.. మీకు కూడా మద్దతుగా నిలుస్తానని మాటఇచ్చి.. ఇచ్చిన మాటకు కట్టుబడి.. తన తుఫాను వేగ ప్రచారంతో.. సుడిగాలిలా ఉభయ తెలుగురాష్ట్రాలలో పర్యటించి.. ప్రజల అదరణపోంది.. వారి ఓట్లను టీడీపీ, బీజేపిలకు వేయించిన వ్యక్తి పవన్ కల్యాన్. అయితే పవన్ కల్యాన్ చంద్రబాబును అంచనా వేయడంలో మాత్రం పొరబాటు పడ్డారు. ఆయన గోబెల్స్ ప్రచారానికి తోడు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష నేత వైసీపి అధినేత వైఎస్ జగన్ పై పెట్టిన కేసులు, లక్ష కోట్లు స్వాహా చేశారన్న ప్రచారంతో పవన్ కూడా పొరబడ్డారు.

పవన్ ప్రచారంలో కేవలం ఐదు లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. పవన్ మద్దతు కూడగట్టుకుని హుధ్దూద్ తుఫాను బీభత్సం నేపథ్యంలో మైలేజీని అర్జించింది. ఔరా శబాష్.. చంద్రబాబు కూడా ప్రజల కోసం గెలిచిన వెంటనే పనులు చేస్తూ వారి కోసమే శ్రమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు.
* అయితే అ వెంటనే వచ్చిన గోదావరి పుష్కరాలలో.. అమాయక భక్తులు బలిగొన్నారు. ఇక ఈ ఘటనపై ఒకే జిల్లా కలెక్టర్ రెండు వేర్వేరు నివేదికలను ఇచ్చి.. అసలు అంశాన్ని మాత్రం పక్కదారి పట్టించారు.
* ఇదేదో పొరబాటుగా జరిగిందని ఊరుకుంటే.. ఆ వెంటనే జరిగిన ఎమ్మార్వో వనజాక్షి కేసులో ఆయన కుదర్చిన రాజీ.. ప్రభుత్వ ఉద్యోగుల అత్మస్థైర్యాన్ని దెబ్బతీసి.. పాలకులు ఏం చెబితే అదే చేయాలి అనేలా తయారు చేసింది.? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఐఎఎస్ లు ఇలా చేశారని ఆరోపించి నేత.. అధికారంలోకి వచ్చాక ఎమ్మారో స్థాయి అధికారులు కూడా తమ మాట తూచా తప్పకుండా పాటించాలని అదేశించడం సమంజసమేనా.?
* నాగార్జునా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి అంశంలోనూ ప్రధాన నిందితుడిని కాపాడేందుకు శాయశక్తులా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారన్న వార్తల్లో నిజం లేదా..?
* కాల్ మనీ విషయంలో కాలనాగులతో టీడీపీకి సంబంధముందని వైసీపీ నేతలు ఫోటోలు, అధారాలతో నిరూపించింది వాస్తవం కాదా.?
* ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎంపీలు ప్రధానిని నిలదీయండని పవన్ ప్రశ్నించింది నిజం కాదా.?
* రాష్ట్ర వ్యాప్తంగా మూడు సభలు పెట్టి హోదా సెగను కేంద్రానికి తెలిసేలా చేసింది నిజమౌనా..? కాదా.?
* హోదా ముగిసిన అధ్యాయమని అని మీ గొంతులే ధన్వించాయా..? లేదా.?
* హోదా కాదు ప్యాకేజీయే ముద్దు అని అర్థరాత్రి హైలెవల్ హంగామా మధ్య నినదించింది మీరు కాదా.?
* సుదీర్ఘ అనుభవ రాజకీయ నేతైన చంద్రబాబుకు అంత్యనిష్టూరం కన్నా అదినిష్టూరమే మేలన్నది మీకు తెలియనిదా..?
* హోదా విషయంలో మొదటి నుంచి సన్నాయి నోక్కులు నొక్కి.. ఎన్నికల ముందు మాత్రం వీరోచిత పోరాట డ్రామాకు తెర తీస్తుంది ఎవరు.?
* పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి పట్టిసీమ నిర్మాణం చేసి అవినీతికి అడ్రస్ గా మారారన్న అరోపణల్లో నిజముందా.?
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా అవకతవకలు వున్నాయన్నది నిజమేనా..?

ఈ విషయాలన్నింటినీ పట్టించుకోన్నట్లు వున్నా.. అసలేం జరుగుతుందన్న విషయాలను తెలుసుకునేందుకు అటు వామపక్ష నేతలు, ఇటు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించి.. హోదాపై ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించిన పవన్ కల్యాన్.. వీరితో కలసి నిజనిర్థారణ కమిటీ వేసి.. నిజాలను వెలుగులోకి తీసుకురావాలని అనుకున్నారు. లెక్కలు చూసిన పవన్.. ఓ సందర్భంగా నియోజిక వర్గానికి పది కోట్ల రూపాయలైనా వెచ్చించాలి.. ఇక బలమైన అభ్యర్థులుంటే వాటిని 15 నుంచి 20 కోట్లకు పెంచాలి.. ఇలా కనీసం విభజన చట్టం ప్రకారం నియోజకవర్గ స్థానాలు పెరిగితే 225.. అంటే ఏకంగా 2250 కోట్ల నుంచి 4000 వేల కోట్ల వరకు అధికార పార్టీ అమ్యామ్యా చేసిందన్న విధంగా పవన్ కల్యాన్ గుంటూరులోని మంగళగిరిలో జరిగిన జనసేన వ్యవస్థాపక సభలో అరోపణలు చేశారు.

ఇది పార్టీ పరంగానే అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నట్టు.. పార్టీకి చెందిన మంత్రలు ఎంత స్వాహా చేసినట్లు.. ఇక మొత్తంగా పార్టీ ప్రచారానికంటూ ఎంత పక్కనబెట్టినట్టు.. అన్న వివరాల జోలికి వెళ్తే.. అక్షరాల పదివేల కోట్ల రూపాయలకు పైగానే అవినీతి జరిగిందా...? అన్న అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నీతి, నిజాయితీకి కట్టుబడ్డ సత్యహరిశ్చంధ్రుడి వంశాంకురం అన్నట్లుగా గోప్పలు చెప్పుకునే నేత పాలనలో అభివృద్ది పరుగులు తీస్తుందనుకుంటే.. అవినీతి రాజ్యమేలుతుందని తెలుసుకున్న పవన్.. సత్యాన్వేషణలో ఇంకెన్ని విషయాలు వెల్లడయ్యాయో అతనికే తెలియాలి. దీంతో పవన్ గుంటూరు సభలో టీడీపీ, అవినీతి, లోకేష్ అవినీతిపై ప్రశ్నలు సంధించారు.

ఇక పవన్ తమ అవినీతి పుట్టను తవ్వతున్నాడని పసిగట్టిన కొందరు పార్టీ ప్రముఖ నేతలు.. విషయాన్ని చిన్న అధిష్టానం వద్దకు తీసుకెళ్లారు. అయితే అక్కడే కథ మలుపు తిరిగింది. తాము అధికారంలోకి రావడానికి కారణమైన ఐదు లక్షల ఓట్లతో పాటు అనేక మంది అభిమానుల ఓట్లు పవన్ పుణ్యమా అనే టీడీపీ పార్టీకి వచ్చాయి. అదే కనక జరగకపోతే టీడీపీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యేది. దీంతో పవన్ లేకపోతే తమకు అధికారం లేదన్న గ్రహించి ఓ వైపు తమ ఎంపీతో పవన్ ఇప్పటికైనా నిజాలను గ్రహించు..? నువ్వు మంచివాడివి అని అనిపించి తేనే మాటలు మాట్లడుతూనే.. ఇటు కత్తిని నూరారు. పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే కానీ తాము నెగ్గుకురాలేమని భావించి పక్కా స్కేచ్ తో తాము ఎక్కడా వెలుగులోకి రాకుండా కథంతా వెనకనుంచి నడిపించారు.

ఇక గుంటూరు సభలో ఏకంగా టీడీపీ అవినీతిని ఏకిపారేసిన తరువాత  చిన్న అధిష్టానం.. అతని మిత్రులు కలసి ఒక దుష్టచతుష్టయాన్ని ఏర్పాటు చేసి.. ప్రజాదారణ పోంది.. రాజకీయాల్లోకి వచ్చిరావడంతోనే.. మరీ ముఖ్యంగా టీడీపీకి అధికార బిక్ష పెట్టిన పవన్ కల్యాన్ ను టార్గట్ చేశాయి. అందుకు రెండు పాత్రలను కూడా తీసుకువచ్చి మరీ కాంట్రవర్సీ చేయించి వారిని పావులుగా వాడుకున్నాయి. ఈ విషయాలన్నీ తెలిసిన పవన్ కల్యాన్ చంద్రబాబు కనుసైగలతో నడుస్తున్న ఈ వ్యవహారానికి నారా లోకేష్ బాబు నేతృత్వం వహిస్తున్నారని.. ఆయన తన స్నేహితుడు కిలారు రాజేష్ తో కలసి శ్రీని రాజు, రవిప్రకాష్, రాంగోపాల్ వర్మ, అంధ్రజ్యోతి రాధాకృష్ణల చతుష్టయం దీనిని తెరవెనుకగా నడిపిందని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు పెట్టి.. మరీ వెల్లడించారు. ఇలా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను, తెర వెనుకు దొంగదెబ్బ రాజకీయాలను చేయడంలో మహాదిట్ట అని.. ఆయన ముసుగును మరోమారు తొలగించారు పవన్ కల్యాన్.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  janasena  backstabbing  NTR  Tarak (junior Ntr)  chandrababu  nara lokesh  andhra pradesh  politics  

Other Articles