Revanth Reddy Denies Entry into Congress Rumours | రేవంత్ ఢిల్లీ టూర్.. కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ కోసం

Revanth reddy on congress joining

Revanth Reddy, Congress Speculations, Revanth Reddy Congress Working President, Revanth Reddy Delhi Tour, Revanth Reddy Denies Rumours, Revanth Reddy TRS Ministers Coolie, Revanth Reddy Complaint Election Commission

Delhi visit triggers speculation of Revanth Reddy’s entry into Congress. Later Revanth Denies Reports that he came for Complaint on TRS Ministers Coolie to Election Commission.

రేవంత్ హస్తిన టూర్.. కాంగ్రెస్ గూటికి కాదంట!

Posted: 10/17/2017 05:08 PM IST
Revanth reddy on congress joining

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కాంగ్రెస్ నేతలతో రహస్య చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నారా? అంటూ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. జైపాల్ రెడ్డి దౌత్యంతో త్వరలో రాహుల్ తో భేటీ అయి ఓ ప్రకటన చేయబోతున్నారని చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హామీతో రేవత్ చేరికకు మార్గం సుగమం అయ్యిందని అంటున్నారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ వర్గం నేతలకు అవకాశం లభించనుంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందనే భావనతోనే కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు చెబుతున్నారు. తాను ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్టీ సీనియర్లు కొందరు అధినేత చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే అంతా అనుకున్నారు.

అయితే ఈ విషయమై ఇండియన్ ఎక్స్ ప్రెస్ రేవంత్ సన్నిహితులను సంప్రదించగా... ఓ కోర్టు కేసు పని మీద ఆయన ఢిల్లీకి వచ్చినట్లు చెప్పటం విశేషం. మరోవైపు రేవంత్ మాత్రం పార్టీ మారే వార్తలను ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన కూలీపనులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కానీ, మీడియాలో వచ్చిన వార్తలకు అంత జెట్ స్పీడ్ గా స్పందించాల్సిన అవసరం ఏముందనేది మరి కొందరి ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles