venkaiah naidu gives good signs to mothkupalli మోత్కుపల్లికి వెంకయ్య సంకేతాలు..ఎందుకోసమో.?

Venkaiah naidu gives good signs to mothkupalli

mothkupalli narsimhulu, governor, venkaiah naidu, vice president of india, tdp felicitates venkaiah, TDP leaders on venkaiah, good indications, mothkupalli to be governor, mothkupalli governor

elected vice president m venkaiah naidu gives good indications to telangana tdp leader mothkupalli narsimlu. want to know the details of good signs.?

మోత్కుపల్లికి వెంకయ్య సంకేతాలు..ఎందుకోసమో.?

Posted: 08/09/2017 04:31 PM IST
Venkaiah naidu gives good signs to mothkupalli

భారత ఉపరాష్ట్రపతిగా, పెద్దల సభ చైర్మన్ గా ఎన్నికైన వెంకయ్య నాయుడు.. ఈ నెల 11న ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాలలో తన మనస్సులోని మాటను బయటపెట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని మరో పర్యాయం ప్రధానిగా చేసిన తరువాత తానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినట్లు చెప్పారు. అయితే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అంచలంచెలుగా ఎదిగిన పార్టీలో ఉన్నతస్థాయికి ఎదిగిన తనను.. పార్టీ అదేశానుసారం ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి విజయం సాధించానని, అయితే ఆ పదవికి వన్నే తీసుకువచ్చేందుకు తాను శాయశక్తులా కృష్టి చేస్తానని అన్నారు.

కాగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడిని తెలంగాణ టీడీపీ నేతలు సత్కరించారు. బంజారాహిల్స్‌లోని వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ నేతలు ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రావు తదితరులు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. మోత్కుపల్లికి శుభసంకేతాలను ఇచ్చారు. అదేంటి అంటారా.. అవునండీ తెలంగాణ టీడీపీ నేతలలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నే టార్గెట్ చేసి చాకచక్యంగా ఇరుకున పెట్టగల చుతురత వున్న నేత మోత్కుపల్లి.

అయితే తెలంగాణ రాష్ట్ర అవిర్భావ నేపథ్యంలో ఆయన గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో అంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తనను పంపుతారని ఆశించినా.. అది సఫలం కాలేదు. దీంతో చంద్రబాబుపై ఒకింత అసహనంతో వున్న ఆయనకు గవర్నర్ పదవి లభిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రమంలో వెంకయ్యను సన్మానించేందుకు వచ్చిన తెలంగాణ నేతల సమక్షంలోనే ఆయన మోత్కుపల్లికి త్వరలోనే శుభవార్త వింటావు అన్నారట. అంటే మోత్కుపల్లికి త్వరలో గవర్నర్‌ హోదా దక్కబోతోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles