Aranab Goswami hits out at Pawan Kalyan

Arnab goswami comments on pawan kalyan

Arnab Goswami, Arnab Goswami Pawan Kalyan, Pawan Kalyan Arnab Goswamy, Republic TV Editor, Pawan Arnab, Arnab BJP, Arnab Pawan BJP, BJP New Voice Arnab, Pawan Stupid Act Arnab

Republic TV editor in chief Arnab Goswami bashes at Jana Sena Chief Pawan Kalyan. Pawan comments on North-South disparity has been severely criticized by political parties & opponents.

పవన్ పై ఆర్నాబ్ తీవ్ర స్థాయిలో విమర్శలు

Posted: 05/12/2017 04:25 PM IST
Arnab goswami comments on pawan kalyan

నా సినిమాలు చూస్తే చూడండి.. లేకపోతే పోండి. ఇది కొంత కాలం క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓపెన్ గా చెప్పిన మాట. అతని మాటకు కట్టుబడే ప్రేక్షకులు కూడా సినిమాలను చాలా దూరం పెట్టేశారు కూడా. అయితే తన కామెంట్లతో, ట్వీట్లతో మీడియాకు సినిమా నుంచి దొరికిన ఆణిముత్యంగా వర్మ ఫీలయితే.. జర్నలిజం నుంచి దొరికిన మరో మాణిక్యం ఆర్నబ్ గోస్వామి. మీడియా రంగానికి దేవుడిచ్చిన బహుమతిగా తనకు తాను చాలా సార్లే అభివర్ణించుకున్నాడు లేండి.

తన ‘న్యూస్ అవర్’ ప్రస్థానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో ఇక లాభం లేదునకుని ఈ మధ్యే సొంతంగా రిపబ్లిక్ అనే ఛానెల్ పెట్టుకుని కానిచ్చేస్తున్నాడు. పక్కా హిందుత్వ వాదాన్ని, దేశ భక్తిని చాటుకుంటున్నాడు( అని ఆర్నబ్ ఫీలింగ్). అఫ్ కోర్స్ దీనివెనకాల బీజేపీ హస్తం ఉందన్న టాక్ కూడా ఒకటి ఉందనుకోండి. మరి పార్టీ కోసం ఏదో ఒక సాయం చేయాలిగా.. అందుకే కాషాయంపై కామెంట్లు చేసేవారిని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేస్తున్నాడు.

ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాంతీయ రాజకీయాలనుద్దేశించి ఉత్తర, దక్షిణ భారతదేశమంటూ ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆర్నాబ్ పవన్ చేసిన ట్వీట్ కు రీట్వీట్ చేశాడు. పవన్ ది స్టుపిడ్ చర్య అని.. కేవలం నటుడే తప్ప, మంచి పౌరుడు కాదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టాలని చూస్తున్నాడంటూ ట్వీట్ పెట్టాడు. దీనికి అభిషేక్ తివారీ అనే బీజేపీ నేత రిప్లై సందేశం కూడా పెట్టాడు. ఇందులో రాజకీయ కోణం ఎంత ఉందన్నది, ఆర్నబ్ అరుపుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న క్రమంలో దీనిపై జనసేన గానీ, పవన్ గానీ స్పందించాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల మాట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republic TV editor  Arnab Goswami  Pawan Kalyan  

Other Articles

 • Bihar ki beti vs opposition s losing strategy

  నితీష్ కుమార్ అధికారపక్షానికి మోకరిల్లుతున్నారా..?

  Jun 24 | బీహార్ సీఎం నితీశ్ కుమార్ వైఖరిని అధికార పక్షానికి మోకరిల్లుతున్నట్లుగా వుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో బీహర్ ముఖ్యమంత్రి, జేడీయు నేత అధికార పక్షానికి చెందిన వ్యక్తికి మద్దతు పలకడమే ఇందుకు కారణం.... Read more

 • Ysrcp chief jagan warn mla roja

  ఫైర్ బ్రాండ్ కు జగన్ గట్టి వార్నింగ్... ఆ కామెంట్లకేనా?

  Jun 22 | ప్రతిపక్ష వైఎస్సార్పీపీ బలమైన మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్ గా పేరుబడ్డ రోజాకు కష్టాలు మొదలయ్యాయా? ప్రతీరోజూ మీడియాలో కనిపించాలనే ఆమె తాపత్రయం ఇరకాటంలో నెడుతుందా?. వైజాగ్ లో అవినీతి కుంభకోణంపై కీలకంగా నిర్వహించిన... Read more

 • Chandrababu quick reaction on iyr krishna rao ousting

  ఐవైఆర్ తొలగింపు.. అసలేం జరిగిందంటే...

  Jun 20 | కేవలం 24 గంటలు కూడా గడవక ముందే ఫేస్ బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేశాడన్న ఆరోపణలపై ఐవైఆర్ కృష్ణారావును బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. చీఫ్... Read more

 • No delay in sending evidence for vijay mallya case says home ministry

  మాల్యాకు బెయిల్ వెనుక వున్నది ఎవరు..?

  Jun 17 | దేశం నుంచి 9 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు తిరిగి అప్పగించాలన్న... Read more

 • Rajinikanth birthday set for political entry

  రజనీ పొలిటికల్ ఎంట్రీ.. మళ్లీ పోస్ట్ పోన్!

  Jun 17 | తమిళనాడు లో అమ్మ మరణం తర్వాత రాజకీయ స్థబ్థత ఏర్పడటం, సరైన నాయకత్వం లేక తంబీలు అల్లలాడిపోవటం చూస్తున్నాం. ఈ క్రమంలో రజనీ రాజకీయ ఆరంగ్రేటం పై బిగ్ డిబేట్ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno