Hyderabad Metro launch Suspense in last Minute | అనుమతులే రాలేదు.. మోదీ ఏం చెప్పలేదు... మరి మెట్రో లాంఛ్ ఉంటుందా?

Metro train launch daoubts

Hyderabad Metro Rail Launch, Miyapur to SR Nagar Metro, CMRS Hyderabad Metro, PM Modi Hyderabad Metro Launch

Hyderabad Metro Rail Launch in Dilemma. Miyapur to SR Nagar Route yet to get safety certificate from Commissioner of Metro Rail Safety. And also PMO Not Officially confirmed about PM Modi Launch this project.

మెట్రో రైలు లాంఛ్ పై సస్పెన్స్!

Posted: 11/17/2017 10:47 AM IST
Metro train launch daoubts

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ మెగా ప్రాజెక్టుకు ఇప్పుడు వికలాంగులను పరిగణనలోకి తీసుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేకత కూడా జత కలిసిన విషయం తెలిసిందే. అయితే కీలకమైన మార్గానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అనుమతి లభించకపోవటం.. దీనికితోడు ప్రధాని ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంపై ఇంకా సంగ్ధిగ్ధం నెలకొనటంతో ముందుగా అనుకున్నట్లు 28న మెట్రో ప్రారంభమవుతుందా? అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు.

నాగోల్ నుంచి మెట్టుగూడకు, మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ మధ్య ట్రయల్ రన్స్ సక్సెస్ కావటంతో వాటికి మాత్రమే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతులు లభించాయి. మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి  సీఎంఆర్ఎస్ అనుమతి ఇంకా రాలేదు. ఈ విషయం మోదీకి కూడా తెలుసునని, అందుకే ఆయనింకా కార్యక్రమానికి హాజరయ్యే అంశంపై ఏం తేల్చలేదని తెలుస్తోంది. వాస్తవానికి మెట్రో రైల్ కు సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే, కనీసం ఆరు నెలల పాటు నిత్యమూ ట్రయల్ రన్స్ వేయాలి.

మెట్టుగూడ నుంచి ఎస్ఆర్ నగర్ మధ్య మార్గంలో(మెట్టుగూడ-బేగంపేట్ వరకు మాత్రమే ) గత నెల రోజులుగా ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి. ఈ మధ్యే అమీర్ పేట్ వద్ద ఇంటర్ ఛేంజ్ స్టేషన్ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తవుతున్న నేపథ్యంలో .. ఇంత తక్కువ టైంలో అనుమతి ఇవ్వటం సాధ్యమయ్యే పనికాదన్నది అధికారుల వాదన. అయితే 23వ తేదీ నాటికి ఎలాగైనా అనుమతులు రప్పించి తీరుతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వ్యాఖ్యానించటం విశేషం.

చివరి క్షణం దాకా తప్పదా?

ఈ నెలలో జరిగే హెచ్ఐసీసీలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో మోదీ పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మియాపూర్ మెట్రో రైలును ప్రారంభించకపోతారా? అన్న ధీమాలో తెలంగాణ సర్కారుంది. ఒకవేళ ఆయన రాకుంటే, కనీసం హెచ్ఐసీసీ నుంచి రిమోట్ ద్వారానైనా రైలు సేవలను ప్రారంభించాలన్నది కేసీఆర్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జంట నగరాల మణిహారం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై చివరి క్షణం దాకా సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles