telugu states assembly seats increase file on hold at amit shah అమిత కటాక్షం కోసం చంద్రుల నిరీక్షణ

Amit shah to finalise increase of telugu states assembly seats

increase of telugu states assembly seats, increase of telangana assembly seats, increase of andhra pradesh assembly seats, Amit Shah, telugu states, assembly seats increase, Assembly Constiuencies, Andhra Pradesh, Telangana

BJP national President amit shah to take final decision on increase of assembly seats in telugu states after presidential polls.

‘అమిత’ కటాక్షం కోసం చంద్రుల నిరీక్షణ

Posted: 07/13/2017 02:13 PM IST
Amit shah to finalise increase of telugu states assembly seats

తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం అసెంబ్లీ స్తానాల పెంపు. ఇది జరిగితే తప్ప తమ నాయకులతో పాటు.. ఇతర పార్టీల నుంచి గెలిచి తమ పార్టీలోకి వలస వచ్చిన నేతలకు కూడా న్యాయం చేయలేమని.. ఇద్దరు చంద్రులకు అంతర్గతంగా మదనపడుతున్నారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపి నేతలు మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచితే.. పార్టీకి కలిసోచ్చే అంశాలు మాత్రం కనిపించడం లేదని, తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా పుంచజుకునే వరకు అంటే మరో ఐదేళ్ల వరకు ఈ అంశాన్ని నాన్చాలని ఆ తరువాత ఈ విషయమై చర్యలు తీసుకుంటే అప్పటి వరకు పార్టీని బలోపేతం దిశగా చేస్తామని అడ్డుపుల్లులు వేస్తున్నారని సమాచారం.

రాష్ట్ర పునర్విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని స్పష్టంగా పేర్కోన్న నేపథ్యంలో దానిని అమలు చేయాలని ఇద్దరు చంద్రులు అధికారంలోకి వచ్చిన నాటి నుచి కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే అది నుంచి కాదు.. కూడదు.. అంటూ వచ్చిన కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుతున్న నేపథ్యంలో అ దిశగా అడుగులు వేసింది. అసెంబ్లీ సీట్ల పెంపుపై విస్తృతంగా అధ్యయనం చేసిన కేంద్ర హోంశాఖ ఇందుకు పచ్చజెండా ఊపింది. రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని మూడవ సబ్ క్లాజ్ కు స్వల్ప సవరణలు చేయడం ద్వారా వీలు కల్పించవచ్చని అభిప్రాయపడింది. దీంతో ఈ విషయమై త్వరలోనే ప్రధాని మోడీ కూడా సమీక్షించనున్నారు.

ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కలసి వచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చేందుకు మద్దునిస్తున్న నేపథ్యంలో తాము ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని కూడా పరిష్కరించాలని చంద్రులు కోరడంతో అందుకు బీజేపి నాయకత్వం అంగీకరించనట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తరువాత అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరిష్కరిస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇరురాష్ర్టాల బీజేపి నేతలను ఢిల్లీ పిలిపించి ప్రతిష్ఠంబన తొలిగిస్తారని తెలుస్తుంది. దీంతో అమిత కటాక్షం కోసం ఇద్దరు చంద్రులు నిరీక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles