Had revanth reddy resigned for his mla seat రేవంత్ అన్నంత పని చేయలేదా..? ఎందుకలా.?

Revanth really tendered his resignation to his kodangal mla seat

former TDP working president, TDLP leader, Congress, Revanth, resignation, kodangal mla seat, telangana assembly, TS speaker, madhusudhana chary, chandrababu, postman, party chief, Telengana, politics

Revanth Reddy, former TDP working president and TDLP leader who joined Congress party in the presence of AICC Vice President Rahul Gandhi a day ago had tendered his resignation to his kodangal mla seat really..?

రేవంత్ రెడ్డి అన్నంత పని చేశాడా..? లేదా..?

Posted: 11/01/2017 02:56 PM IST
Revanth really tendered his resignation to his kodangal mla seat

కాంగ్రెస్ పార్టలో చేరిన రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేశారా..? లేదా..? చేశానని ఆయన స్వయంగా టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు పీఏకు సమర్పించిన లేఖలో స్పష్టం చేసినా.. ఇంకా ఈ విషయంలో మాత్రం సస్పెన్స్ కోనసాగుతుంది. అసలు ఆయన స్పీకర్ మదుసూధనా చారీకి తన రాజీనామా లేఖను పంపారా..? లేదా..? అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదే క్రమంలో ఆయన చంద్రబాబుతో మైండ్ గేమ్ అడుతున్నారా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లేడే రేవంత్ రెడ్డి.. ముందొరకంగా, వెనకోరకంగా చేసే నేత మాత్రం కాదన్న విషయం తెలిసిందే. అయితే తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని ఆయన ప్రకటించినా.. ఆయన రిజైన్ లేటర్ ను ఇప్పటివరకు స్పీకర్ కు ఎందుకు పంపలేదన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబు ఫీఏకే పార్టీ సహా పదవికి సంబంధించిన రాజీనామా లేఖలు వున్నాయా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి చేసిన రాజీనామాపై చర్చ జరుగుతోంది. టీడీపీ పదవులతో పాటు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆయన తన శాసనసభ సభ్యత్వం రాజీనామా లేఖను కూడా చంద్రబాబుకే సమర్పించినట్లు సమాచారం. కాగా, ఈ రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు పంపాలని.. చంద్రబాబుకు చెప్పినట్లు రేవంత్ తన సన్నిహితులకు చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీకి గానీ, స్పీకర్ కార్యాలయానికి కానీ రేవంత్ రాజీనామా చేరకపోవడంతో రేవంత్ రాజీనామా విషయంలో క్లారిటీగా వున్నారా..? అన్న అనుమానాలకు తావిస్తుంది..

గతంలో కొందరు ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ లో చేరినపుడు.. పదవులకు రాజీనామా చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రాజీనామాపై మాత్రం టీడీపీ లీడర్లు స్పందించటం లేదు. పైగా రాజీనామా లేఖను చంద్రబాబు.. స్పీకర్ కు పంపుతారా అన్న ప్రశ్నకు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన రాజీనామాను స్పీకర్ కు పంపడానికి.. చంద్రబాబు పోస్ట్ మెన్ లా కనిపిస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను కోరుకోవటం లేదా అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు మాత్రం చంద్రబాబును ఏ నిర్ణయం తీసుకున్నా.. దాంతోనే అతనికి చెక్ పెట్టేలా రేవంత్ అడుగులు వేస్తారా... అన్నది అర్థం కాని ప్రశ్న. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చకున్నప్పుడు వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని చంద్రబాబు.. ఇప్పుడెలాంటి చర్యలకు ఉపక్రమిస్తారన్నది తెలుసుకునేందుకు కూడా రేవంత్ ఇలా చేశారన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో కూడా రేవంత్ చేత ప్రచారం చేయించే అవకాశాలను కాంగ్రెస్ పరిశీలిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Revanth  resignation  kodangal  mla seat  telangana assembly  TS speaker  Telengana  politics  

Other Articles