IYR questiions CM, why allegations errupt before transfer సీఎం ఉద్యోగుల బదిలీల వ్యూహాలపై ఐవైఆర్ అక్షేపణ..

Iyr questiions cm why allegations errupt before transfer

chandrababu, iyr krishna rao, officials, bureaucracy, andhra pradesh, CM stratagey, iyr krishna rao allegations, iyr krishna rao twitter, iyr krishna rao on CM, iyr krishna rao on chandrababu, iyr krishna rao employees, iyr chandrababu officials, bureaucracy, andhra pradesh, CM stratagey

Andhra pradesh former chief secretary IYR krishna rao questiions CM chandra babu, why allegations errupt before transfer of employees, alleges this is babus typical strategy

ఉద్యోగ బది‘లీలల’పై మాజీ ప్రధాన కార్యదర్శి వ్యంగ్యాస్త్రం

Posted: 10/16/2017 12:21 PM IST
Iyr questiions cm why allegations errupt before transfer

సమకాలిన రాజకీయాలలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహప్రతివ్యూహాలలో అసాధరణంగా ముందుకు వెళ్తారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చాణక్య రాజనీతిని అవపోషణ పట్టినట్టుగా ఆయన రాజకీయ అడుగులు వుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావును పదవీచ్యుతుడిని చేసినా.. ఆ తరువాత ఆయన దగ్గుబాటి, హరికృష్ణలను పార్టీకి దూరం చేసినా.. వాటిని పట్టించుకోకుండా.. ప్రజల్లోకి వెళ్లారు.

మద్యపాన నిషేధం అమల్లో వుండగా, అక్టోబర్ రెండున ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభకు, పార్టీ నేతలు, అర్టీసీ సిబ్బంది తప్ప.. ఎవరూ కనిపించకపోయినా.. అ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శ్రమదానం, బడిబాట లాంటి కార్యక్రమాలతో గ్రామగ్రామాలకు వెళ్లారు. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ విజయాన్ని అందుకున్నారు. అదీ అయన రాజకీయ చతురత. గచ్చిబౌలి స్టేడియం ప్రారంభోత్సవ వేడుకలను అంగరంగ వైభవం చేసి వాటని ప్రజలకు చూపి.. అదే ఊపులో తన పార్టీకి ఓట్లు వేయించుకున్నారు. అంతకన్నా ముఖ్యమైన రైతుల అత్మహత్య అంశాన్ని కూడా సైడ్ ట్రాక్ చేశారు.

ఇలా ఒక్కటిని కాదు, చంద్రబాబు గురించి తన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంతో పాటు ఆయన చాణక్యనీతిని అనేకం బయటపెడతాయి. ఇక మరోఅడుగు ముందుకేసీ హెరిటేజ్ సంస్థ గురించి పదే పదే మాట్లాడుతూ.. తన ఆస్తులన్నీ అక్కడి నుంచి వృద్ది చెందుతున్నాయని ప్రకటించుకునే చంద్రబాబు.. ఇద్దరు మిత్రుల మాదిరిగా కలిసివున్న సినీనటుడు మోహన్ బాబుకు తనకు విబేధాలకు అస్కారం వచ్చింది కూడా అక్కడేనని స్వయంగా మోహన్ బాబే అప్పట్లో ప్రకటించారు.

తాను హెరిటేజ్ సంస్థలో తన వాటాగా ఆ రోజుల్లోనే పెట్టిన పాతిక లక్షల రూపాయల పెట్టుబడులను చంద్రబాబు వెనక్కి ఇవ్వక.. ఇటు హెరిటేజ్ లో వాటాను కూడా ఇవ్వక తనను మోసం చేశాడని ఆరోపించిన ఆయన ఆ తరువాతి ఎన్నికలలో బీజేపి తరపున ప్రచారం కూడా చేస్తూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు చతరుత గురించి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు  రాజకీయాల్లోనే కాకుండా ఉద్యోగులను కూడా ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారన్న అంశమై ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ప్రకటించారు.

రాజకీయాలలోనే కాకుండా రాష్ట్ర పరిపాలనలో కూడా చంద్రబాబు తనదైన చతురత ప్రదర్శిస్తారని ఆయన పేర్కోన్నారు. పాలనా విభాగంలో వున్న ఉన్నత ఉద్యోగులను తన దారికి ఎలా రప్పించుకుని.. తన పనులు చకచకా చక్కబెట్టుకోవడంలో ఆయన మహా దిట్ట అంటూ కితాబిచ్చారు ఐవైఆర్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన కీలక అరోపణలు చేశారు. తన దారికి రాని ఉద్యోగులను చంద్రబాబు ఎలా తప్పిస్తారన్న అంశమై ఐవైఆర్ అరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఆయన ఓ పోస్టును పెట్టారు.

కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీని ప్రస్తావించిన ఆయన, ఓ అధికారిని బదిలీ చేయడం అన్నది చాలా సర్వ సాధారణమేనని అన్నారు. ఇదే సమయంలో బదిలీని సమర్థించుకునేందుకు ఆయనపై ఆరోపణలను మీడియాకు ముందుగానే లీక్ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బదిలీల ప్రక్రియ సాగుతోందని కృష్ణారావు ఆరోపించిన సంగతి తెలిసిందే. మీడియాకు ముందుగానే లీకులిచ్చి తమకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయడమే చంద్రబాబు వ్యూహ చతురతని అన్నారు. రొటీన్ గా బదిలీ చేస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవని, ఈ రకంగా వ్యవహరించడం తప్పుడు సంకేతాలను పంపుతోందని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  iyr krishna rao  officials  employees  bureaucracy  andhra pradesh  CM stratagey  

Other Articles