TDP MPs protest in Parliament హోదాను మించిన ప్యాకేజీ ఏదీ బాబుగారూ.?

Tdp mps protest in parliament demanding funds allocation to state before elections

chandrababu, ap special status, ap special package, parliament, MPs, Venkaiah naidu, vishaka railway zone, pawan kalyan, janasena, ysrcp, congess, bjp, PM Modi, politics

TDP MPs protest in Parliament demanding funds allocation to state as per the instruction of their party chief chandrababu, after four years of their rule.

హోదాను మించిన ప్యాకేజీ ఏదీ బాబుగారూ.?

Posted: 02/06/2018 04:11 PM IST
Tdp mps protest in parliament demanding funds allocation to state before elections

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార తీరుపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలు చంద్రబాబును నాలుగేళ్ల పాలనా కాలం వదలి.. ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారు..? అసలెందకీ సందర్భాన్ని వారు అందిపుచ్చుకున్నారని అంటే.. ఓ వైపు కేంద్రంతో సక్యతతో వుండి రాష్ట్రానికి కావాల్సిన నిధులను తెచ్చుకోవాలని ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ ఎంపీలను కేంద్రంపై సామరస్యపూర్వక యుద్దానికి పంపడమే ఇందుకు కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రంలో నరేంద్రమోడీ అధ్యక్షతన ఎన్డీయే సర్కారు కొలువుదీరగానే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై డిమాండ్ చేయాల్సిన ఎంపీలు.. ఆ పని చేయలేదు. ఎంపీలు తమ సొంత కార్యకలాపాలను, కాంట్రాక్టులను చూసుకోవడంలోనే తమ సమయాన్ని పూర్తిగా వినియోగిస్తున్నారు.. ప్రత్యేక హోదా కోసం అడిగే తీరిక కూడా వారి లేదు.. అదే తమిళనాడు ఎంపీలను చూడండీ.. వారి ఐక్యతను చూడండీ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాన్ ఒకటికి నాలుగైదు సార్లు చెప్పి.. ఇక వారితో కాదని నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరీ ఉద్యమించేందుకు సన్నధమయినా.. పెదవి దాటని మాటకోకటుందు అంటూ సాంగ్ ను అలపించిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు ఎంపీలను తేల్చుకోండీ అంటూ పంపించాల్సి వచ్చింది..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

విజయవాడ వ్యాపారవేత్తల సన్మానంలో అప్పటి కేంద్రమంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, మరీ గట్టిగా మాట్లాడితే. తనకు ఈ అంశంతో సంబంధం లేదని, తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యానని కూడా గతంలో వ్యాఖ్యలు చేసినా.. చంద్రబాబు అసలు దానిపై స్పందించలేదు. ఇక కేంద్రం నుంచి ఈ అంశం నీతి అయోగ్ కు చేరినా.. వారు కూడా ఏపీకి ప్రత్యేక హదోను ఇచ్చే అంశంలో అనేక కొర్రీలు పెట్టినా మిన్నకుండిపోయారు చంద్రబాబు. మరి సరిగ్గా ఎన్నికలకు సమయంలోనే ఆయనకు రాష్ట్రాభివృద్దికి కేంద్రం నిధులు అవసరమన్న విషయం గుర్తుకురావడం ఏమిటీ.? అధికారంలో నాలుగేళ్లు గడిచిన తరువాత ఇన్నాళ్లు నీరో చక్రవర్తిలా వ్యవహరించి.. ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిందని గండెలు బాదుకోవడమేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక హోదా కన్నా పది రెట్లు మించని ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని ఈ విషయంలో కేంద్రానికి థ్యాంక్స్ చెప్పాలని అర్థరాత్రి హైడ్రామా మధ్య ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో వున్న సమయంలో వెలువరించిన ప్యాకేజీని అకాశానికి ఎత్తని చంద్రబాబు. ఆ ప్యాకేజీ లో అప్పటికప్పుడు ఎన్ని నిధులతో ప్యాకేజీ ప్రకటించిన వివరాలు కూడా తెలియకుండానే పొంగిపోయారు. ప్యాకేజీ నిధులకు సంబంధించిన వివరాలు తమ వైబ్ సైట్లో పెడతామని.. మరుసటి రోజు సాయంత్రానికి అందుకు సంబంధించిన వివరాలను పోందుపర్చినా.. మాట మాట్లాడని చంద్రబాబు.. నిధులపై ఇప్పుడెందుకు పార్లమెంటు సభ్యులను కేంద్రాన్ని నిలదీయాలని, పార్లమెంటులోనే తేల్చుకోవాలని అదేశించారన్నది అంతుచిక్కని ప్రశ్న.

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే వున్నా.. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ ను టీడీపీ నేతలు టార్గెట్ చేయడమేంటో అర్థంకావడం లేదు. ఎన్డీయే ముఖ్యనేతలు పార్లమెంటులో లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ కన్వీనర్ సోనియాగాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యనేతలు పార్లమెంటులోనే వున్న సయంలో టీడీపీ ఎంపీలు.. పార్లమెంటు కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున కార్గే సభలో ఇదే అంశమై ప్రసంగిస్తుండగా అడ్డుకోవడమెందుకు.? ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలని ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్.. పార్లమెంటులో తన గళం విప్పినందుకా.? లేక రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో పాటు అనేక కేంద్ర ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, పోలవరం జాతీయ ప్రాజెక్టు చేయాలని పోందుపర్చినందుకా..? అన్నది అంతుచిక్కని ప్రశ్న.

ఇక నాలుగేళ్ల పాటు కేంద్రంతో గొడవ పడితే రాష్ట్రాభివృద్దికి నిధులు కష్టమని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. అది నుంచి ఇలానే ఎంపీలను కేంద్రంతో సామరస్యక పూర్వకంగా యుద్దానికి సిద్దం చేసివుంటే కేంద్రం రాష్ట్రానికి అశించినదానికంటే అధికంగా. ప్యాకేజీలు కాకుండా ప్రత్యేక హోదాను ఇచ్చేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల సీజన్ చేరవవుతున్న తరుణంలో తాను అవసరమైతే కేంద్రంతోనే పోరాటానికి సిద్దమన్న సంకేతాలను రాష్ట్ర ప్రజల్లోకి పంపేంచి.. మరోమారు అధికారాన్ని చేబట్టేందుకు చంద్రబాబు.. తమ మిత్రపక్షంతో కలసి కొత్త డ్రామాకు తెరతీసారన్న మల్లిఖార్జున్ ఖార్గే చేసిన అరోపణలను కూడా పరిగణలోకి తీసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles