Jagan Strategy on No-Confidence Motion Against NDA | ఎన్డీఏపై అవిశ్వాసం ఫిక్స్.. కానీ, కండిషన్స్ అప్లై

Ysrcp no confidence motion on bjp

YSR Congress Party, YS Jagan Mohan Reddy, NDA Government, BJP, No Confidence Motion, YSRCP BJP, YSRCP NDA Governemnt

YSR Congress Party to Move No-Confidence Motion Against NDA Government. YCP Chief YS Jagan Mohan Reddy follow Strategy in this Issue.

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం, కానీ...

Posted: 03/03/2018 11:36 AM IST
Ysrcp no confidence motion on bjp

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర సర్కారుపై అవిశ్వాసం గురించి ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న ఆయన నేడు పార్టీ ముఖ్యులు, ఎంపీలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

అయితే, భవిష్యత్తులో అవసరమైతే బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు గతంలో పలుమార్లు సంకేతాలు అందించింది. ఈ పరిస్థితిలో బీజేపీని నొప్పించకుండా.. తమకు ఏ రకంగానూ ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాలని జగన్ భావిస్తున్నాడు. వైసీపీకి ప్రస్తుతం ఐదుగురు ఎంపీలే ఉండడంతో అవిశ్వాసానికి అవసరమైన 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టి ఈ నెల 21న అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని వైసీపీ భావిస్తోంది. 50 మంది ఎంపీల మద్దతు ఉంటేనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరిస్తారు. సభ పని దినాల్లో అది ఎప్పుడైనా జరగవచ్చు.

వైసీపీ 21న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే సరిగ్గా పదో రోజున అంటే ఏప్రిల్ 6న సభ ముగుస్తుంది. బోలెడన్ని బిల్లులపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో సమయాభావం వల్ల వైసీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవచ్చు. సో, అవిశ్వాస తీర్మానం కంచికే అన్నట్టు అవుతుంది. ఆ రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి బీజేపీతో పోరాడుతున్నామన్న భావనను ప్రజల్లో కల్పించవచ్చు.. మరోవైపు బీజేపీకి ఏ రకంగానూ ఇబ్బంది కలగించకుండా బయటపడిపోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles