Modi government to scrap vacant government posts మోడీ సర్కార్ తాజా నిర్ణయం.. నిరుద్యోగులకు శాపం..

Modi government plans to abolish posts which are vacant for 5 years

job, job seekers, Narendra Modi, Finance Ministry, Arun Jaitley, vacant posts, posts left vacant, Home Ministry, Ministry of Home Affairs, Union Budget 2018, Budget 2018, budget 2018 date, india budget 2018 date, employment, jobs news

In a big move, Prime Minister Narendra Modi-led Central government is planning to eliminate all posts that have been vacant for a period of more than five years.

మోడీ సర్కార్ తాజా నిర్ణయం.. నిరుద్యోగులకు శాపం..?

Posted: 01/30/2018 07:55 PM IST
Modi government plans to abolish posts which are vacant for 5 years

సుమారుగా రెండు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వ అడుగులు వేస్తుందన్న సంకేతాలు వచ్చిన క్రమంలో మోడీ ప్రభుత్వంపై ఎన్నో అశలు పెట్టుకున్న నిరుద్యోగులకు ఇది నిజంగా చేదువార్తే. తాజాగా కేంద్రంలోని మోడీ  సర్కార్ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలపై సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. గత ఐదేళ్లు, అంత కంటే ఎక్కువ సంవత్సరాలుగా భర్తీ చేయకుండా.. ఖాళీగా ఉన్న పోస్టులను రద్దు చేయాలనే ఆలోచనలో కేంద్రం వుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి అడుగులు కూడా వేస్తోందని తెలుస్తుంది.

ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా భర్తీ కాకుండా ఉన్న పోస్టుల వివరాలన్నింటినీ కేంద్ర హోంశాఖ కోరింది. ఆయా శాఖల నుంచి సమగ్ర నివేదికకు ఆదేశించింది. అన్నిమంత్రిత్వ శాఖలు, విభాగాలను యాక్షన్‌ రిపోర్టును కోరామని ఆర్థిక మంత్రిత్వశాఖ  తెలిపింది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  అన్ని శాఖల అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, పారామిలిటరీ దళాల చీఫ్‌, ఇతర సంబంధిత సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని హోం మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు.

ఐదేళ్లుగా భర్తీ కాని పోస్టులపై త్వరలోనే సమగ్ర నివేదిక అందించాలని గతంలోనే అన్నిమంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారులు, ఉమ్మడి కార్యదర్శులను కోరినట్టు కేంద్రం తెలిపింది. కొన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు స్పందించినప్పటికీ, మరికొన్ని నివేదికలు సమగ్రంగా లేకపోవడంలోనే మళ్లీ ఆదేశాలు జారీ  చేశామన్నారు. జనవరి 16, 2018న సంబంధిత మెమోరాండం  జారీ చేసినట్టు తెలిపింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా వేల సంఖ్యలో పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయన్నారు. మారుతున్న కాలంతోపాటు.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో కొన్ని పోస్టులు అవసరం లేకుండా పోయిందని కేంద్రం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  govt department  Government jobs  Finance Ministry  India  

Other Articles