Will PM modi supari comments make bjp win చివరి ట్రంప్ కార్డును ప్రధాని వాడేశారా..?

Pm modi allegations to cash in on mani shankar aiyar comments

Amit Shah, BJP, congress, Election Commission of India, elections 2017, Electronic voting, gujarat Assembly election 2017, Gujarat Assembly elections 2017, Gujarat assembly first phase polling, Gujarat election first phase polling, Gujarat election first phase voting, Gujarat election news, Gujarat election updates, Gujarat election voting date, Gujarat elections, Gujarat Elections 2017, Gujarat polling, gujarat polls, Gujarat polls 2017, Gujarat voting, Hardik Patel, Jignesh Mewani, Mani Shankar Aiyar, Narendra Modi, pm modi, Rahul Gandhi, saurashtra, Vidhan sabha chunav 2017, Vidhan sabha election, Vijay Rupani, Voting time in Gujarat election, VVPAT, ‪Gujarat‬, ‪State Assembly elections in India‬, ‪Vidhan Sabha‬‬

PM Modi played his best card in gujarat venting his anguish against the series of abusive remarks made by a number of senior Congress leaders, naming over a dozen such leaders.

గుజరాత్ ఎన్నికలలో సానుభూతికి ప్రధాని యత్నం.?

Posted: 12/09/2017 09:23 PM IST
Pm modi allegations to cash in on mani shankar aiyar comments

గుజరాత్‌ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రధాని నరేంద్రమోడీ తన చేతిలో వున్న బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడేశారా..? గత మూడేళ్ల క్రితం జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ అభివృద్దిని చూసి ఓట్ల వేయండంటూ యావత్ దేశ ప్రజలకు చెప్పిన నరేంద్రమోడీ.. గుజరాత్ అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా కేంద్రంలో తాము చేస్తున్న అభివృద్దినో.. లేక రాష్ట్రంలో చేసిన అభివృద్దినో ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాల్సింది పోయి.. తన చేతిలో వున్న ట్రంప్ కార్డును కూడా వాడేసి గెలుపుబాట పట్టించేందుకు యత్నాలు చేస్తున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తతున్నాయి.

ఈ క్రమంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సినీయర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యార్ లాంటి నేతను కూడా వెనువెంటనే సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్య‌లు చేసే సంస్కృతి తమకు లేద‌ని కూడా ఈ సంద‌ర్భంగా చెప్పుకుంది. ఈ విష‌యంపై రాహుల్ గాంధీ మ‌రోసారి స్పందించారు. ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తిని త‌మ‌పార్టీ గౌరవిస్తుందని అన్నారు. ఆ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి గురించి త‌మ‌ పార్టీ తప్పుగా మాట్లాడ‌ద‌ని చెప్పారు. అందుకే తాము మణిశంకర్‌ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు.

అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని భావించిన ప్రధాని రామజన్మ భూమిలో రామమందిర నిర్మాణం కోసం యావత్ దేశ ప్రజానికం ఎదురుచూస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకు ఈ విషయమై తీర్పును నిలిపివేయాలని కపిల్ సిబాల్ వాదించడాన్ని అయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఫలితం రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పిటీషన్ దాఖలు చేసిన కేంద్ర మాజీ మంత్రి సిబాల్ ను కూడా తక్షణం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడమే గుజరాత్ తో బీజేపి పరిస్థితి దిగజారిందని స్పష్టమవుతుంది.

అయితే రాణకీయ కోణంలో అలోచించే నేతలు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తమ రాజకీయ లబ్దికోసం కుల, మతాలకు చెందిన అంశాలను తెరపైకి తీసుకురావడం సర్వసాధారణమే అయినా.. స్వయంగా ప్రధాని.. కపిల్ సిబాల్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడమేంటన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధాని గుజరాత్ రాష్ట్రంలోని హిందువుల ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని పరోక్షంగా మతతత్వాన్ని తెరపైకి తీసుకువస్తున్నారా... అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. నిత్యం అవినీతి రహిత సమాజం, స్వచ్ఛా భారత్, అభివృద్ది అంశాలపై ప్రసంగాలు చేసే ప్రధాని వాణిలో బాణి ఎలా మారిందని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పై ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మరో అభాండాన్ని కూడా వేశారు. మణిశంకర్ తన హత్యకు కూడా కుట్రపన్నారని అరోపించారు. పాకిస్థాన్ లోని వ్యక్తుల చేత తనను అంతమొందించడానికి మణిశంకర్ అయ్యార్ పథక రచణ చేశారని కూడా అరోపించారు. ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రాణానికి హానీ చేకూర్చాలని కుట్ర చేసిన పక్షంలో అది రాజద్రోహమే అవుతుంది. ఇలాంటి కుతంత్రాలు చేయడమన్నది వ్యక్తిగానే జీర్ణించుకోలేని విషయం. కానీ ప్రధాని హోదాలో వున్న వ్యక్తి పట్ల ఇలాంటి వాటికి పాల్పడటం అక్షేపనీయమే.

అయితే కేంద్ర ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న ప్రధాని మోడీ.. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం గుజరాత్ ఎన్నికలకు ముందు ప్రచారాస్త్రాలుగా సంధించడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే వాటికి తగిన స్థాయిలో అధారాలు కూడా వుండివుంటాయి. అవే వున్న పక్షంలో అవతలి వారు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి నెట్టడం ఎంతో సేపు కాదు.. కానీ ప్రధాని అలాంటి చర్యలు ఉపక్రమించకుండా కేవలం ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో మాత్రమే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఈ ఎన్నికలలో ప్రధాని మోడీ తనపై వ్యక్తిగతంగా వున్న సానుబూతిని కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారా..? తన చేతిలో వున్న చివరి ట్రంప్ కార్డును కూడా ఇలా వినియోగిస్తున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, సానుభూతి, బీజేపి పార్టీని విజయతీరాల వైపు నడిపిస్తాయా..? లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  assembly polls  Pm Modi  Rahul Gandhi  Mani Shankar Aiyar  kapil sibal  Politics  

Other Articles