Quit Own Party Upendra Likely to Join BJP | పార్టీని మూసేయబోతున్న ఉప్పీ.. అందులో చేరేందుకు ప్లాన్?

Upendra may shut down his party

Actor Upendra, Political Party, KPJP, Internal Rebellion, BJP, Karnataka Prajnavanta Janata Paksha (KPJP), Upendra BJP

Kannada Superstar Upendra to Quit His Own Party Karnataka Prajnavanta Janata Paksha (KPJP) Due To Internal Rebellion May Force. According to sources, Upendra is likely to join the BJP on Tuesday by quitting or dissolving his party. His followers feel that he has already given enough hints and may finally go with Prime Minister Narendra Modi whom he idolizes.

పార్టీని మూసేసే యోచనలో హీరో ఉపేంద్ర

Posted: 03/06/2018 10:04 AM IST
Upendra may shut down his party

రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానంటూ కొత్త పార్టీ పెట్టిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర త్వరలో పార్టీని మూసేయాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం, తనపై తిరుగుబాటుకు కొందరు పావులు కదుపుతుండడంతో పార్టీని రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నారంట. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఉప్పీ గతేడాది ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’(కేపీజేపీ) ని ప్రకటించారు. అయితే, అడపా దడపా ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటికీ.. తర్వాత పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. పైగా ఆయన పార్టీలో ఆయన ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు నేతలు ఆయనపై తిరుగుబాటు ప్రారంభించారు. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ .. ఉపేంద్ర పెద్ద సినీ నటుడైతే కావొచ్చేమో కానీ పార్టీలో మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తామేం చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదని, ఉపేంద్రపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంట. ఈ పరిణామాలతో కలత చెందుతున్న ఉప్పీ.. పార్టీని మూసేయాలన్న నిర్ణయానికే వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేస్తూ... మార్చి 6న తాను అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నట్టు పేర్కొన్నారు.

అయితే పార్టీ మూసేస్తారన్న వ్యాఖ్యలను ఉపేంద్ర ప్రతినిధి ఆనంద్ ఖండించారు. ఆయనంటే గిట్టని వారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో మార్పు రాత్రికి రాత్రే వచ్చేది కాదన్నారు. అసలేం జరగబోతున్నందన్నది ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles