JD Lakshmi Narayana Back To Telangana? హైదరాబాద్ పోలీస్ బాస్ గా లక్ష్మీనారాయణ..?

Jd lakshmi narayana to take charges as hyderabad police boss

JD Lakshmi Narayana, DGP, Anurag sharma, police boss, hyderabad police comissioner, Jagan, YSRCP, Telangana

JD Lakshmi Narayana Back To Telangana on deputation, if sources are to be belived he is yet to take charges as hyderabad police boss

హైదరాబాద్ పోలీస్ బాస్ గా లక్ష్మీనారాయణ..?

Posted: 05/14/2017 01:13 PM IST
Jd lakshmi narayana to take charges as hyderabad police boss

తెలుగువారైన ఐపీఎస్ అధికారులు ఎందరో వున్నారు. కానీ నిరాడంబరుడైన అధికారిగా కొనసాగుతూ.. కేవలం తన పనితీరుతోనే ప్రజల నుంచి మన్ననలు అందుకున్న వారు మాత్రం కొందరే. వారిలో ఒకరు లక్ష్మీనారాయణ. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకుసాగే అధికారిగా లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. మరీ ముఖ్యంగా ఆయన సీబిఐ హైదరాబాద్ చీఫ్ గా అయన సేవలందించిన క్రమంలో అయన ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.

ప్రస్తుతం మహారాష్ట్ర అదనపు డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు త్వరలోనే తెలంగాణ కేడ‌ర్‌కు రానున్నారా? ఆయన హైద‌రాబాద్ పోలీస్ బాస్ గా బాధ్య‌త‌లు చేపట్టనున్నారా..? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఈ మేరకు సంకేతాలిస్తూ ఆయన తెలంగాణ పోలీస్ బాస్ డీజీపి అనురాగ్ శర్మను కలవడమే ప్రస్తతం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పలకిరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ కేవలం మర్యాద పూర్వకంగానే  డీజీపీని కలిశానని తెలిపినా.. అసలు విషయం మాత్రం ఆయన ఢిఫ్యూటేషన్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం.

అయితే మహారాష్ట్ర ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్త‌లు వెలువడుతున్నాయి. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన లక్ష్మీనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ అక్రమాస్తుల ఆరోప‌ణ‌ కేసుపై సీబీఐ డీఐజీగా దర్యాప్తును హైదరాబాద్‌లో ఉండి పర్యవేక్షించడంతో ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అయితే  తెలంగాణాలో డిప్యూటేషన్‌పై కొనసాగాలని ఆయన ఆకాంక్షగా ఉన్న‌ట్లు స‌మాచారం. కేంద్ర హోంశాఖతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద తన అభిమతాన్ని ఆయన తెలియచేసినట్టు స‌మాచారం.

క్షేత్ర‌స్థాయిలో కూడా అనుకూల‌త‌ను పెంచుకోవ‌డంలో భాగంగా రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి తన ఆసక్తి గురించి వివరించినట్టుగా సమాచారం. అందుకు ఆయన కూడా లక్ష్మీనారాయణకు వెల్‌ కమ్‌ చెప్పినట్టు తెలిసింది. ఒక వేళ ఆయన డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన పక్షంలో ప్ర‌స్తుతం న‌గ‌ర క‌మిష‌న‌ర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి తర్వాత హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా లక్ష్మీనారాయణను నియమించే అవకాశాలు లేకపోలేదని ఐపీఎస్‌ వర్గాలలో చ‌ర్చ సాగుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో అనురాగ్‌శర్మ రిటైర్‌ అయ్యాక రాష్ట్ర డీజీపీ పగ్గాలు మహేందర్‌రెడ్డికి దక్కనున్నాయని, ఆయన స్థానంలో కమిషనర్‌గా లక్ష్మీ నారాయణ నియమితులవుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JD Lakshmi Narayana  DGP  Anurag sharma  police boss  hyderabad police comissioner  Jagan  YSRCP  Telangana  

Other Articles