government orders mudragada house arrest ఆయన గడప దాటితే.. సర్కారుకు ఎందుకు దడ..

Government orders mudragada house arrest before konaseema paryatana

Mudragada padmanabham, chandrababu, ap government, kirlampudi, kapu reservations, konaseema paryatana, kapu leader, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, kapu leaders, tuni violence, mudragada, mudragada hunger strike, NTR, AP politics

Police house arrest Kapu caste leader Mudragada padmanbham in spite of his konaseema paryatana who alleges chandrababu government failed in fullfilling election promises.

ఆయన గడప దాటితే..సర్కారుకు ఎందుకు దడ..!

Posted: 10/07/2017 04:25 PM IST
Government orders mudragada house arrest before konaseema paryatana

కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విషలమయ్యారని, కాపుల మధ్య వర్గాలను తీసుకువచ్చి విభజించి పాలించే ఒరవడిని తీసుకువచ్చారని అరోపించిన కాపు హక్కుల సాధన ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు గృహనిర్భంధానికి గురయ్యారు. ఆయన గడప దాటి బయటకు వస్తానని ప్రకటించిన ప్రతీసారి ప్రభుత్వం ఆయనపై ప్రత్యేక శ్రధ్ద తీసుకుని ఆయనకు ఇంటికే పరిమితం అయ్యేలా చర్యలు తీసుకుంటుంది.

అంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని, అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని.. అమరావతి నిర్మాణం తనతోనే సాథ్యమని ప్రసంగాలు చేస్తున్న ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. ముద్రగడ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొంత వెనక్కు తగ్గుతూనే వున్నారు. తునిలో కాపు గర్జన తరువాత ఆయన ఎప్పుడు, ఎక్కడ ఏ సభ నిర్వహిస్తానన్నా, ఏ పాదయాత్ర చేపడుతానని చెప్పినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనకు చుట్టూ అంక్షల వలయాన్ని అల్లేస్తుంది.  

సభలు నిర్వహించాలంటే ముందుగా తమ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. సభ అద్యంతం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవాని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు హామీఇస్తూ పత్రాలను రాసిస్తే తాము అనుమతిస్తామని కూడా చెబుతున్నారు. అయితే ఇందుకు మాత్రం ముద్రగడ సహా కాపు నేతలు ససేమిరా అంటున్నారు. అందుకు వారి వద్ద కారణాలు కూడా లేకపోలేదు. ప్రతిపక్ష హోదాలో వున్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక పాదయాత్రలు, పర్యటనలు చేసిన చంద్రబాబు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు అనుమతులు తీసుకున్నారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు తీసుకునే అవకాశమే లేదని తేల్చిచెబుతున్నారు. ఇదే క్రమంలో తాను కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ  కార్యక్రమాన్ని తలపెట్టినా.. దానిని విఘాతం కల్గించేందుకు గృహనిర్భంధం చేస్తున్నారని అరోపిస్తున్నా ఆయన.. చివరకు ప్రభుత్వం తనను తన జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించేందుకు కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపులకిచ్చిన ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చాలని మళ్లి లేవనెత్తారు.

ఈ క్రమంలో ఆయన తాజాగా ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు శ్రీకారం చుడతానని ప్రకటించారు. అంతే దీంతో ఆయనపై అంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు పోలీసులు. గతంలో అదే రోజున కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరకుని కాపు నేతలను అయన ఇంటికి రానీయకుండా.. ఆయన కుటుంబసభ్యులపై కూడా దాడి చేసి మరీ ఆయనపై అంక్షలను అమలు చేసే పోలీసులు.. ఈ సారి ప్లాన్ మార్చారు. ఒక రోజు ముందుగానే అయన ఇంటికి చేరకుని అయనను ఎవరూ కలవకుండా, ముద్రడగ ఇంట్లోంచి బయటకు రాకుండా నిలువరించారు.

ఈ సారి ఆయన కాపు గర్జన, పాదయాత్రలకు పూనుకోకుండా ఆత్మీయ పలకరింపు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నట్టు ముద్రగడను ఇవాళ్టి నుంచి నిర్భంధంలోకి తీసుకున్నారు. దీంతో కిర్లంపూడిలోని ఆయన నివాసం వద్ద తీవ్ర కలకలం రేపుతోంది. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానులను ఆత్మీయంగా పలుకరించనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయనను జీవితాంతం గృహనిర్బంధం చేస్తారా? వ్యక్తిగత హోదాలో పర్యటించడానికి కూడా అవకాశం ఇవ్వారా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయన వ్యక్తిగత పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్వయంగా మంత్రి చినరాజప్ప చెప్పినా.. ముద్రగడ ఇంటి నుంచి కదలకుండా  ఆయన నివాసం చుట్టూ తాజాగా పోలీసులు మోహరించడమేంటని గ్రామస్థులు, కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles