janasena activists questions chandrababu on his suspect remarks.? వైసీపీతో దోస్తి.. జనసేనతో కుస్తీ.?

Janasena activists questions chandrababu on his suspect remarks

Pawan Kalyan andhra pradesh special status, tdp supports ycp in parliament, ycp gets tdp support in no confidence motion, tdp moves far with janasena, pawan kalyan tdp, pawan kalyan ycp, chandrababu, nara lokesh, TDP. corruption, sand mafia, AP special status, indefinite hunger strike, visakha railway zone, jana sena foundation day, jana sena foundation day mangalagiri, jana sena foundation day, Political Yatra, pawan kalyan nri meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

After Andhra pradesh chief minister chandrababu responds on actor turned politician Jana Sena chief pawan kalyan speech on corruption, janasena activists targets TDP chief, why don't he welcome pawan kalyan if his suspecting remarks are true.

అనుమానం నిజమే ఐతే స్వాగతించక.. విమర్శలా.?

Posted: 03/15/2018 03:47 PM IST
Janasena activists questions chandrababu on his suspect remarks

జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ తీసుకున్న రాజకీయ కీలక మలుపు నేపథ్యంలో తన వాడి వేడితో టీడీపీపై అస్త్రాలుగా చేసి ప్రశ్నలను సంధించిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు కూడా విస్మయానికి గురయ్యారు. ఇన్నాళ్లు తమను వెనకేసుకు వచ్చిన పవన్ కల్యాన్ ఒక్కసారిగా ఇలా తమనే టార్గెట్ చేయడంతో దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దీంతో హుటాహుటిన స్పందించిన చంద్రబాబు.. నన్న లోకేష్ ను ప్రశ్నించడానికే పవన్ కల్యాన్ సభ పెట్టాడా..? అని కూడా ప్రశ్నించారంటే అయనలో ఎంత అసహనం వెళ్లడయ్యిందో ఇట్టే అర్థమవుతుందని జనసైనికులు పేర్కోంటున్నారు.

ఇప్పటికే టీడీపీ అవినీతిని, మరీ ముఖ్యంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేల కబ్జాలు, అక్రమాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ అవినీతిపై కూడా పవన్ కల్యాన్ గుంటూరులోని మంగళగిరిలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవసభలో ఏకిపారేశారు. అవినీతి మీకు తెలియకుండా జరుగుతుందా..? లేక తెలిసే జరుగుతుందా.? ఈ రెండింటిలో ఏదీ కూడా రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని మరీ పవన్ కల్యాన్ నొక్కి వక్కాణించారు. ఈ క్రమంలో ప్రజా క్షేత్రంలో తమపై ఇలాంటి ఎన్నో కుట్రలు జరిగాయని చెప్పుకుంటూవచ్చిన పవన్ టీడీపీపై చేసిన విమర్శలు, అరోపణల వెనక బీజేపి ప్రమేయముందని కూడా అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే చంద్రబాబు రాజకీయ చతురత, చాణక్య రాజనీతి కనబడుతుందని విమర్శిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్ సభలో వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి.. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణ నోటీసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రప్రభుత్వం మాట ఇచ్చిందని, తీరా నాలుగేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని విస్మరించిందని.. ఈ నేపథ్యంలో తాము కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెడుతున్నామని పేర్కొంటూ లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసలను అందజేశారు. వాస్తవానికి ఈ నెల 21న అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని భావించినా.. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాసింత ముందుగానే అవిశ్వాసం పెట్టనున్నారు.

అయితే వైసీపీ నేతలు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మాణానికి అనూహ్యంగా టీడీపీ కూడా మద్దతు పలుకుతుంది. అవిశ్వాస తీర్మాణానికి తాము అనుకూలమని, వైసీపీకి కూడా మద్దతు ఇస్తామని టీడీపీ ప్రకటించడంలో అంతర్యమున్నదిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రితం రోజున పవన్ కల్యాన్ మంగళగిరి సభలో చేసిన అరోపణలు, విమర్శల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో నెగ్గుకురావాలంటే.. పవన్ వ్యాఖ్యలను ప్రజల మది నుంచి చెరిపేయాలంటే ఏం చేయాలన్న అంశమై సమాలోచనలు ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించని అంశమై కేంద్రంపై ఎవరు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినా వారికి మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయించడం  కొసమెరుపు.

అయితే ప్రత్యేక హోదాపై టీడీపీ లేదా వైసీపీ మాత్రమే అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెడతారన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చతురతను కనబర్చారన్న విమర్శలు వస్తున్నాయి. 2014 ఎన్నికలలో తమ పార్టీ గెలిపించాలన్నా లక్ష్యంతో తన భుజస్కంధాలపై ఆ బాధ్యతలను వేసుకుని అటు అంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన పవన్ కల్యాన్.. తన మనస్సులో ఏదీ దాచుకోకుండా నిక్కచ్చిగా ప్రజల్లోకి వెళ్లే తత్వం చంద్రబాబుకు గిట్టడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ నిన్నటి ప్రసంగం నేపథ్యంలో ఇదంతా బీజేపి వెనకవుండి అడిస్తున్న డ్రామాగా అభివర్ణించి అనుమానాలను వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను కోసమే వైసీపికి మద్దుతు ఇస్తున్న విషయం వాస్తవమైతే.. అదే మద్దతు పవన్ కల్యాన్ కు అందించవచ్చు కదా..? అని రాజకీయ విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాన్ చేత అమరణ నిరాహార దీక్ష చేయించి.. తెరవెనుక నుంచి బీజేపి మద్దతు పలికి.. ఆ తరువాత ప్రత్యేక హోదాను కల్పించేందుకు, విశాఖ రైల్వే జోన్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసేలా వుందని.. 40 ఏళ్ల రాజకీయ వేత్తగా, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంచనా వేసి అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. పవన్ కల్యాన్ లాంటి ముక్కుసూటి వ్యక్తితో రాష్ట్ర ప్రయోజనాలు సమకూరుతున్నాయని ఆయనను స్వాగతించేందుకు బదులు.. ప్లేటు ఫిరాయించడాని విమర్శలు చేయడమేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

* వైసీపీ అధినేత జగన్ 11 కేసులో నిందితుడిగా వున్న వ్యక్తని..అయనను అనుకరించాలా.? అంటూ చంద్రబాబు ప్రశ్నించలేదా.?
* ప్రతీ శుక్రవారం కోర్టు హాలులో ప్రత్యక్షమైనే నేతను తాను ఫాలో కావాలా..? అయనతో పాఠాలు చెప్పించుకోవాలా..? అని నిలదీయలేదా.?
* జగన్ ను ఆయన పార్టీ నేతలను.. కేంద్రం అండ చూసుకుని మీరు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదా.?
* వైసీపీ పార్టీని ఇన్నాళ్లు.. అసలు మీరు రాజకీయ పార్టీగా గుర్తించారా..? జగన్ అవినీతి అక్రమాలపై ప్రశ్నలు గుప్పించిన విషయం నిజం కాదా.?
* జగన్ ఇటు రాష్ట్రంలో, అటు హస్తినలో దీక్షలు చేసినప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాలు మీకు కనబడలేదా..?
* పవన్ కల్యాన్ మీ అవినీతిపై ప్రశ్నించిన నేపథ్యంలో వైసీపీతో కూడా జతకట్టేందుకు మీ పార్టీ సిద్దం అయ్యిందా..?
* రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని నిత్యం వ్లలేవేసే మీకు.. పవన్ కల్యాన్ తో ప్రయోజనాలు కలుగుతాయన్న విశ్వాసం లేదా.? ఇలాంటి అనేక అంశాలను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles