YSRCP Kapu Leader Ready to Join TDP | కాపు నేత జంపింగ్ కు రెడీ.. జగన్ పట్టించుకోడా?

One more defection from ysrcp to tdp

Kilari Rosaiah, YSR Congress Party, Telugu Desam Party, YSRCP Defections, Kilari Rosaiah TDP, Kilari Rosaiah YS Jagan. Kapu Leader Kilari Rosaiah, Tenali Kapu Leader TDP

One More Defection from YSR Congress Party. Guntur Kapu Community Leader kilari rosaiah ready to join Telugu Desam Party.

వైసీసీని వీడనున్న గుంటూరు కాపు నేత?

Posted: 11/07/2017 09:01 AM IST
One more defection from ysrcp to tdp

అధికారం దక్కించుకోవటం కోసం వైఎస్ జగన్ పాదయాత్ర పాట్లు పడుతుంటే.. మరోవైపు ఆయనకు షాకుల మీద షాకులు తగిలే అవకాశం ఉంటున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలి అడుగులు పడకముందే రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి పార్టీని వీడి వెళ్లిపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అరడజను మంది సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటున్న నేపథ్యంలో మరో కీలక నేత పార్టీని వీడతారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కీలక కాపు నేత,  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కిలారి రోశయ్య పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, అనుచరులతో కలిసి ఓ హోటల్‌లో సమావేశమైన ఆయన పార్టీని వీడే విషయమై వారి సలహాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రాధాన్యం లేని నేతలను ప్రోత్సహిస్తూ.. తనను దారుణంగా తొక్కేస్తున్నారని సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించారంట. తీవ్ర మనస్తాపంలో ఉన్నందునే పార్టీ మారాలనుకుంటున్నానని స్పష్టం చేసినట్టు సమాచారం.

నేడు, రేపో ఆయన పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాదయాత్ర ముగిసే లోపు మరిన్ని జంప్ జిలానీలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీ కేడర్ నుంచి కీలక నేతలు చేజారకుండా జగన్ దృష్టి సారిస్తే మంచిదని సీనియర్లు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles