హస్తిన రాజకీయాలపై ఆ మాజీ సీఎం గురి | Ex CM Second Innings with Home Party only Rejoin Soon

Ex cm likely to join congress soon

Kiran Kumar Reddy, Nallari Re Joins Congress, Kiran Kumar Reddy Congress Party, EX CM Active Delhi Politics, Kiran Kumar Reddy Congress, Congress Kiran Kumar Reddy, Telugu States Ex CM, Nallari Active Mode, Nallari Re Join Congress

Telugu States Ex CM Kiran Kumar Reddy Joins Congress Soon. Already Touch with AICC Key Leaders and discuss with his re joining.

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ముఖ్యమంత్రి

Posted: 07/25/2017 12:19 PM IST
Ex cm likely to join congress soon

ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ మాజీ కాంగ్రెస్ నేత వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, సరిగ్గా ఎన్నికల సమయంలో అధిష్ఠానంతో తెగదెంపులు మరీ సమైక్య నినాదం బలంగా వినిపించాడు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆపై ఉండవల్లి లాంటి కొందరు అనుయాయులతో కలిసి 'జై సమైక్యాంధ్ర' పార్టీ తో పోటీ, బొక్కా బోర్లాపడటం తదితరం తెలిసిందే. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిన్న వార్తలో కూడా కనిపించకుండా పోయాడు. ఆ మధ్య గ్యాప్ తర్వాత వచ్చి మరీ పార్టీ చేరికపై హింట్ ఇచ్చి, మళ్లీ కనుమరుగు అయిపోయాడు.

పెళ్లి గురించి మాట్లాడాము. పెళ్లి కూతురు పేరు ఇప్పటికి గోప్యం. ముహూర్తం ఖరారైతే మీ అందరికీ శుభలేఖలు వస్తాయి. తొందరెందుకు' ? అంటూ తన అనుచరులతో చెప్పి దాదాపు 8 నెలలు కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఏ పార్టీని సంప్రదించారు? ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు? వెళ్లితే ఇంత లేట్ ఎందుకు? అంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి సొంత గూటికే చేరబోతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి.

Nallari Kiran Kumar Reddy Re Join Congress

తనకు బాగా సన్నిహితులైన ఏఐసీసీ నేతలతో కి.కు.రె మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. మధ్య మధ్యలో సీక్రెట్ గా ఢిల్లీ టూర్ లు కూడా వేస్తున్నాడనే సమాచారం ఉంది. తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నప్పటికీ, చేరికపై మిగతా పార్టీల నుంచి పెద్దగా స్పందన రాకపోవటం, ఏపీలో కాంగ్రెస్ పరిస్థితులు అంత సుముఖంగా లేకపోవటం మూలంగా కేంద్ర రాజకీయాలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran Kumar Reddy  Congress Party  Re join  

Other Articles