India hands over Mallya extradition papers మాల్యాకు బెయిల్ వెనుక వున్నది ఎవరు..?

No delay in sending evidence for vijay mallya case says home ministry

Vijay Mallya, Mallya extradition, Britain, India, External Affairs Ministry, Ministry of External Affairs, MEA, London, Vijay Mallya case, Home Ministry of India, West Minister court, mallya bail, mallya cricket, king fisher, liquor baron

Spokesperson Ashok Prasad said the documents did not come to the home ministry and the CBI had sent directly to the External Affairs Ministry as it was vetoed by the home ministry earlier.

మాల్యాకు బెయిల్ వెనుక వున్నది ఎవరు..?

Posted: 06/17/2017 02:16 PM IST
No delay in sending evidence for vijay mallya case says home ministry

దేశం నుంచి 9 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు తిరిగి అప్పగించాలన్న కేసులో అయనకు బెయిల్ రావడం వెనుక ఉన్నది ఎవరన్న ప్రశ్నలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ విజయ్ మాల్యాను భారత్ తీసుకురావడం అంత ఈజీగా అయ్యే పని కాదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసలు మాల్యా వెనుక వున్న పెద్ద వ్యక్తుల ప్రమేయం గురించి చర్చప్రారంభమైంది.

ఈ చర్చకు దారితీసే పరిణామాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలన్న కేసులో ఆధారాలు సమర్పించేందుకు తమకు మూడు నుంచి నాలుగు వారాల సమయం కావాలంటూ భారత్ తరపున మాల్యా కేసును వాదిస్తున్న లండన్ లోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్.. వెస్ట్ మినిస్టర్ కోర్టులో వాదనల సందర్భంగా తెలిపింది. దీంతో మాల్యా కేసులో అధారాలకు ఎక్కడ జాప్యం జరిగింది. ఎందుకు జాప్యం జరిగింది అన్న విషయమై క్లారిటీ లేకపోయింది.

దీంతో మాల్యం వెనుక పెద్ద వ్యక్తుల ప్రమేయం వుండబట్టే అధారాలను పంపేందుకు అలస్యమైందన్న అరోపణలు వినబడుతున్నాయి. తొమ్మిది వేల కోట్ల రూపాయల పైచిలుకు రుణాలను ఎగవేసిన తరువాత కూడా ఆయనను కనీసం చిల్లర దొంగను పరిగణించినట్లు కూడా కేంద్రం భావించలేదని, అందుచేతే ఆయన ఏకంగా పార్లమెంటుకు వెళ్లి.. అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కలసి ముచ్చటించిన తరువాతే దేశం విడచి వెళ్లిపోయారన్న విమర్శలు సైతం వినబడుతున్నాయి.

లండన్ న్యాయస్థానం అంగీకరించిన తరువాతే మాల్యాను భారత్ కు తిరిగి తీసుకురాగలమని స్వయంగా కేంద్రమంత్రి వ్యాఖ్యానించడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఉగ్రవాదులు పీచమణుతామన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. అర్థిక ఉగ్రవాదులకు మాత్రం అండగా నిలుస్తుందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అలస్యంగా మేల్కోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదనలపై స్పందించింది.

సీబిఐ అధికారులు నేరుగా విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారులకు జూన్ 8నే ఆధారాలను పంపించారని, అవి హోం మంత్రిత్వ శాఖ అంతకుముందే వాటిని పరిశీలించిందని హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ తెలిపారు. భారత్ బ్రిటిష్ అధికారులకు అన్ని ఆధారాలు పంపించామని, ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగలేదని విదేశాంగ శాఖ కూడా అదే విషయాన్ని తెలిపింది. మాల్యాను భారత్‌కు అప్పగించడంపై లండన్ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆధారాలతో కూడిన అన్ని పత్రాలను పంపినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే 8న పంపిన అధారాలను 13న లండర్ కోర్టులో జరిగిన విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఎందుకు ఫైల్ చేయలేదన్నదే అసలు ప్రశ్న.

ఈ ‘ఆధారాలను కొర్టులో ప్రవేశపెట్టి వుంటే మాల్యాకు అక్కడి న్యాయస్థానం ఈ నెల 13న జరిగిన విచారణలో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేసేది కాదన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యా వెనుక.. ఆయనకు బెయిల్ రావడం వెనుక ఎవరో పెద్ద మనుషుల ప్రమేయం వుందన్న అనుమానాలకు తావిస్తుంది. అయితే వారు ఎవరన్న విషయంలో మాత్రం క్లారీటీ లేదు. ఇక ఈ విషయంలో పలువురు నేతలు మాత్రం లండన్ పోస్టల్ డిమార్టుమెంటు ప్రమేయంతోనే మాల్యా బెయిల్ పోందారని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  king fisher  liquor baron  bail  london  west minister court  mea  mha  

Other Articles