Chandrababu Check to Bonda Uma with Cases | బోండా భూబాగోతం.. చెక్ పెట్టిన చంద్రబాబు!

Chandrababu on bonda giri

Telugu Desam Party, Chandrababu Naidu, Bonda Uma, Land Grab Cases, TDP Quit Bonda Uma

Telugu Desam Party Chief Chandrababu Naidu Political Master stroke to Bonda Uma with Land Grabbing Cases. In Fast Few Months Bonda unhappy with Party.

బొండా భూబాగోతం.. కేసులు... కావాలనేనా?

Posted: 01/31/2018 04:39 PM IST
Chandrababu on bonda giri

ఏపీ రాజకీయాల్లో బోండా వారి భూ కబ్జాల భాగోతం రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. స్వయంగా ముఖ్యమంత్రే బోండా భూకబ్జాల వ్యవహారంపై సమీక్ష నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి లావాదేవీలను బినామీల పేరు మీద నిర్వర్తిస్తుంటారు. కానీ, ఉమ మాత్రం తెలివి తక్కువగా భార్య పేరు మీద రిజిస్ట్రర్ చేయించి అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు ఆదేశాలతోనే...

సాధారణంగా ఆయన మీద భూకబ్జా కేసు చాలా రోజుల కిందే నమోదు అయ్యింది. కానీ, హఠాత్తుగా సీఐడీ బోండా వర్గీయుల మీద కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే సాధారణంగా అధికారులు ఇలాంటి కేసుల్లో ముందుకు వెళ్తుంటారు. బోండా విషయానికొస్తే.. మంత్రి పదవి దక్కకపోవటంతో గత కొంత కాలంగా ఆయన అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపిస్తున్నాడు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ జరిపాడన్న వార్తలు చంద్రబాబు చెవిన పడ్డాయి. కృష్ణా, గుంటూరు బాధ్యతలను గనుక తనకు అప్పగిస్తే.. జనసేనలో చేరతానని పవన్ కు ఉమ వర్తమానం పంపాడన్న వార్త అప్పట్లో టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాలు నచ్చకనే చంద్రబాబు.. బోండా కేసుల్లో ముందుకు వెళ్లాలని సీఐడీకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడని.. ఆపైనే కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది. 

రాధా చేరిక కూడా అందుకేనా?

మరోవైపు వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే వార్త ఆ మధ్య వినిపించింది. టీడీపీకి ఇప్పుడు కాపు నేతల అవసరం ఉంది. అదే సమయంలో వారు చంద్రబాబు, లోకేష్ లకు వ్యతిరేకంగా గళం వినిపించకూడదు. అందుకే బోండా బదులు రాధాను వచ్చే ఎన్నికల్లో బెజవాడ బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారని అంతర్గతంగా పార్టీలో చర్చించుకుంటున్నారు.

మొత్తానికి బోండా కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు భూ కబ్జా భాగోతాన్ని తెలివిగా తెరపైకి తెచ్చాడని చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles