kiran kumar reddy re-entry into politics..? పాలిటిక్స్ లోకి రీఎంట్రీకి సమయం వచ్చిందా.?

Kiran kumar reddy re entry into politics

kirankumar reddy re-entry into politics, kirankumar reddy to join BJP, kirankumar reddy to join Congress, kiran kumar reddy, former cm, united andhra pradesh, raghuveera reddy, congress, BJP, AP PCC, Politics

If sources are to be belived, Former CM kiran kumar reddy to join congress and take charge of andhra pradesh congress committee.

పాలిటిక్స్ లోకి రీఎంట్రీకి సమయం వచ్చిందా.?

Posted: 09/15/2017 07:02 PM IST
Kiran kumar reddy re entry into politics

ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా..? రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు, చెవాక్కులు పేల్చి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన చేతులు కాల్చుకున్న మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? ఆయనైతేనే నవ్యాంద్రలో కాంగ్రెస్ పార్టీ గాడిన పడుతుందని అగ్రనాయకత్వం భావిస్తుందా..? ఈ మేరకు నవ్యాంద్ర పగ్గాలను ఆయనే అందుకోబోతున్నారా.? ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయా.. అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి.

ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. అయితే మాజీ ముఖ్యమంత్రిగా వున్న కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయ పునరాగమనం చేస్తారని ఇప్పటికే పలు పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ వైపు ఆయన చూస్తున్నారన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన మాటను పెడచెవిన పెట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా ఆయన అప్పట్లో ఏకంగా అధినేత్రి సోనియాగాంధీతో పాటు యువనేత రాహుల్ గాంధీని కూడా విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయన జాతీయ పార్టీ వైపు మాత్రమే అకర్షితులవుతున్నారని అయితే బీజేపి కండువా కప్పుకునేందుకు రమారమి సిద్దమయ్యారని కూడా వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో ఎందుకనో కాషాయ కండువా కప్పుకునేందుకు అయిష్టత వ్యక్తం చేసిన ఆయన.. మళ్లీ తనకు రాజకీయ ఉన్నతిని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి పునరాగమనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలని అధిష్టానం భావిస్తుంది.

ఇందుకోసం ఆయన కీలక భాద్యతలను అందజేయాలని కూడా యోచిస్తుందని సమాచారం. ఈ మేరకు ఆయనకు పిసీసీ పగ్గాలను కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. సౌమ్యుడు, మృదుస్వభావి అయిన రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలను అందుకున్నా.. ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించినంత మద్దతు లభించడం లేదని కూడా అధిష్టానం గహ్రించింది. మరి కిరణ్ కుమార్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఎప్పుడిస్తారో.. ఎలా గాడిన పెడతారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kiran kumar reddy  former cm  united andhra pradesh  raghuveera reddy  congress  BJP  AP PCC  Politics  

Other Articles