Modi too follow use and throw policy in politics.? మోడీది కూడా యూజ్ అండ్ త్రో విధానమా..?

Modi too follow use and throw policy in politics

Pawan Kalyan, JanaSena, PM Modi, Social Media, Swachhta Hi Seva, modi letter to celebs, Andhra Pradesh, Telangana, Rahul Gandhi, Andhra Pradesh special status, AP special status, Congress, Narendra Modi, BJP, Chandrababu Naidu, TDP

Jana Sena chief power star Pawan Kalyan who had tendered his rentless services to bring BJP and TDP into power was ignored by PM Modi, after demanding special status for Andhra Pradesh.

మోడీది కూడా యూజ్ అండ్ త్రో విధానమా..?

Posted: 09/19/2017 06:35 PM IST
Modi too follow use and throw policy in politics

రాజకీయాలలో మార్పును తీసుకువస్తానని ప్రజల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన నేటి బీజేపికి.. నాటి బీజేపికి చాలా వత్యాసం వుందా..? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపి పార్లమెంటు సభ్యుడు నిర్మోహమాటంగా చెప్పినట్లు విమర్శలు చేస్తే స్వీకరించే స్థాయిలో బీజేపి పార్టీ కానీ, లేక అధికారంలో వున్న ప్రభుత్వం కానీ లేదని చెప్పినట్లుగానే ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వం చర్యలు స్పష్టం చేస్తున్నాయి. విమర్శలను అన్ని రకాలుగా ఖండించడమో లేక మౌనముద్ర వహించడమే చేసి.. వ్యూహాత్మకంగా దాటవేతధోరణిని అవలంభిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిరాగానే స్వచ్చా భారత్ నినాదాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన తరువాత.. ఏకంగా తన క్యాబినెట్ లోని మంత్రే స్వచ్ఛా భారత్ కు విరుద్దగా రొడ్డుపై తన కాన్వాయ్ వాహనాలను అపి మరీ అక్కడి గోడలపై మూత్రవిసర్జన చేసిన ఫోటోలు అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారియి. అయినా అయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా తమకో న్యాయం.. పోరుగు పార్టీల వారికో న్యాయం అన్న విధంగా ఈ పాలన సాగుతుందన్న విమర్శలు కూడా వస్తున్నా.. పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ఇక గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటే తమ పార్టీయే అధికారంలోకి రావాలని రాష్ట్రవ్యాప్తంగా పలు సభల్లో పాల్గోని చెప్పిన మోడీ, బీజేపి నేతలు.. అధికారంలోకి  వచ్చిన తరువాత అటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పర్యాయాలు విన్నవించినా.. ఇటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినా.. వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోకుండా అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. నీటి అయోగ్ పేరుతో కొంతకాలం నిరీక్షింపజేసినా.. చివరకు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.

దాని స్థానంలో ప్యాకేజీ అన్న అర్భాటమేదో చేశారే కానీ.. అది కూడా చప్పగానే వుందని రాజకీయ విశ్లేషకులు విమర్శించారు. ప్రత్యేక హోదా కల్పనతో గుజరాత్ కన్నా ఏపీ శరవేగంగా అభివృద్దిలో దూసుకుపోతుందన్న అనుమానం నేపథ్యంలో ఇవ్వలేదన్న విమర్శలపై కూడా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదన్నది వాస్తవం. అయితే ప్రత్యేక హోదా కల్పనపై రాష్ట్ర ప్రజలను జాగృతం చేసేందుకు పలు సభలు పెట్టిన ప్రశ్నించిన నాటి మిత్రుడు.. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇప్పుడు వైరివర్గంగా బీజేపి సర్కార్ భావిస్తుందా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది.

అడగకుండానే వచ్చి ప్రచారం చేసి.. అందలం ఎక్కించడంలో.. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తాను మద్దతు తెలిపిన ప్రభుత్వాలే వుండటం వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అశించి కష్టపడి అనేక సభలు, సమావేశాల్లో పాల్గోని రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ ను.. ఇప్పుడెందుకు దూరం పెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలదీసినందుకేనా..? నవ్యంద్రలో ప్రచారంలో తల్లిని చంపి పిల్లను బతికించారని వ్యాఖ్యలు చేసి.. తెలంగాణ పర్యటనలో వేగంగా అభివృధ్ది చెందుతున్న రాష్ట్రమని దుస్తులు మార్చినంత ఈజీగా మాటలు మార్చిన పెద్దలు.. మూడేళ్ల క్రితం మిత్రులను ఇప్పుడెందుకు దూరం చేసుకుంటున్నారు.

‘స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ తెలుగు సినిమా రంగంలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు. ‘దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు మోహన్‌బాబు, స్టార్ హీరోలు ప్రభాస్, ప్రిన్స్ మహేష్‌బాబులకు ప్రధాని లేఖలు రాశారు. మరి అడగకుండానే వెళ్లి మరీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసిన పవన్ కల్యాన్ ను మాత్రం ఎందుకు మర్చిపోయారు. అంటే మోడీ ప్రభుత్వం కూడా యూజ్ అండ్ త్రో విధానాన్ని అమలు చేస్తుందా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
 
గత ఎన్నికలకు ముందు పవన్.. మోదీని కలిశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో మోదీతో కలిసి అనేక సభల్లో పాల్గొన్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కూడా వెళ్లారు. ఆ సందర్భంగా ప్రధానిని పవన్ ఆళింగనం చేసుకుని మరీ ఆహ్వానించారు. అంతేకాదు మరో సందర్భంగా పవన్ ను మోదీ పొగిడారు. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న పవన్ కు మోదీ లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకోసం కాకుండా కేవలం తన రాష్ట్రవాసులు బాగుండాలని.. తన రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారమయం కాకూడదని పదే పదే ప్రత్యేక హోదా కోరినందుకే పవన్ కల్యాన్ ను మోదీ దూరం పెట్టారా...? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అయితే ఇప్పటికీ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఎక్కడ సభ పెట్టినా.. పేదలనుద్దేశించి చేసే వ్యాఖ్యలు మీకు గుర్తుండే వుంటాయి కదూ. మీ అకౌంట్లలోకి మూడు లక్షల రూపాయలు వచ్చాయా..? ఈ ప్రశ్న వేసేది ఎందుకో కూడా మీకు తెలుసు. విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకువచ్చి.. పేదలకు పంచుతామన్న హామీతోనే అధికారంలోకి వచ్చిన బీజేపి.. అయన అనునిత్యం టార్గెట్ చేస్తూనే వుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర యువత కోసం ఏలాంటి లాభాపేక్ష లేకుండా హోదా అడిగి.. నిష్టూరమైన పవన్ కు మోదీ ‘స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంపై లేఖ రాయకపోవడంపై కూడా బీజేపి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Special status  Swachhta Hi Seva  Social Media  Andhra Pradesh Politics  

Other Articles