Komatireddy Venkat Reddy Meets Ramoji Rao.. రామోజీని కలసిన మర్మమేమి మాజీమంత్రివర్యా.?

Komatireddy brothers to launch a new political party in telangana

senior Congress leaders, Komatireddy brothers, own political party, Nalgonda, Komatireddy Venkat Reddy, Eenadu chairman Ramoji Rao, political activities, advice, support, Telangana, politics

Speculation rife that senior Telangana Congress leaders Komatireddy brothers might launch their own political party after his meet with Ramoji Rao

ఏమిటీ కొత్తపార్టీ కిరికిరి..? కోమటిరెడ్డి..

Posted: 11/23/2017 12:02 PM IST
Komatireddy brothers to launch a new political party in telangana

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి రానుంది. రానున్న 2019 ఎన్నికలే లక్ష్యంగా ఈ నూతన పార్టీ ఇప్పట్నించే పావులు కదుపుతోందా..? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఈ మేరకు కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును అయన కలిశారా..?, తన పార్టీకి సహకారం అందించాలని కూడా ఆయన కోరారా..? అన్న సందేహాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

కాంగ్రెస్ పిసీసీ పదవిపై కన్నేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అ పదవి అందని ద్రాక్షగా మిగులుతుందని తెలిసిపోయిన తరుణంలో ఇక చేసేది లేక కమలం పార్టీపైవు అశగా చూస్తున్నారని.. అయితే ఆ పార్టీ ఇప్పుడప్పుడే తెలంగాణలో బలం పుంజుకునే అవకాశం లేకపోవడంతో.. తానే కొత్త పార్టీతో తన సత్తా చేటేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఒకవైపు కీలకమైన నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం, మరోవైపు బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో.. కనీసం పదుల సంఖ్యలో స్థానాలను రాబట్టుకున్నా.. ఆ తరువాత బలాన్ని క్రమంగా పెంచుకోవచ్చన్నది కోమటిరెడ్డి సోదరుల వ్యూహమని తెలుస్తుంది.

ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడిన పక్షంలో తన పార్టీ మద్దుతుతోనే ఏ పార్టీయైనా అధికారంలోకి రావాల్సిందేననని, దీంతో మళ్లీ చక్రం తిప్పే అవకాశముంటుందని కూడా కోమటిరెడ్డి సోదరులు భావిస్తున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ లో తనకు అండగా నిలిచిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ గా తప్పించగానే జలక్ తిన్న కోమటిరెడ్డి సోదరులు.. బీజేపి వైపు అశగా చూశారని.. అయితే ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో.. తమ వ్యూహాన్ని మార్చుకున్నారని తెలుస్తుంది.

మూడేళ్ల క్రితం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతన్న క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఏకంగా సీఎం కేసీఆర్ తో కలసి ఆయన కాన్వాయ్ లోనే సెక్రటేరియట్ కు చేరుకున్నారు. దీంతో త్వరలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వలస వెళ్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. దానిపై కొంతకాలానికి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పుకోచ్చారు. అదే అదనుగా చేసుకున్న ఈ సోదరుల వర్గంతో విభేధించే కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు.

దీంతో అధికార పార్టీలోకి వెళ్దామన్న తమ ప్రయత్నాలకు బ్రేకులు వేసుకోక తప్పలేదు. ఇక అటు వెళ్తే గుత్త పోరు.. ఇక్కడే వుంటే ఉత్తముడికి హుకుం మధ్య నలిగిపోవడం ఇష్టం లేక కోమటి రెడ్డి సోదరులు ఇక తమ సోంత పార్టీ ప్రణాళికలకు అనుగూణంగా పావులు కదుపుతూ వస్తున్నారని అందులో భాగంగానే చెన్నై గ్రూపుకు చెందిన ఓ ఛానెల్ ను తీసుకుని తమ చేతిలో పెట్టుకున్నారని సమాచారం. ఇక పత్రికాపరంగా తమకు సహకారం అందించాలని స్వయంగా వెంకట్ రెడ్డి వెళ్లి రామోజీ రావును కలిసి కోరారని సమాచారం.

ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, అటు విజయశాంతి, మరోవైపు జగ్గారెడ్డిలు అందరూ తమస్థాయిలో పావులు కదుపుతున్నా.. ఇటు ప్రజల్లో వుంటూనే అటు అధిష్టానంతో చర్చలు సాగించి.. వ్యూహాలు, ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతివ్యూహాలు, ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో తనకు కాంగ్రెస్ లో తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న విషయం కూడా అర్థం చేసుకున్న కోమటిరెడ్డి సోదరులు.. తమ ఉనికి చాటుకునే పనిలో భాగంగానే కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నారని తెలుస్తుంది.

ఇది బీజేపి ప్రణాళికలో భాగమేనా..?

అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ తమకు జాతీయ పార్టీ మద్దతు లభిస్తే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో చక్రం తప్పోచ్చని భావిస్తున్నారని, కానీ రాష్ట్రంలో బీజేపిలో వున్న సీనియర్ నేతలను కాదని తమకు పగ్గాలను అందించే అవకాశం లేకపోవడాన్ని ముందుగానే గ్రహించారని సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో రెడ్డి కాంగ్రెస్ అన్న పేరుంది. దానిని చెరిపేసి.. రెడ్డీలకు బీజేపి అండగా వుంటుందన్న పేరు తీసుకువచ్చేందుకు కోమటిరెడ్డి సోదరులు కొత్త పార్టీ పెట్టి ఉనికి చాటుకుని బీజేపికి మద్దతు పలుకుతారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని పక్కన బెట్టి కాషాయం పార్టీ జెండాను రెపరెపలాడించాలని తాపత్రయపడుతున్న బీజేపి.. కొమటిరెడ్డితో ఈ తరహా లోపాయికారి ఒప్పందం కూడా జరిగిందన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాను నిర్వహిస్తున్న ఛానెల్ కు.. గతంలో బీజేపి పార్టీకి సేవలందించిన వ్యక్తినే ఏరికోరి మరీ పగ్గాలు కూడా అప్పగించారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అటు ప్రధానితో సన్నిహిత్యం వున్న రామోజీని కూడా ఈ వ్యూహంలో భాగంగానే కోమటిరెడ్డి కలిశారన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు వీరి భేటీలో మర్మమేమిటో తెలియాలంటే కొద్ది సమయం వేచి చూడక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles