CMs interference in VVIP treatment to convict sasikala..? శశికళ రాజబోగాల వెనుకు సీఎం ప్రమేయం.?

Former dgp s alleges cms interference in vvip treatment to convict sasikala

Siddaramaiah, chief minister, karnataka, aidmk former secretary, parappana agrahara jail, Bengaluru Central Prisons, Sasikala, special treatment, former DGP, HNR Rao, crime

Karnataka chief minister Siddaramaiah rubbished former Prisons Department DGP HNR Rao’s charge that the CM had instructed the prisons department officials to provide "VVIP treatment" to AIADMK leader Sasikala, currently lodged in Bengaluru Central Prisons.

శశికళ రాజబోగాల వెనుక సీఎం ప్రమేయం.?

Posted: 03/08/2018 02:41 PM IST
Former dgp s alleges cms interference in vvip treatment to convict sasikala

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అమె మరణానంతరం వెలువడిన తీర్పులో దోషిగా నిర్ధారించబడి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ కార్యదర్శ శశికళకు రాజబోగాల కల్పనలో ఏకంగా ఓ ముఖ్యమంత్రి ప్రమేయమే వుందా.? అంటే అవునన్న అరోపణలు వినబడుతున్నాయి. అమెంటే అంత ప్రమే వున్న ముఖ్యమంత్రి ఎవరా అంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. శశికళకు జైలులో రాజభోగాలను అందిస్తున్నారన్న అంశం ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు కర్ణాటకలోనూ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

బెంగళూరులోని పరప్పనా అగ్రహార జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని కర్ణాటక జైళ్ల శాఖ మాజీ డీజీపీ హెఛ్ఎన్ఆర్ రావు వ్యాఖ్యాలు ఇప్పుడు తీవ్ర దూమారాన్ని రేపాయి. శశికళకు రాజభోగాలను అందించాలని సీఎం అదేశించారని.. ఆయన తాజాగా చేసిన అరోపణలు రాజకీయవర్గాల్లో దూమారాన్నే సృష్టిస్తున్నాయి. అయితే హెచ ఎన్ ఆర్ రావు ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తమిళనాడుకు చెందిన ఓ బృందం తన వద్దకు వచ్చిన శశికళకు జైలులో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తన దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో తాను అమెకు జైలు నియమనిబంధనలకు లోబడి అమెకు సౌకర్యాలను కల్పించాలని మాత్రమే జైళ్ల శాఖ అధికారులను అదేశించానని చెప్పారు. అయితే అదేశాలకు వక్రబాష్యం చెబుతూ.. శశికళకు సకల సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించానని తప్పుడు అరోపణలు చేయడం సముచితం కాదని అన్నారు. జైళ్ల శాఖపై వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించడంతోనే మాజీ డీజీపీ హెచ్ ఎన్ ఆర్ రావు తనపై ఈ ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు.

ఇక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం డీజీపిపై మరో విధమైన అరోపణలు సంధిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికల వాతావరణం అప్పుడే అలుముకుందని, ఈ క్రమంలో పదవి నుంచి రిటైర్ అయిన మాజీ డీజీపీ రావు..  బీజేపి నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ అశిస్తున్నారని అందుచేతనే ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని అరోపిస్తున్నారు. టిక్కెట్ తప్పకుండా దక్కేందుకు బీజేపి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగానే.. మాజీ డీజీపీ ఇలాంటి చౌకబారు అరోపణలకు పాల్పడుతున్నారని అరోపిస్తున్నారు. అయితే నిజానిజాలను వెలిసితీయాల్సిన తరుణంలో.. ఏకంగా పరిపాలనకు సంబంధించిన అంశంలోనూ రాజకీయాలు జోక్యం చేసుకుని తమ ఉనికి చాటుకుంటున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  karnataka  aidmk  parappana agrahara jail  Sasikala  special treatment  former DGP  HNR Rao  

Other Articles