Chandrababu Fire on Payyavula over meet with KCR | ఇంతకీ పయ్యావుల చేసిందాంట్లో తప్పేముంది?

Chandrababu class to payyavula

Payyavula Keshav, TDP Chief Chandrababu Naidu, Paritala Sriram Wedding, Chief Minister KCR, KCR Payyavula Chandrababu, TTDP Payyavula Keshav Chandrababu

TDP Chief Chandrababu Naidu Fire on Senior Leader Payyavula Keshav over personal Meet with KCR in Paritala Sriram Wedding. TTDP Leaders Angry with Payyavula's Attitude and complaint at Chandrababu.

కేసీఆర్ తో ఏకాంత భేటీపై పయ్యావులకు క్లాస్?

Posted: 10/11/2017 10:18 AM IST
Chandrababu class to payyavula

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం జరిగిన వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఆపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పయ్యావుల కేశవ్ ఏకాంతంగా మాట్లాడటం వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమైన వేళ, రేవంత్ తదితరులు ఈ విషయాన్ని ప్రస్తావించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పయ్యావుల వైఖరిని చంద్రబాబు తప్పుబట్టినట్లు సమాచారం.

తాజాగా జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ... "తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడి వాళ్ల మనోభావాలను మనం గౌరవించాలి. నేను, కేసీఆర్ కూడా కలుసుకున్నాం. ఒకచోట ఎదురుగా వచ్చి, రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆపై ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోయాం. కానీ మన మంత్రులు, నేతలు పరిధులు దాటి ఆయనతో దగ్గరగా మెసిలారు" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

దీనిపై తెలంగాణ పార్టీ నేతలు తనవద్ద అభ్యంతరాలను వ్యక్తం చేశారని అంటూ, "పయ్యావుల సీనియర్. ఆయనకు కేసీఆర్ తో ఏకాంత సమావేశాలు ఎందుకు? ఏం సందర్భం ఉంది? పెద్ద నేతలు కూడా ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో రాజీనామాలు చేసి వెళతామంటున్నారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పయ్యావుల కేశవ్, మనస్తాపానికి గురయ్యారు.

పయ్యావుల ఏమన్నారు?

ఈ విషయంలో చంద్రబాబుకు అవాస్తవాలు చెప్పారు. అందువల్లే నేను మాటలు పడాల్సి వచ్చిందని ఇతర టీడీపీ నేతల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనలో తన తప్పేముందని ప్రశ్నించిన ఆయన, పరిటాల ఇంట పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని చెప్పారు. కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానని, ఆ వెంటనే తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని ఆయన పంపి తనను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లానని చెప్పారు.

ఆయనే(కేసీఆర్) తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదని అన్నారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు. ఈ తరహా వైఖరులు సరికావని.. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా చేయడం మినహా మరో మార్గం తమ ముందు ఉండబోదని టీటీడీపీ నేతలు చంద్రబాబుతో తేల్చిచెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Chandrababu guess cbi may withdraw cases on ys jagan

  ఎన్నిసార్లు బాబూ.. చారిత్రక తప్పిదం..?

  Mar 17 | ఇన్నాళ్లు కేంద్రంతో దోస్తీ చేసి.. కేంద్రంతో వైరం పెంచుకుని ఏం సాధించలేమని చెప్పుతూ.. ఇక కేంద్రం ప్రత్యేక హోదాకు నో చెప్పినా.. దానిని కూడా స్వాగతించి.. హోదా కన్న ప్యాకేజీయే ముద్దు అని చెప్పిన... Read more

 • Janasena activists questions chandrababu on his suspect remarks

  అనుమానం నిజమే ఐతే స్వాగతించక.. విమర్శలా.?

  Mar 15 | జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ తీసుకున్న రాజకీయ కీలక మలుపు నేపథ్యంలో తన వాడి వేడితో టీడీపీపై అస్త్రాలుగా చేసి ప్రశ్నలను సంధించిన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు... Read more

 • Janasena activists questions chandrababu on his remarks on pawan kalyan

  అవినీతి, వెన్నుపోటు అరోపణలపై ఎందుకు మాట్లాడరూ..?

  Mar 15 | సమైక్య అంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిగా ఇప్పటికే చరిత్రపుట్టల్లో పేరును నమోదు చేసుకున్న టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు.. తనపై ఎవరు అరోపణలు చేసినా.. తన పార్టీ నేతలో విమర్శలు... Read more

 • Former dgp s alleges cms interference in vvip treatment to convict sasikala

  శశికళ రాజబోగాల వెనుక సీఎం ప్రమేయం.?

  Mar 08 | తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అమె మరణానంతరం వెలువడిన తీర్పులో దోషిగా నిర్ధారించబడి.. జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ కార్యదర్శ శశికళకు రాజబోగాల కల్పనలో ఏకంగా ఓ ముఖ్యమంత్రి ప్రమేయమే... Read more

 • Upendra may shut down his party

  పార్టీని మూసేసే యోచనలో హీరో ఉపేంద్ర

  Mar 06 | రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తానంటూ కొత్త పార్టీ పెట్టిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర త్వరలో పార్టీని మూసేయాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం, తనపై తిరుగుబాటుకు కొందరు... Read more

Today on Telugu Wishesh