ashok gajapathiraju aware of shiv sena rather than jana sena.. ఆ కేంద్రమంత్రికి శివసేన బాగా తెలుసు..

Ashok gajapathiraju aware of shiv sena rather than jana sena

pawan fan fires against ashok gajapathi raju, pawan fans slams ashok gajapathiraju, jana sena slams union minister, jana sena ashok gajapathiraju, pawan kalyan, jana sena, shiv sena, ashok gajapathi raju, TDP, andhra pradesh

social media and pawan kalyan fans fires on union minister ashok gajapathiraju, says that he is more aware of shiv sena than the jana sena which made victory to come his way.

అశోక్ గజపతిరాజుకు జనసేన కన్నా శివసేన బాగా తెలుసు..!

Posted: 05/11/2017 03:07 PM IST
Ashok gajapathiraju aware of shiv sena rather than jana sena

పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అటు అన్ని సామాజిక మాద్యమాల ద్వారా కేంద్రమంత్రికి సెగ తగిలేలా కామెంట్లు పెడుతున్నారు. తెలుగుదేశం నేతల నిజస్వరూపం ఇదేనని కొందరు కామెంట్లు పెడుతుండగా.. వాడుకుని వదిలేయడం తెలుగుదేశం నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో ఒటమి అంచున నిలిచిన తెలుగదేశం పార్టీని.. ఆ పార్టీ నేతల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ ఎవరో తెలియదనే స్థాయికి టీడీపీ నేతలు దిగజారరంటే వారు ఎంతటి కృతజ్ఞత కలవారో ఇట్టే అర్థమవుతుందని మరికొందరు వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు.

పవన్ కల్యాన్ చేసిన ప్రచారం వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. టీడీపీకి చెందిన నేతలు కేంద్రమంత్రులయ్యారని ఇంకొందరు అంటున్నారు. కేంద్రమంత్రులయ్యాక కొందరు టీడీపీ నేతలకు కేవలం బీజేపి మాత్రమే కనిపిస్తుందని, తమను గెలిపించిన నేతలు, ఓట్లేసిన ప్రజలు కనిపించరని కూడా పవన్ అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం కన్నా కేవలం ఐదు లక్షల పైచిలుకు ఓట్లు సాధించడంతోనూ టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. ఆ ఐదు లక్షల ఓట్లు టీడీపీకి సాధించిపెట్టింది పవన్ జనసైన్యమేనన్న విషయం కూడా కేంద్రమంత్రులు మర్చిపోతారని పవన్ ఫ్యాన్స్ దుయ్యబట్టారు.

పవన్ కల్యాన్.. అశోక్ గజపతి రాజుకు మాత్రం తెలియకపోవడం.. అదే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మాత్రం తెలియడంలో ఒక తేడా వుందని, అదే ఆయనకు లభించిన కేంద్రమంత్రి పదవని ఇంకోందరు పవన్ ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజకు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన సస్పెన్షన్ విధించిన క్రమంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పరిచయమైన తరువాత.. ఆయనకు మరెవరూ తెలియడం లేదన్న విమర్శలు మాత్రం పవన్ కల్యాన్ ఫాన్స్ అందరిలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇక మరికొందరు మాత్రం ఆయనకు అధికారాన్ని అందించిన జనసేన కన్నా.. శివసేన మాత్రమే బాగా తెలుసునని అంటున్నారు.

పపన్ ఎవరో తెలియదని అశోక్ గజపతిరాజు చెప్పడం సిగ్గు చేటని జనసేన నేత పోతిన వెంకట మహేష్ విమర్శించారు. 2014 ఎన్నికల్లో అశోక్ ఎంపీగా గెలిచేందుకు పవన్ కల్యాణే కారణమని ఆయన అన్నారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆయనను విజయనగరం ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరారు. అశోక్ గజపతిరాజులో రాచరికపు అహంభావ పోకడలు ఇంకా పోలేదని మహేష్ మండిపడ్డారు. పవన్ పై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... రాష్ట్ర ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అయితే ఈ వివాదానికి టీడీపీ నేతలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో.. వేచి చూడాలి. లేక అగ్నికి అజ్యం పోస్తారో అన్నది కాలమే తేల్చాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  shiv sena  ashok gajapathi raju  TDP  andhra pradesh  

Other Articles

 • Amit shah tour telugu cms silent

  అమిత్ షా టూర్.. ఇద్దరు చంద్రుళ్ల సైలెన్స్

  May 23 | దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంతో పాగా వేసేందుకు కమలనాథుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగటం చూశాం. ముందుగా తెలంగాణలో షా పర్యటన నిర్విఘ్నంగా కొనసాగుతుండంగా గులాబీ దళాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం... Read more

 • Vijayashanti takes you turn to politics

  టీడీపీలోకి విజయశాంతి?

  May 19 | త్వరలో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని సినిమాలతో బిజీ అయిపోతానని ఆ మధ్య చెప్పిన విజయశాంతి మళ్లీ వెంటనే మాట మార్చేసింది. కళ కళేనన్న ఆమె ఇంకోవైపు రాజకీయ ప్రస్థానం కూడా కొనసాగిస్తానని చిరు... Read more

 • Jd lakshmi narayana to take charges as hyderabad police boss

  హైదరాబాద్ పోలీస్ బాస్ గా లక్ష్మీనారాయణ..?

  May 14 | తెలుగువారైన ఐపీఎస్ అధికారులు ఎందరో వున్నారు. కానీ నిరాడంబరుడైన అధికారిగా కొనసాగుతూ.. కేవలం తన పనితీరుతోనే ప్రజల నుంచి మన్ననలు అందుకున్న వారు మాత్రం కొందరే. వారిలో ఒకరు లక్ష్మీనారాయణ. ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు... Read more

 • Arnab goswami comments on pawan kalyan

  పవన్ పై ఆర్నాబ్ తీవ్ర స్థాయిలో విమర్శలు

  May 12 | నా సినిమాలు చూస్తే చూడండి.. లేకపోతే పోండి. ఇది కొంత కాలం క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓపెన్ గా చెప్పిన మాట. అతని మాటకు కట్టుబడే ప్రేక్షకులు కూడా సినిమాలను చాలా దూరం... Read more

 • Sparing gujarat dy cm son jaimin patel from no fly list araises questions

  పౌరవిమానయాన శాఖ అకులు, కంచాలు వేరయా..!

  May 09 | దేశ పౌరవిమానయానంలో అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారా..? లేక అందరి పట్ల ఒకే విధానాన్ని కనబరుస్తున్నారా..? అంటే పక్షపాత ధోరణి వుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయిన వారికి అకుల్లోనూ.. కానీ వారికి కంచాల్లోనూ... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno