pawan kalyan is made a scape goat in politics పనవ్ చుట్టూ ‘కౌచ్’ దుమారం.. ‘పాచిక’ వేస్తున్నదెవరూ.?

Pawan kalyan transperency politics make him scape goat

TDP, YSRCP, ap special status, transpperancy politics, corrupted allegations, Jana sena, Pawan Kalyan, TDP MPs, kakinada janasena sabha, TDP yellow media, council of minister, prime minister, PM Modi, Andhra pradesh, special status, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan transperency politics make other political parties to make him scape goat. As a part the casting couch issue is made highlightened to side track special status demand.

పనవ్ చుట్టూ ‘కౌచ్’ దుమారం.. ‘పాచిక’ పారవేస్తున్నదెవరూ.?

Posted: 04/19/2018 05:42 PM IST
Pawan kalyan transperency politics make him scape goat

సినీమా ప్రపంచంల రారాజుగా వెలుగొందుతూ.. కోట్ల రూపాయలను అర్జిస్తున్న కుటుంబం మెగాస్టార్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన అణిముత్యమే పవన్ కల్యాన్. సినిమాలు చాలు అనుకుని.. తమకు రాష్ట్రంలో ఇంతటి గుర్తింపును తీసుకువచ్చిన కొట్లాది అభిమానులకు.. సినిమా రంగంలో వుంటూ సేవ చేయాలంటే అది కొద్దిమేరకే సాధ్యమవుతుందని.. పూర్తిస్థాయిలో నిస్వార్ధంగా సేవ చేయాలంటే ఇక రాజకీయాల్లోకి వెళ్లక తప్పదని రాజకీయ అరంగ్రేటం చేశారు.

ప్రజారాజ్యం మిగిల్చిన అనుభవాలతో పాఠాలు నేర్చుకున్న పవన్.. మరీ ముఖ్యంగా పేదల కోసం, యువత కోసం, అడపడచుల కోసం, నిత్యం సమస్యల కోరల్లో చిక్కుకున్నా తమను ఓట్ల అడిగే నాధులే తప్ప.. తమ గోడు పట్టించుకున్న నాధుడు లేడని అంగలార్చే అణగారిన వర్గాల కోసం మాత్రమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, తనకంటూ ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతంలాంటివి ఏవీ లేవని తన రాజకీయ అరేంగ్రేట సభలోనే గొంతెత్తి చాటిచెప్పారు పవన్.

అయినా ఆయన చుట్టూ తన కులంవారే ఎక్కువగా తిరుగుతున్నారని పచ్చ కళ్ల మీడియా రాయనే రాసేసింది. పవన్ ను ఒక కులనాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పవన్ ఒక ప్రాంతానికి వెళ్లగానే ఆ ప్రాంతానికే ఎందుకు పరిమితం అవుతున్నాడన్న తప్పుడు వార్తలు కామెర్ల కళ్ల పత్రికలు అచ్చేశాయి. అయితే ఇదంతా దాదాపు గత సార్వత్రిక ఎన్నికలలో తాను మద్దుతు ఇచ్చిన రెండు పార్టీలు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ప్రజల గొంతునై ప్రశ్నిస్తానని చెప్పిన జనసేనాని.. ప్రశ్నించడం మొదలు పెట్టగానే పచ్చకళ్ల మీడియా ఇలా వార్లను రాయడం ప్రారంభించింది.

రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాల రావాలంటూ ప్రత్యేక హోదా అవసరం.. ఈ విషయంలో అధికార టీడీపీ ఎంపీలు.. పార్లమెంటులో ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించిన తరుణంలో స్వాకార్యాలు, కాంట్రాక్టులు, వ్యాపారాలే కాదు.. రాష్ట్ర యువతను కూడా పట్టించుకోండి అని గళం విప్పగానే.. అప్పటి వరకు కులం, వర్గం, వర్ణం, ప్రాంతం, మతం ఏమీ లేని పవన్ కు అవన్నీ అపాదించిపెట్టే ప్రయత్నం చేసింది అధికార దయాధర్మం, అధికార నేతల భిక్షంపై అధారపడి బతుకుతున్న మీడియా.

ఇక ప్రత్యేకహోదా విషయంలో ఆయన ప్రశ్నలకు ఎంపీలు కూడా మీ అన్న చిరంజీవి గారు వ్యాపారాలు చేయడం లేదా..? అంటూ ప్రశ్నించారు. ఇక మరికోందరైతే పవన్ కల్యాన్ ఎవరు..? అంటూ ప్రశ్నించారు. అయినా సరే ప్రత్యేక హోదా కోసం గళం విప్పి.. రాష్ట్ర వ్యాప్తంగా పలు సభలు పెట్టి హోదా కోసం పోరాడుదాం.. అంటే.. ప్రజల నుంచి స్పందన వచ్చింది తప్ప.. తాను మద్దతిచ్చిన అధికార పీఠంపై కూర్చోబెట్టిన పార్టీల నుంచి కానీ.. లేక తమ ఓటిమికి కారణమైన ప్రత్యర్థి పార్టీల నుంచి కానీ ఆయనకు స్పందన కరువైంది. అయినా నిలదీశాడు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అర్థరాత్రి హైడ్రామా మధ్య ప్రత్యేక ప్యాకేజీ లభించింది. దానిని చట్టబద్దత లేదని నినదిస్తే.. అవి తాము చూసుకుంటామన్నారు అధికార పక్ష పెద్దలు. ఇక వారు కూడా ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగింది ప్రత్యేక హోద ఇవ్వాల్సిందే.. అంటూ మొసలికన్నీరు కారుస్తున్నారు.

ఇక అసలు జరుగుతున్నదేమిటీ అని తెలుసుకునేందుకు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ హోం శాఖ కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు, మేధావులతో ఒక నిజనిర్థారణ కమిటి వేసి.. నిజాలు తెలుసుకున్న పవన్.. అసలు రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుందో.. తెలుసుకుని విస్మయానికి గురయ్యారు. ఇక వుండబట్టలేక మార్చి 14న గుంటూరులోని మంగళగిరి సభలో ఆయన వట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజక్టు, అధికార పార్టీ నేతల అవినీతిపై.. అంతకన్నా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడి తనయుడి అవినీతి గురించి సభలో జస్ట్ కాస్తంత మాట్లాడాడంతే.. రగిలిన నేతల గుండెలు.. అయనను చిత్రసీమలోని అంశానికి పరిమితం చేయాలని కుట్రలు పన్నాయి.. అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తూ పోతున్నాయి.

తమ తప్పుడు రాజకీయాలు, తప్పుడు నిర్ణయాలు, అవినీతి ప్రాజెక్టులు, పారదర్శకత లేని నియంత పోకడలు.. ప్రజలకు ఏం జరుగుతుందో.. కేంద్రం ఏం చేస్తుంది. ఏం ఇస్తుంది. తామేం చేస్తున్నాం. తామేం ఇస్తున్నాం అని ధైర్యంగా చెప్పలేని పార్టీలు.. పవన్ ప్రశ్నించే గళాన్ని అపితే తప్ప.. తమకు మనుగడ లేదని అర్థం చేసుకుని.. తమ బాటన.. తమతో తెరవెనుక సామరస్యతతో కలసి నడిచే పార్టీలను కలుపుకుని తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్లు అందరూ కలసి పవన్ కల్యాన్ చుట్టూ కావాలని కుట్రలు, కుతంత్రాలు పన్ని ఆయనను రాజకీయా నుంచి దృష్టి మళ్లించేందుకు.. చిత్రసీమకు సంబంధించిన చట్రంలోనే తలమునకలయ్యేటు ప్రయత్నాలు చేస్తున్నాయి.

తెలుగుచిత్రసీమలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో వస్తున్నదే.. అయితే ఇది కేవలం కంపెనీ అర్టిస్టులకు సంబంధించినది. కంపెనీ అర్టిస్టులను కోఅర్డినేటర్ వ్యవస్థతో మాత్రమే సంబంధం వుంటుందని ఇటీవల ఈ అంశం చర్చనీయాంశంగా మారిగానే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు స్పందించడం ద్వారా తెలియవచ్చింది. అయితే కంపెనీ అర్టిస్టులు కూడా తమ అవకాశాలు పోతాయని భయంలో వుంటూ.. కోఅర్డినేటర్లు చెప్పినట్లుగా సై అంటుంటారు. అయితే ఎక్కడో చిన్నగా పరిమితమైన ఈ సమస్య.. మార్చి 14న పవన్ గుంటూరు సభ తరువాతే ఎందుకు పెద్దది అయ్యింది. ఎలా పెద్దది అయ్యింది అంటే.. దీని వెనుకు పెద్ద కుయుక్తులు పన్నే శకునులు వున్నారని తెలుస్తుంది. తెరముందుకు వచ్చిన వారు ఒకరిద్దరు.. తెరవెనుక అడించేవారు మరో ఒకరిద్దరు.. ఇక వారిని నడిపించేవారు మరో ఇద్దరు అన్నట్లుగా పూర్తిగా కిందస్థాయి నుంచి పైస్ఘాయి వరకు అదేశానుసారం సాగుతన్న డ్రామా ఇది.

* తెరపైకి కాస్టింగ్ కౌచ్ అంశాన్ని శ్రీరెడ్డి తీసుకురావడం.. అమెకు పచ్చ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై నుంచి పచ్చ మీడియా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమే అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నినదించే పవన్ కల్యాన్, వామపక్షాల పార్టీలను వెనక్కులాగే ప్రయత్నం చేస్తున్నాయి.
* కాస్టింగ్ కౌచ్ అంశం కన్నా ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టం హామీలు పెద్దగా కనిపించడం లేదా.?
* పచ్చ మీడియా కానీ, అసలు ఏ మీడియా కానీ టీడీపీ ఎంపీలు నాలుగేళ్లుగా ఏం చేశారని అడిగారా.?
* అజెండా లేని నేతలు కేవలం వ్యాపారాలకు పదవులు అవసరం గా రాజకీయాల్లో కొనసాగుతున్నరన్న పవన్ విమర్శలపై ఎంపీలను నిలదీశాయా.?
* రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతుంది.. నేతలు పందికొక్కులా కోట్లకు కోట్లు తినేస్తున్నారని బహిరంగ సభలో చెప్పినా.. మీడియాకు పట్టదా.?
* నారా లోకేష్ తండ్రికి తెలిసి చేస్తున్నాడా..? తెలియకుండా చేస్తున్నాడో కానీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాడని పవన్ అరోపణలపై మీడియా ఏం తేల్చింది.?
* వామపక్ష నేతలతో కలసి చేసిన ఒక్క పాదయాత్రను కూడా పవన్ చేసిన సమయంలో మీడియా చూపలేకపోయిందెందుకు.?
* అవినీతిపై పవన్ చేసిన వ్యాఖ్యలు నిజమా.? కాదా.? అంటూ గతంలో చేసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏమైంది.?
* నేతల కన్నా ముందు ఇదిగో ఈ ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగింది.? ఇక్కడింత అని చెప్పాల్సిన బాధ్యత పత్రికలు, మీడియాకు లేదా.?
* స్వయంగా కాగ్ ఇచ్చిన నివేదికలో వట్టిసీమ ప్రాజెక్టులో కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందన్న అంశాన్ని పక్కదారి పట్టించడమేనా మీడియా పని.?
* వట్టిసీమ అవినీతిలో వాస్తమెంత.? అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియాకు లేదా.?
* అధికార పార్టీలకు అయ్యా బాంచన్ అంటూ వారి అదేశాల మేరకు వార్తలు వేయడమేనా జర్నలిజం..?
* సమాజానికి నీతలు వల్లవేస్తూ.. తాము మాత్రం మరోమార్గంలో వెళ్లడమేనా మీడియా నైతికత.?
* ఎల్లో జర్నలిజం అనే పదం కూడా సిగ్గుపడే స్థాయిలో నేటి మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి.?
* ప్రజలకు కాకుండా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నా ఇంకా తెలుసుకోలేకపోతున్నారా.?

కాస్టింగ్ కౌచ్ అంశంలో తేర ముందుకు వచ్చిన శ్రీరెడ్డి.. వెనుకనుండి నడిపిస్తున్నది ఎవరన్నది ప్రజలకు తెలుసు. కత్తి కన్నా కలం గోప్పదన్న సత్యాన్ని గ్రహించలేని విశ్లేషకుడు, విమర్శకుడన్ని కూడా జనసేనాని పైకి ఉసిగొల్పుతున్నదెవరో కూడా మీడియా కనుగోనాల్సిన బాద్యత వుందా..? లేదా.?. గతం నేతలు కానీ మిగిలింది మూతులు మాత్రమే వాసన చూస్తురా..? అన్నట్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో హిట్లు ఇచ్చి.. ట్రాక్ తప్పిన ఫ్లాప్ సినిమా డైరెక్టరుగా మిగిలిన ఓ మేధావి వీరి వెనుకున్నాడన్న వార్తల్లో నిజమెంత.? ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారి మిత్రపక్షం కూడా సాయం చేయలేని దుస్థితిలో దుమ్మెత్తిపోసే ఓ పార్టీ నేతలతో పాటు.. అక్రమాల కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మరో పార్టీ నేతలు అందరూ కలసి అడుతున్న డ్రామాగా.. పవన్ అభిమానులు అరోపిస్తున్న దాంట్లో నిజమెంత.? ఈ విషయాలపై క్లారిటీ కూడా మీడియానే ఇవ్వాల్సింవుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles